S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

02/19/2020 - 04:25

అనంతపురం, ఫిబ్రవరి 18: నకిలీ సర్ట్ఫికెట్ల తయారీలో సిద్ధహస్తుడైన గ్లెయిన్ బ్రిగ్స్‌తో దశాబ్దాలుగా కొందరు పోలీసు అధికారులకు సంబంధాలు ఉండటంపై లోతుగా దర్యాప్తు సాగుతోంది. వీరితో పాటు నకిలీ సర్ట్ఫికెట్లతో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, విదేశాల్లో ఉద్యోగాల్లో ఉన్న వారి వివరాలు సేకరించే పనిలో అనంతపురం జిల్లా పోలీసులు పడ్డారు.

02/19/2020 - 02:56

విజయవాడ, ఫిబ్రవరి 18: అమరావతి రాజధాని కేంద్రంగా భాసిల్లుతున్న నగరంలో ఇళ్ల స్థలాల రేట్లకు రెక్కలు రావటంతో భవన నిర్మాణాలు నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగానికి కనకవర్షం కురిపించడం ప్రారంభమైంది. ప్రధాన రహదారుల వెంట గజం స్థలం ధర లక్ష రూపాయలుపైగా పలుకుతున్న నేపథ్యంలో ఏ ఒక్కరు కూడా ఎలాంటి పరిస్థితుల్లోనూ గజం స్థలంను వదలుకోటానికి సిద్ధపడటం లేదు.

02/19/2020 - 02:56

హనుమాన్ జంక్షన్, ఫిబ్రవరి 18: తణుకు నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్రైవేటు బస్సులో ప్రయాణిస్తున్న యువతిని వేధిస్తున్న యువకుడిని హనుమాన్‌జంక్షన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సంఘటన జరిగిన ఏరియా తమ పరిధిలోనిది కాకపోయినా హనుమాన్‌జంక్షన్ పోలీసులు తొలిసారిగా జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేపట్టి నిందితుడ్ని నూజివీడు కోర్టుకు తరలించారు.

02/19/2020 - 02:49

ఉయ్యూరు, ఫిబ్రవరి 18: మండలంలోని కాటూరు గ్రామంలో ఈ నెల 10 అర్ధరాత్రి రియల్టర్ ఇంటిలో జరిగిన దొంగతనంలో చోరీకి పాల్పడిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. పట్టణ పోలీస్టేషన్ ప్రాంగణంలో విజయవాడ పోలీసు కమీషనర్ ద్వారకాతిరుమలరావు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కేసును చేధించిన విధానాన్ని ఆయన వివరించారు.

02/19/2020 - 02:46

ఘట్‌కేసర్, ఫిబ్రవరి 18: అవినీతి సొమ్ముకు అలవాటుపడ్ట బిల్ కలెక్టర్ పది వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన సంఘటన పోచారం పురపాలక సంఘం ఇస్మాయిల్‌ఖాన్‌గూడ వార్డు కార్యాలయంలో మంగళవారం జరిగింది.

02/19/2020 - 02:45

ఖైరతాబాద్, ఫిబ్రవరి 18: అమీర్‌పేటలోని అపరిచితకాలనీలో దొంగలు భీభత్సం సృష్టించారు. మంగళవారం తెల్లవారు ఝామున ఓ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు దోపిడిని అడ్డుకునేందుకు యత్నించిన మహిళపై దాడి చేసి పరారు అయ్యారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అపరిచతకాలనీలో పద్మరాఘురాజ్ (86), ఆమె కుమార్తె నందిత కపూర్ (56) మనవరాలు కీర్తి (24)లతో నివాసం ఉంటుంది.

02/19/2020 - 02:44

తాండూరు, ఫిబ్రవరి 18: ఆర్టీసీ బస్టాండ్‌లో నిలిపి ఉంచిన బస్సును చోరీ చేసి ఉడాయించిన దుండగుడిని పోలీసులు పట్టుకున్నారు. ఆర్టీసీ డిపోలో క్యాజువల్ ఉద్యోగిగా (బస్‌ల వాషింగ్ సెంటర్)లో పని చేస్తున్న అంజనేయులు రెండు రోజుల క్రితం తాండూరు కరన్‌కోట్ మీదుగా ఓగీపూర్ వెళ్లేందుకు పాయింట్‌పై ఉన్న నైట్ హాల్ట్ బస్సును తాగిన మైకంలో తస్కరించాడని పట్టణ సీఐ ఎస్.రవికుమార్, ఎస్సై ఏడుకొండలు తెలిపారు.

02/19/2020 - 02:43

గచ్చిబౌలి, ఫిబ్రవరి 18: ఐటీ ఉద్యోగులు మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో మానసిక ఒత్తిడితో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం సన్ని బాబు (33) గచ్చిబౌలి జెన్‌ప్యాక్ ఐటీ సంస్థలో ఐదు సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తన బావ సంపత్ కుమార్‌కు మెయిల్ పంపాడు.

02/19/2020 - 02:39

సనత్‌నగర్, ఫిబ్రవరి 18: అతివేగం ఓ యువకుడి ప్రాణాలను బలిగొనగా మరో ఐదుగురు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. మంగళవారం తెల్లవారుజామున అతివేగంతో ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ఫ్లై ఓవర్ పై నుంచి కింద పడింది. బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై జరిగిన ప్రమాదం మరవక ముందే అదే తరహాలో నగరంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు తీవ్రగాయాలు పాలుకాగా 20 ఏళ్ల సోహెల్ మృతి చెందాడు.

02/19/2020 - 01:36

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: వైవాహిక జీవితానికి తెర పడినంత మాత్రాన తల్లిదండ్రుల బాధ్యత కూడా ముగిసినట్లు కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. భార్య భర్తలు విడాకులు తీసుకున్నా తల్లిదండ్రులుగా వారు తమ బాధ్యతను నెరవేర్చాల్సిందేనని తేల్చి చెప్పింది.

Pages