S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/19/2019 - 04:25

పాడేరు, జి.మాడుగుల, జూలై 18: విశాఖ మన్యంలో మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఒకే సారి ఇద్దరు గిరిజనులను బుధవారం అర్ధరాత్రి హతమార్చగా, మరో గిరిజనుడికి దేహశుద్ధి చేసి కలకలం సృష్టించారు. చింతపల్లి మండలం కుడుమసార పంచాయతీ వీరవరం గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన మన్యంలో సంచలనం సృష్టించింది.

07/19/2019 - 04:23

బనగానపల్లె, జూలై 18: పశువుకన్నా హీనంగా ప్రవర్తించాడు ఓ తండ్రి. 11 ఏళ్ల కూతురును భయపెట్టి అత్యాచారం జరిపాడు. మూడు నెలల పాటు ఈ ఘోరం జరుగుతున్నా ఆ చిన్నారి భయంతో తల్లికి చెప్పలేకపోయింది. చివరకు అనుమానం వచ్చిన తల్లి నిలదీయడంతో జరిగిన ఘోరాన్ని ఏకరువుపెట్టింది. దీంతో ఆ తల్లి భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

07/19/2019 - 04:00

న్యూఢిల్లీ : పోలీసులు జరిపే ఎన్‌కౌంటర్లపై తప్పనిసరిగా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) నమోదు చేయాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఎన్‌కౌంటర్లపై పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్-స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో గతంలో జస్టిస్ ఆర్‌ఎం లోథా, జస్టిస్ రోహింటన్ ఫాలీ నారిమన్‌లతో కూడిన ధర్మాసనం ఇచ్చిన మార్గదర్శకాలను అమలు చేయాల్సిదేనని ధర్మాసనం స్పష్టం చేసింది.

07/19/2019 - 02:14

విజయవాడ (క్రైం), జూలై 18: కొత్తపేట పోలీస్టేషన్ పరిధిలోని ప్రగతి ట్రాన్స్‌పోర్టులో దోపిడీకి పాల్పడిన కేసులో నలుగురిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 3.50 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. సూర్యారావుపేట పోలీసు కాంప్లెక్స్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డీసీపీ విజయరావు వివరాలు వెల్లడించారు.

07/19/2019 - 02:05

యాచారం, జూలై 18: ఆటో-కారు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో తల్లీ కొడుకులు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం సాయంత్రం యాచారం మండలం చౌదర్‌పల్లి గేటు సమీపంలో చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదానికి సంబంధించి యాచారం సీఐ మధుకుమార్ కథనం ప్రకారం..

07/19/2019 - 02:04

నేరేడ్‌మెట్, జూలై 18: విధి నిర్వహణలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడి చేసిన ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసిన సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

07/19/2019 - 01:41

హైదరాబాద్, జూలై 18: భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్య ఖ్యాతిని మట్టుపెట్టొద్దని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ , జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.

07/18/2019 - 23:58

న్యూఢిల్లీ, జూలై 18: అయోధ్యలో వివాదాస్పద బాబ్రీ మసీదు- రామజన్మభూమి స్థల వివాదంపై ఏర్పాటైన మధ్యవర్తులు కమిటీని కొనసాగించాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. ఈనెలాఖరు వరకూ కమిటీ పనిచేస్తుంది. ఈలోగా కమిటీ ఇచ్చిన నివేదిక పరిశీలించిన తరువాత ఆగస్టు 1న తుది నిర్ణయం తీసుకుంటామని ఐదుగురు న్యాయమూర్తులతోకూడిన రాజ్యాంగ ధర్మాసనం గురువారం ప్రకటించింది.

07/18/2019 - 22:40

హైదరాబాద్, జూలై 17: ఏ ప్రాతిపదికపై ఎర్రమంజిల్ భవనాలను కూలుస్తారని రాష్ట్ర హైకోర్టు బుధవారం ప్రభుత్వాన్ని నిలదీసింది. పురాతన భవనాల జాబితాను రహస్యంగా ఉంచడం, ఇష్టానుసారం వాటి నిర్మాణాలను కూలదోసే అధికారం ప్రభుత్వానికి లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.

07/17/2019 - 04:31

గోనెగండ్ల, జూలై 16: ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్దమర్రివీడులో మంగళవారం జరిగింది. జయలింగ(34), నవీన్(15) మోటార్‌బైక్‌పై నీళ్లు తెచ్చుకునేందుకు వెళ్తుండగా విద్యుత్ తీగలు తగిలి షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ముందురోజు గాలివానకు విద్యుత్ తీగలు కిందికి వాలాయి.

Pages