S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

12/03/2018 - 00:01

ఉంగుటూరు, డిసెంబర్ 2: జాతీయ రహదారిపై కాకినాడ వైపు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆదివారం వేకువజామున 6 గంటల సమయంలో బాదంపూడి వద్ద అదుపుతప్పి కొలుములోకి తిరగబడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ఎం.పద్మజ అనే మహిళకు హైవే అంబులెన్సు ద్వారా స్వల్ప చికిత్స చేశారు. ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎస్సై వెంకట్రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

12/02/2018 - 23:33

గరివిడి, డిసెంబర్ 2: ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో వట్టికాన చింతమ్మ(65) అనే వృద్ధురాలు సజీవదహనమైన సంఘటన మండలంలోని కోనూరు గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది. పోలీసులు, కుటుంబీకులు అందించిన సమాచారం ప్రచారం కోనూరు గ్రామ శివారులో మామిడితోటకు చెందిన పూరిపాక అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ సమయంలో పూరిపాక ఆదివారం మధ్యాహ్నం 3.30గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదానికి గురైంది.

12/02/2018 - 23:32

గరుగుబిల్లి, డిసెంబర్ 2: మండల పరిధిలోని తోటపల్లి వద్ద ఆదివారం బస్సు ఢీకొన్న సంఘటనలో వి ఆదిమ్మ(72) అనే వృద్దురాలు మృతిచెందిందని ఎస్‌ఐ ఎస్ కృష్ణవర్మ తెలిపారు. నాగూరు గ్రామానికి చెందిన ఆదిమ్మ యాచకవృత్తి చేసుకుంటూ జీవిస్తుందన్నారు. అయితే తోటపల్లివద్ద గుమ్మలక్ష్మీపురం నుంచి పార్వతీపురం వస్తున్న ఆర్టీసి బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందిందని, ఈమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

12/02/2018 - 23:30

కురుపాం, డిసెంబర్ 2: నాటుసారా తాగి పొలం గట్టుపై నడుస్తు బురదగుంటలో పడి ఓ గిరిజనుడు మృతిచెందిన సంఘటన ఇది. స్థానికులు, కురుపాం పోలీసులు అందించిన వివరాల ప్రకారం రస్తాకుంటుబాయి గ్రామానికి చెందిన మూటక రాఘవేంద్ర(30) నాటాసారాను తాగేందుకు శనివారం రాత్రి జొంగరపాడు వెళ్లాడు. తిరిగివస్తు పొలంగట్లుపై అదుపుతప్పి బురదగుంటలోపడి మృతి చెందాడు.

12/02/2018 - 01:15

ఇల్లందకుంట, డిసెంబర్ 1: వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతన్నకు చివరికి చావే శరణ్యంగా మారుతుంది. తాజాగా మండలంలోని రాచపల్లి గ్రామానికి చెందిన ఓ కౌలు రైతు పంటపై చేసిన అప్పులతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గూడెపు కిరణ్(30) అనే కౌలు రైతు అదే గ్రామంలో రెండు ఎకరాల భూమిని కౌలు తీసుకొని మొదట పత్తి పంటను సాగు చేశాడు.

12/02/2018 - 01:11

మక్తల్, డిసెంబర్ 1: మక్తల్, మరికల్ శివారులో పోలీసుల తనిఖీలో శనివారం రూ.1.50 లక్షల నగదు లభించడంతోటి పోలీసులు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవికుమార్‌కు అప్పగించారు. శనివారం ఉదయం 10-30 గంటల ప్రాంతంలో టిఎస్ 07 యుఈ-7041 నెంబర్‌గల కారులోఅనీల్, సునీల్ అనే హైదరాబాద్‌కు చెందిన అన్నదమ్ములు ఇరువు రూ.1.50లతో మక్తల్ మండలంలోని జక్లేర్‌కు బయలు దేరారు.

12/02/2018 - 01:02

నాంపల్లి, డిసెంబర్ 1: అభం శభం తెలియని అమాయక మైనర్ బాలికపై తండ్రీ, కొడుకులు కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడుతుండటంతో జీవితంపై విరక్తి చెందిన ఆ బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని తిరుమలగిరి గ్రామంలో సంచలనం రేపింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

12/02/2018 - 01:02

వలిగొండ, డిసెంబర్ 1: మండల కేంద్రంలోని అక్కాచెల్లెల చెరువుల్లోకి వచ్చే భీమలింగం కాలువ నీటిలో తూము వద్ద శనివారం ఉదయం గుర్తు తెలియని మృతదేహాం లభ్యమైంది. ఉదయం చెరువు వద్ద చెరువు సంఘం సభ్యుడికి మృతదేహాం కనిపించడంతో స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఎఎస్‌ఐ రమేశ్ ఆధ్వర్యంలో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టమ్‌కై రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.

12/02/2018 - 00:49

కొందుర్గు, డిసెంబర్ 1: అక్రమంగా మద్యం తరలిస్తున్న ఆటోను షాద్‌నగర్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. శనివారం రాత్రి జిల్లేడు చౌదరిగూడ మండల కేంద్రం నుంచి లాల్‌పహాడ్ మీదుగా కొందుర్గు వస్తున్న సమయంలో లాల్‌పహాడ్ వద్ద తనిఖీలు చేస్తుండగా అక్రమంగా తరలిస్తున్న మద్యం లభించినట్లు ఎక్సైజ్ అధికారిణి సునితా తెలిపారు.

12/01/2018 - 23:12

వీరవాసరం, డిసెంబర్ 1: వీరవాసరం మండలంలో పంచాయతీరాజ్ శాఖలో వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ (40) శనివారం రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందారు. మండలంలోని మత్స్యపురి గ్రామంలో భవన నిర్మాణ పనులు చూడటానికి భీమవరం నుంచి మత్స్యపురి వస్తుండగా భీమవరం రూరల్ మండలం తుందుర్రు గ్రామ పరిధిలో ఒక ప్రైవేటు స్కూలుకు చెందిన బస్సు ఢీకొట్టడంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందాడు.

Pages