S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

02/16/2020 - 02:51

మెహిదీపట్నం, ఫిబ్రవరి 15: పరారిలో ఉన్న రౌడీషీటర్‌ను పట్టుకునేందుకు వెళ్లిన గోల్కొండ పోలీసులను తోసేసి పారిపోయేందుకు యత్నించిన సంఘటన గోల్కొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోజరిగింది. ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి శనివారం విలేకర్లుకు వివరాలను వెల్ల్లడించారు. గోల్కొండ ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ అబ్దుల్లా బిన్ అలిపై గత కొన్ని నెలలుగా వారెంట్ పెండింగ్‌లో ఉంది.

02/16/2020 - 02:12

హైదరాబాద్, ఫిబ్రవరి 15: తెలంగాణ మంత్రి కేటీఆర్ పీఏనంటూ మోసాలకు పాల్పడుతున్న ఆంధ్రప్రదేశ్ మాజీ రంజీ క్రికెటర్ నాగుజును సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సీఎం కేసీఆర్, కేటీఆర్‌ల చేతుల మీదుగా కిట్లు అందిస్తామని ప్రైమ్ ఇండియా కంపెనీకి రూ.3లక్షలకు కోకరా వేశాడు.

02/16/2020 - 02:08

హైదరాబాద్, ఫిబ్రవరి 15: ప్రభుత్వ పట్టా ప్లాట్, డబుల్ బెడ్ రూమ్ రాజీవ్ గృహకల్పకు చెందిన ఇల్లు ఇప్పిస్తామని పాతబస్తీ సైదాబాద్, మాదన్నపేట్, సంతోష్‌నగర్, బండ్లగూడ ప్రాంతాలకు చెందిన ప్రజల నుండి కోటి 10 లక్షల రూపాలు తీసుకుని నకిలీ పట్టాలు ఇచ్చి మోసం చేశారని సీసీఎస్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశా.

02/16/2020 - 02:05

సూర్యాపేట రూరల్: టీఆర్‌ఎస్ నేతను కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు వెంబడించి కత్తులతో పొడిచి, రాళ్లతో కొట్టి కిరాతకంగా హతమార్చిన సంఘటన మండల పరిధిలోని ఎర్కారం గ్రామంలో శనివారం తెల్లవారుజామున జరిగింది. ఈ హత్యకు సంబంధించి పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం సమస్యాత్మక గ్రామంగా పేరున్న ఎర్కారంలో రాజకీయ కక్షలు ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నాయి.

02/16/2020 - 01:48

జగ్గయ్యపేట రూరల్, ఫిబ్రవరి 15: క్రైస్తవ మత ప్రబోధకుడు బ్రదర్ అనిల్‌కుమార్ ప్రయాణిస్తున్న కారు శనివారం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అనిల్ సురక్షితంగా బయటపడ్డారు. బ్రదర్ అనిల్ హైదరాబాద్ నుండి విజయవాడ కారులో బయలుదేరగా కృష్ణా జిల్లా సరిహద్దుల్లో జగ్గయ్యపేట మండలంలోని గరికపాడు చెక్‌పోస్టు వద్ద శనివారం తెల్లవారుజామున కారు అదుపుతప్పి రోడ్డు మార్జిన్ దిగి పంట పొలాల్లోకి దూసుకెళ్ళింది.

02/16/2020 - 01:20

తాడేపల్లి: కోల్‌కతా- చెన్నై జాతీయ రహదారిపై గంటూరు జిల్లా తాడేపల్లి మండల పరిధిలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుండి ప్రకాశం జిల్లా సింగరాయకొండకు ఐరన్ గడ్డర్ల లోడుతో వెళుతున్న లారీని తెల్లవారుజామున 4.30కు విజయవాడ కనకదుర్గ వారధి దాటాక జాతీయ రహదారిపై నిలిపేసి, లోడుకు కట్టిన తాళ్లు సరిచేస్తుండగా వెనుక నుంచి వచ్చిన ఆటో ఢీకొట్టింది.

02/14/2020 - 05:16

కరీంనగర్, ఫిబ్రవరి 13: కరీంనగర్‌లో ఇంటర్ విద్యార్థిని ముత్త రాధికను గొంతు కోసి దారుణంగా హత్య కేసును ఛేదించడం పోలీస్ యంత్రాంగం సవాల్‌గా తీసుకుంది. ఈనెల 10న నగరంలోని విద్యానగర్ ప్రాంతంలోని ఇంటిలో రాధిక దారుణ హత్య కేసు ఛేదించేందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ నుండి ఐదు బృందాలు గురువారం రాధిక స్వగృహాన్ని సందర్శించి కీలక మైన ఆధారాలు సేకరించారు.

02/14/2020 - 04:06

చల్లపల్లి, ఫిబ్రవరి 13: స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో గురువారం గుర్తు తెలియని ఒక వ్యక్తి మృతి చెందాడు. సాయంత్రం 4గంటల సమయం వరకు గళ్ల చొక్కా, ఫ్యాంట్ ధరించి గడ్డం పెంచుకుని వున్న వ్యక్తి బస్టాండ్‌లో బస్‌కోసం వేచి చూస్తూ తోటి ప్రయాణికులకు కనిపించాడు. 5గంటల సమయంలో ఒక్కసారిగా ఆ వ్యక్తి పడిపోవటంతో స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు.

02/14/2020 - 04:05

పెనమలూరు, ఫిబ్రవరి 13: వరక ట్నం కోసం తనను వేధిస్తున్న భర్త వైఖరికి విసిగి వేసారిన భార్య ఫ్యాన్‌కు చీరతో ఉరిపోసుకుని మృతి చెందిన సంఘటన పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం వెలుగులోకి వ చ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని యనమలకుదురులోని శివ పార్వతినగర్‌కు చెంది న కొట్ని రాముకు ఉయ్యూరు గ్రామానికి చెందిన నాగమణి (29)తో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది.

02/14/2020 - 03:21

జీడిమెట్ల, ఫిబ్రవరి 13: బాలిక పై వ్యక్తి అత్యాచారానికి ఒడి గట్టిన సంఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా నుంచి బతుకు దెరువు నిమిత్తం నిజాంపేట్‌లో నివాసముంటూ జీవనం సాగిస్తున్నారు. 13 సంవత్సరాల వయస్సు గల బాలిక ఎనిమిదో తరగతి చదువుతుంది. బాలిక తండ్రి సొంత చెల్లెలి భర్తకు ఇద్దరు కుమార్తెలు సంతానం.

Pages