S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

05/02/2018 - 03:54

మంచిర్యాల, మే 1: మంచిర్యాల పట్టణంలోని శ్రీ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల సోమవారం రాత్రి హాజీపూర్ ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ అధికారి అభిష్పా వర ప్రదాయిని ( 35) సోమవారం రాత్రి మృతి చెందిందని బంధువులు, తోటి సహాద్యోగులు ఆరోపించారు.

05/02/2018 - 03:51

కౌటాల, మే 1: చింతలమానేపల్లిపోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ అన్కోండ గ్రామానికి చెందిన వివాహిత ధన్నూరి సోనుబాయి (19) అదృశ్యం అయిన ఘటనలో కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజ్‌కుమార్ తెలిపారు.

05/02/2018 - 03:29

ఆత్మకూరు, మే 1: మండల పరిధిలోని తిప్డంపల్లి శివారులో మంగళవారం సాయంత్రం వరికోత మిషన్ కింద పడి ఇద్దరు మృతిచెందారు. ఆత్మకూరు ఏఎస్‌ఐ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తిప్డంపల్లి గ్రామానికి చెందిన వడ్డెరాములు వరిపొలంలో కోత మిషన్ ద్వారా వరిపైరు కోస్తోంది.

05/02/2018 - 02:59

నిజామాబాద్, మే 1: అడ్డదారుల్లో అక్రమ సంపాదనకు రుచిమరిగిన ఇసుక మాఫియా బరితెగిస్తోంది. తమ అక్రమ దందాకు అడ్డుగా నిలుస్తున్న అధికారులపై భౌతిక దాడులకు సైతం వెనుకాడడం లేదు. తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సుంకిని శివారులో మంజీరా నది సాక్షిగా మంగళవారం చోటుచేసుకున్న సంఘటన ఇసుక స్మగ్లర్ల బరితెగింపు ధోరణికి అద్దం పట్టింది.

05/02/2018 - 02:41

చింతపల్లి, మే 1: మండలంలోని గడియాగౌరారం సమీపంలో హైద్రాబాద్-సాగర్ రోడ్డు మార్గంలో మంగళవారం డిసిఎం, బైక్ ఢీ కొన్న రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. గుంటూరు జిల్లా కారంపుడికి చెందిన తాపిమేస్ర్తీ దేవేండ్ల ఏడుకొండలు(40) బైక్‌పై స్వగ్రామానికి వెలుతుండగా హైద్రాబాద్ వెలుతున్న డిసిఎం ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

05/02/2018 - 02:25

పెనుగంచిప్రోలు, మే 1: బతుకు తెరువుకోసం ఆలయం వద్ద ఆశ్రయం పొందుతూ అదే గుడికి కన్నం వేశాడు ఒక ప్రభుద్ధుడు. దేవాలయంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక సీసీ కెమెరాలు దొంగతనం చేస్తుండగా ఆ ప్రభుద్ధుడిని పట్టించిన ఘటన పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

05/02/2018 - 01:36

అరకులోయ, మే 1: పోలీసులు ఎస్.ఎఫ్.ఐ. నాయకులపై బనాయించిన కేసును స్థానిక ప్రధమ శ్రేణి ఎగ్జిక్యూటివ్ మండల మెజిస్ట్రేట్ కోర్టు మంగళవారం కొట్టివేసింది. 2016వ సంవత్సరం అక్టోబర్ నెలలో విశాఖపట్నం క్రిష్ణ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న బి.రాజ్‌కుమార్ ప్రాణాంతక వ్యాధికి గురై మృతి చెందాడు.

05/02/2018 - 01:35

కశింకోట, మే 1: నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి పరిమితికి మించి ఆవులను వ్యాన్‌ల్లో తరలిస్తున్న 12 మంది రైతులపై కశింకోట పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

05/02/2018 - 00:44

పొదిలి, మే 1: రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన పొదిలి మండలంలోని అక్కచెరువు గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి జరిగింది. ఆ గ్రామానికి చెందిన ఎం రమణయ్య (43) మరియు అమ్మిరెడ్డి అనే ఇద్దరు మోటార్ సైకిల్‌పై పొదిలి వైపు వస్తుండగా మార్గమధ్యంలో ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో రమణయ్య అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.

05/02/2018 - 00:41

పొదలకూరు, మే 1 : మండలంలోని రామాపురం సమీపంలో దుగ్గుంట వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రామాపురం గ్రామానికి చెందిన వి సుబ్రహ్మణ్యం (35) అనే గిరిజనుడు మృతి చెందాడు. రోడ్డు దాటుతున్న సుబ్రహ్మణ్యంను నెల్లూరు నుంచి రాపూరుకు వెళ్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన ఇతన్ని నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు.

Pages