S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

08/28/2018 - 23:41

ఆదిలాబాద్ మున్సిపాలిటీ, ఆగస్టు 28: మహారాష్టక్రు చెందిన చిరు వ్యాపారిని కిడ్నాప్ చేసి మూడు రోజులు నిర్భందించిన ముఠాను ఎట్టకేలకు పోలీసులు ఛేదించి అరెస్ట్ చేశారు. మంగళవారం మావల పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేక ర్ల సమావేశంలో రూరల్ సిఐ ప్ర దీప్‌కుమార్ కేసు వివరాలు వెల్లడించారు.

08/28/2018 - 23:24

ఆలూరు, ఆగస్టు 28: మండలంలోని తుంబళవీడు గ్రామంలో వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన భర్త నెరణికి రామయ్య(65) భార్య బోయ వన్నూరమ్మ(60)లు సోమవారం రాత్రి 11.30 సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

08/28/2018 - 23:08

యర్రగొండపాలెం, ఆగస్టు 28: నిత్యం మద్యం సేవించి తల్లిని తిడుతూ కొడుతుంటే చూడలేక కూతురు, చెడువ్యసనాలకు బానిసైన భర్త వేళాపాళా లేకుండా వేధింపులకు గురిచేస్తూ నరకయాతన చూపిస్తుంటే తాళలేక మనస్తాపానికి గురై భార్య చీరకొంగుతో ఉరి వేసుకొని మృతి చెందిన సంఘటన మంగళవారం తెల్లవారుఝామున పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.

08/28/2018 - 22:48

అల్లవరం, ఆగస్టు 28: వివాహం నిశ్చయమై ఏడాథి గడుస్తున్నా పెళ్లి చేసేందుకు అత్తగారు జాప్యం చేస్తోందని ఆగ్రహించిన అల్లుడు ఆమెపై కత్తితో దాడిచేసి హత్య చేసిన సంఘటన అల్లవరం మండలం ఓడలరేవు గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. ఈ దాడిలో పొన్నమండ విష్ణుకుమారి (50) మృతి చెందింది.

08/28/2018 - 22:34

గోరంట్ల, ఆగస్టు 28 : మండల పరిధిలోని చలమయ్యగారిపల్లి వద్ద పొలాల్లో గుర్తు తెలియని యువకుడు (20) శవం లభ్యమైనట్లు సీఐ రవికుమార్ తెలిపారు. గ్రామ సమీపంలో శవం పడి ఉందని స్థానికులు సమాచారం అందివ్వగా ఎస్సై సుధాకర్ యాదవ్ తమ సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారన్నారు. మృతదేహం తలపై కొట్టిచంపినట్లుగా తీవ్ర గాయమైందన్నారు.

08/28/2018 - 20:09

హైదరాబాద్: తెలంగాణలో ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు విధానాన్ని హైకోర్టు కొట్టివేసింది. పంచాయతీరాజ్, ప్రభుత్వ ఉపాధ్యాయులను ఒకే సర్వీసు కిందకు పరిగణిస్తూ గతంలో ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఈ అంశంపై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వ ఆదేశాలను కొట్టివేస్తున్నట్లు తీర్పు చెప్పింది.

08/28/2018 - 18:55

హైదరాబాద్: సంచలనం సృష్టించిన గోకుల్‌ఛాట్, లుంబినీ పార్కు జంట బాంబు పేలుళ్ళ కేసుపై తీర్పు సెప్టెంబర్ 4న వెలువడనున్నది. సోమవారం కేసు విచారణను చర్లపల్లి సెంట్రల్ జైలులోని ప్రత్యేక కోర్టులో సెషన్స్ జడ్జి శ్రీనివాస రావు తీర్పును వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేశారు.

08/28/2018 - 18:32

న్యూఢిల్లీ/శ్రీనగర్, ఆగస్టు 27: కాశ్మీరీ యువతిని హోటల్‌కు తీసుకెళ్లిన ఘటనలో దోషిగా తేలడంతో మేజర్ లీతుల్ గొగాయ్‌పై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని ఆర్మీ కోర్టు ఆదేశించింది. ఈ విషయాన్ని ఆర్మీ అధికార వర్గాలు సోమవారం ధృవీకరించాయి. విధి నిర్వహణలో ఉంటూనే గొగాయ్ మే 23న స్థానిక 18 ఏళ్ల యువతిని తీసుకుని సుదూరంలోని హొటల్‌కు వెళ్లాడు.

08/28/2018 - 18:28

అహ్మదాబాద్, ఆగస్టు 27: గోధ్రాలో రైలుకు నిప్పంటించి 59 మంది సజీవదహనానికి కారణమైన కేసుకు సంబంధించి మరో ఇద్దరికి ప్రత్యేక కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ముగ్గుర్ని కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇప్పటికి 33 మంది దోషులకు శిక్షలుపడ్డాయి. 2002 ఫిబ్రవరి 27న గోధ్రా రైలు మారణకాండలో 59 మంది కరసేవకులు మృతి చెందారు.

08/28/2018 - 00:47

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 27: అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లితో వెళ్లిన ఓ చిన్నారి అదే స్కూల్ బస్సు కిందపడి దుర్మరణం చెందిన సంఘటన ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి స్థానికులు, బంధువుల కథనం ప్రకారం బొంగ్లూరు గ్రామంలోని అంతఃపురం కాలనీకి చెందిన చందన, వెంకటేష్ దంపతుల కుమార్తె ప్రతీక (2) అన్న బొంగ్లూరు గేటు సమీపంలో ఉన్న సాహితీ పాఠశాలలో చదువుతున్నాడు.

Pages