S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

06/02/2018 - 00:05

దుత్తలూరు, జూన్ 1 : ఎద్దుల లోడుతో వెళ్తున్న ట్రాలీ ఆటో ముందు చక్రం పంచర్ కావడంతో రోడ్డుపక్కన నిలిపి వేయగా దాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుత్తలూరు మండలం చింతలగుంట గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది. వివరాలిలా ఉన్నాయి.

06/02/2018 - 00:01

డోన్, జూన్ 1:కట్టుకున్న భార్యపై అనుమానంతో కన్నకొడుకును దారుణంగా హత్య చేసి తానూ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం డోన్ మండల పరిధిలోని అనుంపల్లె గ్రామంలో సంచలనం రేపింది. వివరాలు.. అనుంపల్లె గ్రామానికి చెందిన జక్కా నరేష్(28) తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో తన కుమారుడైన 9 సంవత్సరాల గణేష్ తనకు పుట్టలేదనే అనుమానంతో శుక్రవారం పురుగుల మందు తాపించి హత్య చేశాడు.

06/01/2018 - 23:57

అవుకు, జూన్ 1:అవుకు పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామాపురం గ్రామం ఎర్రరాళ్లవాగులో శుక్రవారం ఆటో బోల్తా పడిన సంఘటనలో చాకలి పెద్దరాముడు(63)మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. రామాపురం గ్రామానికి చెందిన చాకలి పెద్దరాముడు తన అల్లుడు రామ్మోహన్‌తో కలిసి అవుకు రిజర్వాయర్ వద్ద చాకలి మూటలను దింపడానికి ఆటోలో బయల్దేరారు.

06/01/2018 - 23:55

టేకుటలపల్లి, జూన్ 1: మండల పరిధిలోని సులానగర్ గ్రామ సమీపంలో ప్రధాన రహదారి పక్కన శుక్రవారం పిడుగుపాటుకు గురై వ్యక్తి మృతి చెందాడు. టేకులపల్లి పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

06/01/2018 - 23:47

క్రోసూరు, జూన్ 1: స్థానిక కన్యకా పరమేశ్వరి దేవస్థానం వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని ప్రమాదవశాత్తు లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన ఇది. క్రోసూరు గ్రామం కొండకింది బజారుకు చెందిన నక్కా రామారావు (40) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

06/01/2018 - 23:47

మాచర్ల రూరల్, జూన్ 1: ప్రమాదవశాత్తు రెండు ద్విచక్ర వాహానలు ఢీ కొన్న సంఘటనలో భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం కంభంపాడు గ్రామ సమీపంలో జరిగింది. మాచవరం మండల పరిధిలోని మోర్జంపాడు గ్రామానికి చెందిన పూజల వెంకటేశ్వర్లు (30) మాచర్ల నుండి మోర్జం పాడు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు కంభంపాడు శివారులోని కుడికాలువ సమీపంలోకి రాగానే అకస్మాత్తుగా వెంకటేశ్వర్లు బ్రేక్ కొట్టాడు.

06/01/2018 - 23:38

చిత్తూరు, జూన్ 1: జంట హత్య కేసులో ప్రధాన నిందితుడైన సీజింగ్ రాజాను శుక్రవారం చిత్తూరు పోలీసులు కస్టడీకి తీసుకొన్నారు. గత నెలలో తమిళనాడుకు చెందిన ఆశోక్ కుమార్, గోపిలను దారుణంగా హత్య చేసి, మృతదేహాలను తమిళనాడు సరిహద్దు అయిన గుడిపాల మండలం పానాటూరు వద్ద పడవేసిన సంగతి తెలిసిందే. ఈకేసును సీరియస్‌గా తీసుకొన్ని చిత్తూరు పోలీసులు రంగంలోకి దిగి ఆర్థిక లావాదేవీలే ఈ హత్యలకు కారణమని గుర్తించారు.

06/01/2018 - 23:38

శ్రీకాళహస్తి, జూన్ 1: శ్రీకాళహస్తి మండలం రామాపురం గ్రామం వద్ద గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని శుక్రవారం పోలీసులు గుర్తించారు. సుమారు 25 సంవత్సరాల వయస్సును యువకుడిని కాల్చి చంపినట్లుగా పోలీసులు నిర్దారణకు వచ్చారు. మృతుడు ఏ ప్రాంతం వ్యక్తి, ఎందుకు కాల్చి చంపారనే విషయాన్ని విచారిస్తున్నారు. సంఘటన జరిగి రెండు రోజులై ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

06/01/2018 - 02:47

కడప, మే 31: ఇళ్లలో ఒంటరిగా ఉన్న మహిళలను హత్యచేసి వారి వద్ద బంగారు నగలు దోచుకున్న ముగ్గురు సభ్యుల హంతక ముఠాను కడప జిల్లా పోలీసులు గురువారం అరెస్టు చేశారు. 2013లో ఈ ముఠా కడప జిల్లా ప్రొద్దుటూరులో వరుసుగా ముగ్గురు మహిళలను హత్యచేసి నగలు దోచుకుంది. ముఠాసభ్యుల్లో అబ్దుల్ కలాం, షేక్ మహ్మద్ ఇషాక్, గౌస్ లాజమ్ ఉన్నారు.

06/01/2018 - 02:02

హైదరాబాద్, మే 31: హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో పనిచేసే ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ గుంజా సామ్యూల్ ఏసుభక్త జోషువా అలియాస్ సామ్యూల్‌ను నగర సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీసీఎస్ డీసీపీ అవినాశ్ మహంతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

Pages