S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

05/23/2019 - 01:17

కులకచర్ల, మే 22: తాగిన మైకంలో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన కులకచర్ల మండలం బొంరెడ్డిపల్లెలో చోటు చేసుకుంది. గ్రామస్థులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అనంత రెడ్డి(33) తాగుడుకు బానిసయ్యాడు. బుధవారం బాగా మద్యం సేవించి అదే మత్తుల్లో ఇంట్లోకి వెళ్లి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

05/23/2019 - 01:17

ఉప్పల్, మే 22: భర్త కళ్లెదుటే భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రామంతాపూర్ కేసీఆర్ నగర్‌లో నివసిస్తున్న సీహెచ్.యాదయ్య (55) కూలీ పని చేస్తుండేవాడు. భార్య నిర్మల, ఇద్దరు పెళ్లైన కూతుర్లు ఉన్నారు. కూతుర్లు అత్తింటివారిలో ఉండగా ప్రస్తుతం ఇద్దరే ఇంట్లో ఉంటున్నారు.

05/23/2019 - 01:16

ఘట్‌కేసర్, మే 22: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఇంజనీరింగ్ విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధి బైపాసు రోడ్డు వద్ద బుధవారం జరిగింది.

05/23/2019 - 01:16

గచ్చిబౌలి, మే 22: రాయదుర్గం పోలీసు పరిధిలోని ఖాజగూడ చౌరస్తాలో ఇటుకల లారీ.. స్కూల్ బస్సు ను ఢీకొట్టి బీభ త్సం సృష్టించింది. ఆ సమయంలో స్కూల్ బస్సులో విద్యార్థులు లేకపోవడతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదానికి సంబంధించి పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి.

05/23/2019 - 01:15

వికారాబాద్, మే 22: పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి ఆర్టీఏ కార్యాలయ సూపరింటెండెంట్ చిక్కిన సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించి ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్ తాండూరుకు చెందిన రమేశ్ లారీ ఆర్‌సీ తీసుకునేందుకు వస్తే రూ.10వేలు డిమాండ్ చేశారు.

05/23/2019 - 05:02

హైదరాబాద్: టీవీ-9 మాజీ సీఈఓ రవిప్రకాశ్‌కు మరోమారు హైకోర్టులో చుక్కెదురైంది. రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ పిటీషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. బుధవారం నాడు జరిగిన వాదనలకు రవిప్రకాశ్ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది దిల్‌జిత్ సింగ్ అహ్లువాలియా హాజరయ్యారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో కేసు నడుస్తుండగా పోలీసులు రవిప్రకాశ్‌పై అక్రమంగా కేసుపెట్టారని రవిప్రకాశ్ న్యాయవాది వాదించారు.

05/23/2019 - 01:31

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టుకు మరో నలుగురు న్యాయమూర్తుల నియామకాన్ని కేంద్రం ఖరారు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. సుప్రీం కోర్టు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఈ నలుగురి నియామకంతో న్యాయమూర్తుల సంఖ్య 31కి చేరుకుంది. ప్రధాన న్యాయమూర్తితో సహా 31 మంది ఉండాల్సిన సుప్రీం కోర్టులో ప్రస్తుతం 27 మంది న్యాయమూర్తులు ఉన్నారు.

05/22/2019 - 22:17

శ్రీనగర్, మే 22: బాందీపుర రేప్ కేసులో త్వరలోనే చార్జిషీట్ దాఖలు కానుంది. ఉత్తర కాశ్మీర్‌లోని బాందీపుర జిల్లాలో మూడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టిన తాహిర్ అహ్మద్ మీర్‌ను పోలీసులు ఇది వరకే అరెస్ట్ చేశారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోనేగాక, దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసుపై పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

05/22/2019 - 04:46

విజయవాడ (క్రైం), మే 21: ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఈవీఎంల కంటే ముందుగా వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలని దాఖలైన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. ఈనెల 23వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈవీఎంల కంటే ముందుగా ఐదు వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని న్యాయవాది వై బాలాజీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

05/22/2019 - 04:34

ఆదిలాబాద్ మున్సిపాలిటీ, మే 21: ఆదిలాబాద్ పట్టణ శివారులోని కస్తాల రామకిష్టు కాలనీలో రోడ్డు పక్కనే మొండెం లేని శిశువు తలభాగం లభ్యం కావడం కలకలం రేపింది. అక్రమ సంబంధంతో పుట్టిన శిశువును చంపి పడవేశారా..? లేదా ఇతర ప్రాంతం నుండి కుక్కలు పట్టుకువచ్చి రోడ్డుపై పడేశాయా అన్నది చర్చనీయాంశంగా మారింది.

Pages