S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

04/28/2018 - 00:03

తెర్లాం, ఏప్రిల్ 27: మండలంలో రెండు గ్రామాల్లో ఒకేసారి దొంగతనాలు జరిగాయి. ఇందుకు సంబంధించి ఏ ఎస్ ఐ అర్జునరావు అందించిన వివరాల ప్రకారం మండలం వెలగవలస, రంగప్పవలస గ్రామాల్లో గురువారం రాత్రి గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు.

04/27/2018 - 23:53

తిరుపతి, ఏప్రిల్ 27: అటవీప్రాంతంలో అనుమతిలేని రిజర్వ్ ఫారెస్ట్‌లో వన్యప్రాణులు వేటాడే ముఠాలోని ఒక వ్యక్తిని పట్టుకుని అతని నుండి నాటుతుపాకీ, మం గుండు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌పోర్స్ డీఎస్పీ హరినాథ్‌బాబు తెలిపారు. బుధవారం రాత్రి వాసు ఆధ్వర్యంలోని టాస్క్ఫోర్స్ సిబ్బంది దేవరకొండ నుండి దెయ్యాలకోన వరకు కూంబింగ్ చేశారు.

04/27/2018 - 20:39

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా చిన్నారి అత్యాచారం, హత్య కేసు విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. మే ఏడవ తేదీ వరకు ఎలాంటి దర్యాప్తు చేపట్టవద్దని ఆదేశించింది. ఈ కేసును చండీగడ్‌కు బదిలీ చేయాలని, సీబీఐ దర్యాప్తు చేయాలని పిటిషన్లు వస్తున్న నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

04/27/2018 - 03:52

వెంకటాపురం(నూగురు) 26: స్టేట్ బ్యాంక్ ఆఫీసర్లమంటూ ఏటిఎం కార్డు బ్లాక్ అయింది రెన్యువల్ చేయాలి, ఏటిఎం కార్డు నెంబరు, పిన్ నెంబరు తెలియపర్చాలంటూ గురువారం ఉదయం మండల కేంద్రమైన వెంకటాపురంలో ఆర్‌అండ్‌బి ఉద్యోగి కుర్సా మల్లిఖార్జున్‌రావు సెల్‌కు ఫోన్ చేశారు. బ్యాంకు ఆఫీసర్ల అని నమ్మి బీర్వాలో ఉన్న ఏటిఎం కార్డు నెంబరు చెప్పారు.

04/27/2018 - 03:48

వర్ధన్నపేట, ఏప్రిల్ 26: వివాహాల పేరుతో ఆన్‌లైన్ వివాహ పరిచయ వేదికలను అడ్డాగా మార్చుకుని ఒం టరి మహిళలను, యువతులను మో సం చేస్తు డబ్బులు డ్రా చేసి కాజేస్తు న్న ఓ ఘరానా మోసగాడిని వర్ధన్నపే ట పోలీసులు అరెస్ట్ చేశారు.

04/27/2018 - 03:44

మానకొండూర్, ఏప్రిల్ 26: మానకొండూర్ మండల పరిధిలోని కొండపల్కల గ్రామంలో గురువారం ప్రమదవశత్తూ నీటి తొట్టికూలీ పింగిల్లి పద్మ(42) అనే మహిళా కౌలు రైతు మృతి చెందిన్నట్లు గ్రామస్థులు తెలిపారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం కొండపల్కల గ్రామానికి చెందిన పింగిల్లి రవింధర్‌రెడ్డి పద్మ అనే ఇద్దరు భార్యా భర్తలకు భూమి లేక పోవడంతో ఇదే గ్రామాంలో ఏడు ఏకరాలను కౌలుకు తీసుకుని వరిపంటను సాగు చేసుకుంటున్నారు.

04/27/2018 - 03:43

ముకరంపుర కరీంనగర్, ఏప్రిల్ 26: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా గుట్కాను సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను కరీంనగర్ టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి, వారి నుంచి గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

04/27/2018 - 02:59

చింతపల్లి, ఏప్రిల్ 26: అప్పుల బాధ తాళలేక మండలంలోని కొరిమేడు గ్రామానికి చెందిన అనంతుల సత్యనారాయణగౌడ్(53) అనే రైతు బుధవారం రాత్రి పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, హైద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. భార్య కాశమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ నాగభూషణ్‌రావుతెలిపారు.

04/27/2018 - 02:26

విజయవాడ (క్రైం), ఏప్రిల్ 26: చోరీ కేసుల్లో ముగ్గురిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రెండు వేలు విలువైన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. పెజ్జోనిపేటకు చెందిన బెల్లంకొండ నాగేంద్రబాబు అలియాస్ బాబు(35) సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. రాజరాజేశ్వరీపేటకు చెందిన గొడా లింగమయ్య(23) టాపీ పని చేస్తుంటాడు.

04/27/2018 - 01:43

చీరాల, ఏప్రిల్ 26: క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న బృందాన్ని ఒకటవ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని లక్ష్మీ థియేటర్, బండపాలెం ప్రాంతాలలో బెట్టింగ్ జరుగుతుందన్న సమాచారం మేరకు సీఐ సూర్యనారాయణ ఆదేశాలతో సిబ్బంది దాడులు నిర్వహించారు.

Pages