S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

06/26/2019 - 04:27

బంగారుపాళ్యం, జూన్ 25: అక్రమంగా తరలిస్తున్న గంజాయి వాహనాన్ని మంగళవారం స్వాధీనం చేసుకున్నట్లు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ఎస్సై రామకృష్ణ తెలిపారు. మండలంలోని నలగాంపల్లి జాతీయ రహదారిపై మంగళవారం వాహనాలను తనిఖీ చేస్తుండగా నెల్లూరు నుంచి బెంగళూరుకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న టాటా సుమోను స్వాధీనం చేసుకొని డ్రైవర్ శివయ్యను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

06/26/2019 - 04:24

మదనపల్లె, జూన్ 25: 300 జిలిటిన్‌స్టిక్స్, 200 డిటోనేటర్ల పేలుడు పదార్థాలను మంగళవారం సాయంత్రం చిత్తూరు జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

06/26/2019 - 04:08

హైదరాబాద్, జూన్ 25: పేర్వారం రాములు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా వ్యవహరించిన సమయంలో శంషీర్‌గంజ్ పోలీసు స్టేషన్‌లో ఇనస్పెక్టర్‌గా పనిచేస్తున్న ఎం మాధవరెడ్డిని వేధించిన కేసుకు సంబంధించి సిటీ సివిల్ కోర్టు తాజాగా పేర్వారం రాములకు కోర్టు వారెంట్లు జారీ చేసింది.

06/26/2019 - 03:50

నర్సీపట్నం, జూన్ 25: సీపీఐ మావోయిస్టు పార్టీ కోరుకొండ, పెదబయలు ఏరియా కమిటీకి చెందిన దళ సభ్యుడితో పాటు ఐదుగురు మిలీషియా సభ్యులు మంగళవారం జిల్లా అదనపు ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు( ఆపరేషన్స్) ఎదుట లొంగిపోయారు.

06/26/2019 - 01:48

ఉప్పల్, జూన్ 25: తాగిన మైకంలో ఇరువురి మధ్య జరిగిన ఘర్షణ.. ఒకరి హత్యకు దారితీసింది. ఈ సంఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్ తుకారంగేట్‌లో నివసిస్తున్న మెరుగు లక్ష్మణ్ కుమారుడు సాయి ప్రసాద్ (31) ఆటో డ్రైవర్. అతడు చిల్కానగర్‌లో బంధువుల ఇంట్లో ఆదివారం జరిగిన ఫంక్షన్‌కు వచ్చిన తండ్రి లక్ష్మణ్‌ను తీసుకెళ్లడానికి సోమవారం వచ్చాడు.

06/26/2019 - 01:47

ఉప్పల్, జూన్ 25: ఉప్పల్ రింగ్ రోడ్డు బస్టాప్‌లో నిల్చొన్న మహిళను వేధించిన ఇద్దరు వ్యక్తులకు ప్రత్యేక కోర్టు నాలుగు రోజులు జైలు శిక్ష విధించినట్లు ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్ రవిబాబు తెలిపారు.

06/26/2019 - 01:08

హైదరాబాద్, జూన్ 25: తెలంగాణలో పురపాలక సంఘాల ఎన్నికల ప్రక్రియకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం ప్రక్రియను ఐదు నెలల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జే శ్రీనివాసగౌడ్ పురపాలక సంఘాలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై జస్టిస్ పి నవీన్‌రావు విచారణ చేపట్టారు.

06/26/2019 - 00:34

విశాఖపట్నం, జూన్ 25: విశాఖ జిల్లా సబ్ డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ ఏసీబీకి చిక్కారు. కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో అవకతవకల్లేవని సర్టిఫై చేసేందుకు 200 గజాల స్థలాన్ని తనకు ఇవ్వాలని విశాఖ వన్‌టౌన్ కోఆపరేటివ్ సొసైటీ అధికారి మోషే డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధితుడు ఆస్తిని మోషే సోదరుడి పేరిట రిజిస్ట్రేషన్ చేస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

06/26/2019 - 04:47

న్యూఢిల్లీ: ఢిల్లీ కోర్టు మంగళవారంనాడు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే మనోజ్ కుమార్‌కు మూడు నెలల జైలు శిక్ష విధించింది. 2013 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయంలో తూర్పు ఢిల్లీలోని ఒక పోలింగ్ బూత్‌లో అడ్డంకులు సృష్టించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

06/25/2019 - 23:22

చెన్నై, జూన్ 25: దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళిని శ్రీహరన్‌కు స్వయంగా వాదించుకునేందుకు మద్రాస్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. తన కుమార్తె వివాహం సందర్భంగా తగిన ఏర్పాట్లు చేసుకునేందుకు వీలుగా ఆరు నెలలపాటు సాధారణ సెలవు కావాలని ఆమె చేసిన అభ్యర్థనపై హైకోర్టు స్పందించింది. జూలై 5న కోర్టుకు హాజరై తన వాదనలను స్వయంగా విన్నవించుకోవాలని హైకోర్టు సూచించింది.

Pages