S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

02/25/2020 - 05:11

హైదరాబాద్, ఫిబ్రవరి 24: ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐఎఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్(క్యాట్)లో సోమవారం నాడు విచారణ కొనసాగింది. ఏబీ వెంకటేశ్వరరావు తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. క్యాట్ తదుపరి విచారణను మార్చి 6వ తేదీకి వాయిదా వేసింది. వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం తన కౌంటర్‌ను దాఖలు చేసింది.

02/25/2020 - 04:57

తిరుపతి: పలువురు ప్రజా ప్రతినిధులు, బోర్డు మెంబర్ల సిఫార్సు ఉత్తరాలతో అక్రమంగా వీఐపీల టికెట్లను పొంది బ్లాక్‌లో విక్రయించి భక్తులను మోసం చేసిన ఐదుగురు దళారులను అరెస్టు చేసినట్లు వన్ టౌన్ సీ ఐ జగన్మోహన్ రెడ్డి, టు టౌన్ సీ ఐ చంద్రశేఖర్ తెలిపారు.

02/25/2020 - 04:55

పాటియాల: భారత వైమానిక దళానికి చెందిన శిక్షణ విమానం సోమవారం కుప్పకూలడంతో పైలట్ మృతి చెందగా, ఎన్‌సీసీ క్యాడెట్ తీవ్రంగా గాయపడ్డాడు. పాటియాల విమానయాన క్లబ్ నుంచి శిక్షణ విమానం బయలుదేరింది. రెండు సీట్ల శిక్షణ విమానంలో వింగ్ కమాండర్ జీఎస్ చీమాతో పాటు ఎన్‌సీసీ క్యాడెట్ విపిన్ కుమార్ యాదవ్ కూడా ఉన్నట్లు అధికార ప్రతినిధి తెలిపారు.

02/25/2020 - 04:54

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: ముగ్గురు జ్యుడీషియల్ అధికారులకు జమ్మూ-కాశ్మీర్ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించేందుకు సుప్రీం కోర్టు కొలిజీయం సిఫార్సు చేసింది. జ్యుడీషియల్ అధికారులైన వినోద్ ఛటర్జీ కౌల్, సంజయ్ ధార్, పునీత్ గుప్తాలను న్యాయమూర్తులుగా నియమించేందుకు సిఫార్సు చేసింది.

02/25/2020 - 04:50

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: జార్ఖండ్‌లో ఆకలిచావు, దేశ వ్యాప్తంగా ఏకపక్షంగా మూడు కోట్ల రేషన్‌కార్డుల రద్దు చేశారన్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. దీనిని రుజువు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది.

02/25/2020 - 04:50

న్యూఢిల్లీ: పదిహేడో లోక్‌సభ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా తమ సమాధానం పంపించాలని సుప్రీం కోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఇంతకు ముందు 17వ లోక్‌సభ ఎన్నికలపై దాఖలైన అన్ని పిటిషన్లను కలిపి విచారణ చేపడతామని చెప్పడం తెలిసిందే.

02/25/2020 - 00:59

చిత్తూరు, ఫిబ్రవరి 24: అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై పైశాచికంగా ప్రవర్తించి ప్రాణాలు తీసిన మానవ మృగానికి మరణ దండన విధిస్తూ చిత్తూరు జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి వెంకటహరినాధ్ సోమవారం సంచలన తీర్పు నిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టంచిన ఈ కేసు విచారణ వంద రోజుల్లో ముగిసింది. రాష్ట్రంలో పోక్సో చట్టం వచ్చిన తరువాత ఇదే తొలి తీర్పు కావడం విశేషం .

02/24/2020 - 04:33

సత్యవేడు: చిత్తూరు జిల్లా సత్యవేడులో పోలీసులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో కోటి రూపాయల గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్న లారీని స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ సెంథిల్ కుమార్ ఆదేశాలతో శ్రీకాళహస్తి రోడ్డులో సీఐ బీపీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. ఆదివారం తెల్లవారుజామున సత్యవేడులోని గోడౌన్‌కు కోటి రూపాయలు విలువచేసే గుట్కాను అక్రమంగా తరలిస్తుండగా గుర్తించారు.

02/24/2020 - 02:27

గన్నవరం, ఫిబ్రవరి 23: గన్నవరం ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆత్కూరు గ్రామం వద్ద అక్రమంగా కారులో రవాణా చేస్తున్న 450 కిలోల గంజాయిని ఎక్సైజ్ పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ కమీషనర్ శ్రీనివాసరావుగన్నవరం ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌లో పట్టుబడిన గంజాయిని పరిశీలించారు.

02/24/2020 - 02:27

కోడూరు, ఫిబ్రవరి 23: సాగరసంగమం హంసలదీవి బీచ్ విశిష్టతను తెలుసుకుని ఈ ఆదివారం హంసలదీవి బీచ్‌కి వెళదామని బయలుదేరిన వారు సాగరసంగమ ప్రదేశంలో స్నానం చేస్తూ ప్రమాదం బారినపడి స్థానిక మత్స్యకారులచే రక్షించబడి సంఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసు, మెరైన్ సిబ్బంది అప్రమత్తపై పాలకాయతిప్పకు చెందిన మత్స్యకారుడు మోకా ఏడుకొండలు నీటిలో మునిగిపోతున్న బాలుడు, తల్లిని ఒడ్డుకు తీసుకువచ్చారు.

Pages