S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

05/01/2019 - 02:00

హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో బహిర్గతవౌతున్న వరుస హత్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. నరహంతకుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి చేసిన వరుస హత్యలలో ఇప్పటికే పోలీసులు ముగ్గురు బాలికల మృతదేహాలను బయటకుతీసారు. అలాగే కర్నూల్‌లో శ్రీనివాస్‌రెడ్డిపై వ్యభిచారిని హత్యచేసిన కేసు నమోదైనట్లుగా పోలీసులు చెప్పారు.

05/01/2019 - 01:23

సైదాబాద్, ఏప్రిల్ 30: ఆస్తి వివాదంతో సవతి తల్లిపై పగను పెంచుకున్న కానిస్టేబుల్ ఆమె కళ్లలో కారం చల్లి కొడవలితో నరికి చంపాడు. మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ విషాదకర ఘటన వివరాలు ఈవిధంగా ఉన్నాయి. మాదన్నపేట బోయబస్తీకి చెందిన కొలన్ యాదయ్య అక్కా చెళ్లెల్లను పెళ్లి చేసుకున్నాడు.

05/01/2019 - 01:08

నేరేడ్‌మెట్: ఒకవైపు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు మరువకముందే ఐఐటీలో ర్యాంకు వస్తుందో రాదో అన్న భయంతో ఒక విద్యార్థి తండ్రి గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సికిందరాబాద్‌లోని నేరేడ్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ నరసింహ తెలిపిన వివరాల ప్రకారం..

04/30/2019 - 23:44

భీమవరం, ఏప్రిల్ 30: తల్లితో కలిసి నడిచివెళుతున్న ఒక యువతిని ఒక యువకుడు కారులో కిడ్నాప్ చేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో మంగళవారం కలకలం సృష్టించింది. యువతిని తీసుకెళుతున్న కారు అతివేగంగా వెళుతూ ప్రమాదానికి గురికావడం, అందులోని యువకుడికి స్థానికులు దేహశుద్ధి చేయడం, తదనంతరం ఇదంతా ప్రేమ వ్యవహారమని తేలింది. కిడ్నాప్ సమయంలో జరిగిన పెనుగులాటలో యువతి తల్లికి తీవ్ర గాయాలయ్యాయి.

04/30/2019 - 23:31

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: రాఫెల్‌పై రివ్యూ పిటిషన్లకు సంబంధించి మే 4వ తేదీలోగా సమాధానం చెప్పాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఫ్రాన్స్ రాఫెల్ కంపెనీ నుంచి 36 యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను డిసెంబర్‌లో సుప్రీం కోర్టు కొట్టివేసింది.

04/30/2019 - 23:26

చెన్నై, ఏప్రిల్ 30: మద్రాసు హైకోర్టులో మంగళవారం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీకి, కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర పాలిత ప్రాంతమయిన పుదుచ్చేరిలో ఎన్నికయిన ప్రభుత్వం నిర్వహించే రోజువారీ వ్యవహారాలలో లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం చేసుకోజాలరని హైకోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు పట్ల పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణసామి హర్షం వ్యక్తం చేశారు.

04/30/2019 - 23:20

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ)ని ఉల్లంఘించినప్పటికీ ఎన్నికల సంఘం (ఈసీ) ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ దాఖలయిన ఒక పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం ఈసీకి నోటీసు జారీ చేసింది.

04/30/2019 - 23:20

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సర్వోన్నత న్యాయ స్థానం మాజీ ఉద్యోగిని మంగళవారం జరిగిన ‘ఇన్ హౌస్’ విచారణ నుంచి వాకౌట్ చేసింది. ఈ విచారణ సమయంలో పరిస్థితి చాలా భయాన్నిగొలిపేలా ఉందని ఆమె ఆరోపించారు. తన లాయర్‌ను లోపలికి అనుమతించలేదని ఆరోపించడంతో పాటు అనేక అంశాలపై కూడా ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది.

04/30/2019 - 04:17

గరిడేపల్లి, ఏప్రిల్ 29: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి రెవెన్యూ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్ రూ. 8వేలు లంచం రైతు నుంచి తీసుకుంటుండగా సోమవారం ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. మండలంలోని కుతుబిషాపురం గ్రామానికి చెందిన కారింగుల లింగయ్యకు వారసత్వంగా వచ్చిన భూమికి సంబంధించిన రికార్డులు మార్చి రెవిన్యూ సిబ్బంది పట్టా చేశారు.

04/30/2019 - 04:15

కొల్చారం, ఏప్రిల్ 29: అతి వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు.. బైక్‌ను ఢీకొట్టిన సంఘటనలో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సోమవారం మెదక్ జిల్లా కొల్చారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నర్సాపూర్ మండలం చిప్పల్‌తుర్తి గ్రామశివారులో రంజ్య తండాకు చెందిన మాలోవత్ రమేశ్ (38), జ్యోతి (32)లు మెదక్ మండలం బూర్గుపల్లి గ్రామానికి పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్నారు.

Pages