S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

08/30/2018 - 23:12

తిరుపతి, ఆగస్టు 30: సోమదేపల్లి మ్డంలం మాగి చెరువుకు చెందిన నరసింహమూర్తి అనే వ్యక్తిని గురువారం అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ.12.30 లక్షల విలువచేసే 14 మోటార్ సైకిళ్లను తిరుపతి క్రైం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

08/30/2018 - 23:10

పుత్తూరు, ఆగస్టు 30: వివాహేతర సంబంధం ఒక యువకుడి ప్రాణం తీసిన సంఘటన గురువారం నారాయణవనం మండలంలో చోటు చేసుకునింది. పట్టపగలే ఒక యువకుడు హత్యకు గురికావడంతో మండల ప్రజలు ఉలిక్కి పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి.

08/30/2018 - 23:08

నగరి/చిన్నగొట్టిగల్లు, ఆగస్టు 30: టాస్క్ఫోర్స్ ఐజీ కాంతారావు ఆధ్వర్యంలో అటవీశాఖ సిబ్బంది సినీ ఫక్కీలో ఎర్రచందనం లారీని, ఇద్దరు స్మగ్లర్లను గురువారం వేకువజామున చాకచక్యంగా పట్టుకున్నారు. టాస్క్ఫోర్స్ ఎస్పీ రవిశంకర్ తెలిపిన వివరాల మేరకు టాస్క్ఫోర్స్ బృందం పుత్తూరు మార్గంలో బుధవారం రాత్రి గస్తీ నిర్వహించారు.

08/30/2018 - 23:02

హిందూపురం, ఆగస్టు 30 : గత కొద్ది రోజుల క్రితం హిందూపురంలో రాజకీయ సర్వే నిర్వహిస్తున్న బృందం తమ పార్టీని అణగదొక్కే విధంగా వ్యవహరిస్తోందని వైకాపా నాయకులు నిరసన వ్యక్తం చేసి వారిని సమన్వయ కర్త నవీన్‌నిశ్చల్ ఇంటి వద్ద విచారించిన విషయం విదితమే.

08/30/2018 - 23:00

పామిడి, ఆగస్టు 30 : పెన్నానది బిడ్జ్రి సమీపంలో జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పామిడి ఎస్‌ఆర్ డిగ్రీ కళాశాల లెక్చరర్ సునీల్ (28) మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు వెంగమనాయుడు కాలనీకి చెందిన సునీల్ ఎస్‌ఆర్ డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ద్విచక్ర వాహనంలో అనంతపురం వెళ్తున్న సునీల్ మందు వెళ్తున్న లారీని ఢీకొనటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

08/30/2018 - 22:59

మడకశిర, ఆగస్టు 30 : కట్టుకున్న భర్త తనను మోసం చేస్తున్నాడని ఆవేదనకు గురై భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గురువారం మడకశిరలో చోటు చేసుకొంది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని హరిజనవాడకు చెందిన కన్యాకుమారి (22) అనే మహిళను అదే కాలనీకి చెందిన ధనుంజయను గత మూడు నెలల క్రితం ప్రేమించుకొని పెద్దలకు తెలియకుండా కర్నాటక ప్రాంతంలో వివాహం చేసుకున్నారు.

08/30/2018 - 00:58

ఘట్‌కేసర్, ఆగస్టు 29: ప్రేమికునికి దూరమయ్యాననే బాధను తట్టుకోలేక ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధి సంస్కృతి టౌన్‌షిప్‌లో మంగళవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం పోచారం మున్సిపాలిటీ సంస్కృతి టౌన్‌షిప్‌లోని బ్లాక్ నెంబర్ 12 ప్లాట్ నెంబర్ 205లో నివాసం ఉంటున్న పూజా కుమారి సాహు(22) ఇన్ఫోసిస్ లోఇంజనీర్‌గా పని చేస్తుంది.

08/29/2018 - 23:42

కురిచేడు, ఆగస్టు 29: కురిచేడు బ్రాంచ్ పోస్ట్ఫాసులో పనిచేస్తూ వారంరోజుల కిందట పొదిలికి బదిలీపై వెళ్లిన పోస్టుమాస్టర్ షేక్ అన్వర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కురిచేడు బ్రాంచ్ పోస్ట్ఫాసులో పనిచేస్తున్న సమయంలో కొన్ని ఖాతాల నుంచి అక్రమంగా నిధులు డ్రా చేసినట్లు ఆయనపై అభియోగం మోపబడింది.

08/29/2018 - 22:20

కొత్తచెరువు, ఆగస్టు 29 : మండలపరిధిలోని కొడపగానిపల్లి సమీపంలో బుధవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనం బోల్తా పడి పీజీ విద్యార్థి దుర్మరణం చెందాడు. కొత్తచెరువు నుంచి స్వగ్రామమైన రేగాటిపల్లికి ద్విచక్ర వాహనంలో వెళ్తున్న సాకే సురేష్ (25) రోడ్డుపక్కన ఉన్న మట్టికుప్పపైకి ద్విచక్రవాహనం వెళ్లడంతో కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు.

08/29/2018 - 00:38

ఉప్పల్, ఆగస్టు 28: రాచకొండ షీ టీం, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆకస్మికంగా నిర్వహించిన డెకాయి ఆపరేషన్‌లో లింగ నిర్ధారణకు పాల్పడిన ఇద్దరు వైద్యులు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ఉప్పల్ పట్టణంలోని రాజ్‌నగర్ కాలనీలో ఉన్న శ్రీకృష్ణ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌లో లింగ నిర్ధారణ పరీక్షలు జరుగున్నాయని పోలీసులకు సమాచారం అందింది.

Pages