S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

06/07/2019 - 00:54

హైదరాబాద్: టీవీ 9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌కు సైబరాబాద్ పోలీసులు గురువారం మరో నోటీసు జారీ చేశారు. సైబరాబాద్ పోలీసులు టీవీ 9 లోగోల విక్రయం కేసులో 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు. మూడోరోజూ రవి ప్రకాష్‌ను సైబరాబాద్ పోలీసులు విచారించారు. టీవీ 9 సంస్థ బదలాయింపు, సంతకాల ఫోర్జరీ వ్యవహారంలో కొత్త యాజమాన్యం అలంద మీడియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై రెండు కేసులు నమోదు చేశారు.

06/06/2019 - 23:16

ఓర్వకల్లు, జూన్ 6: కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి నుంచి కర్నూలుకు వస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. దీంతో కారులో ఉన్న సతీష్‌కుమార్(52), సాయిబాబ(68) అక్కడికక్కడే మృతి చెందారు. శివాజీ శర్మ, అఖిల్, నిషిత్ తీవ్రంగా గాయపడ్డారు.

06/06/2019 - 23:16

నర్సీపట్నం, జూన్ 6: కుటుంబ కలహాలతో విసిగి వేసారిన వివాహిత తన ఇద్దరు పిల్లలతో సహా ఏలేరు కాలువలో దూకి ఆత్మహత్యాయ్నం చేసింది. ఈ ఘటనలోఎనిమిదేళ్ళ కుమార్తె మృతి చెందగా తల్లి ఆచూకీ కానరాలేదు. పదేళ్ళ కుమారుడు నీళ్ళలో ఈదుకుంటూ ప్రాణాలతో బయటపడ్డాడు. తల్లి మృతదేహం కోసం పోలీసులు, స్థానికులు ఏలేరు కాలువలో గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

06/06/2019 - 23:15

డోన్, జూన్ 6: కర్నూలు జిల్లాలో గురువారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. జాతీయ రహదారి-44పై ప్యాపిలి మండలం ఏనుగుమర్రి గ్రామం సమీపంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఎల్లో ట్రావెల్స్ బస్సు ప్రమాదవశాత్తు కాలి బూడిదైంది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో 26 మంది ప్రమాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. అయితే వారి విలువైన లగేజి, వస్తువులు మంటల్లో కాలిపోయాయి.

06/06/2019 - 01:21

గచ్చిబౌలి, జూన్ 5: అక్రమ సంబంధం.. హత్యకు దారి తీసిన సంఘటన రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల ప్రత్యేక్ష సాక్షుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా రేకులబీ తండాకు చెందిన రమేష్ కొంత కాలం క్రితం జీవనోపాధి నిమిత్తం నగరానికి వచ్చి మణికొండ పంచావటి కాలనీలో ఉంటున్నారు. అదే గ్రామానికి చెందిన నాబోతు రాములు(28).. రమేష్ భార్య శాంతి చనువుగా ఉండడంతో కుటుంబంలో తరచూ గొడవలు జరిగేవి.

06/06/2019 - 01:20

ఉప్పల్, జూన్ 5: యువకుడు అదృశ్యమైన సంఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రామంతాపూర్ భరత్‌నగర్‌లో నివసిస్తున్న దూదేకుల ఖాసీం ఫీరా (32) మెడికల్ కోడ్ బిజినెస్ చేస్తున్నాడు. అతడు విజయవాడకు చెందిన కీర్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భార్యాభర్తలు ఉద్యోగం చేసుకుంటూ ఆనందంగా ఉన్నారు.

06/06/2019 - 00:40

హైదరాబాద్: టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాష్‌పై పోలీస్ ప్రత్యేక దర్యాప్తు అధికారులు విచారణ బుధవారం కూడా కొనసాగించారు. ఈ నెల 6న రవిప్రకాష్‌ను అరెస్టు చేయడానికి సైబరాబాద్ పోలీసులు రంగం సిద్ధం చేశారు. రెండు రోజులుగా అనేక అంశాలపై విచారణ పూర్తి చేశారు. సినీనటుడు గరడపురాణం శివాజీ ఎక్కడ ఉన్నాడు? అతడి ఫోన్ నెంబర్లు, పోలీస్ ముందు ఎప్పుడు హాజరవుతాడు అన్న విషయమై రవిప్రకాష్ నుంచి వివరాలు రాబట్టారు.

06/05/2019 - 22:23

అకోల (మహారాష్ట్ర), జూన్ 5: భానుడి ప్రతాపాన్ని తట్టుకోలేక నీడ కోసమో లేక కారులో కూర్చుని సేద తీరుదామని అనుకున్నాడేమో కానీ ఆ పనె్నండేళ్ళ బాలుడి పట్ల అది మృత్యుశకటంగా మారింది. మహారాష్ట్ర, అకోల జిల్లాలోని ఆలేవాడి గ్రామంలో ఈ హృదయవిదారకర ఘటన చోటు చేసుకుంది. ఒక కారు సాంకేతికంగా దెబ్బతిని రెండేళ్ళుగా మూలపడింది.

06/05/2019 - 05:06

హైదరాబాద్, జూన్ 4: చేపమందు పంపిణీని ఆపాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. జూన్ 8వ తేదీన మృగశిర కార్తె ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆస్తమా బాధితులకు చేప ప్రసాదం అందించనున్నారని దానిని ఆపాలని అచ్యుత రావుత తరఫున న్యాయవాది దామోదర్‌రెడ్డి లంచ్‌మోషన్ పిటీషన్ దాఖలు చేశారు.

06/05/2019 - 04:33

తిరుపతి, జూన్ 4: తనకు జన్మనిచ్చిన తండ్రి పట్ల ప్రేమ, దయ, బాధ్యతతో వ్యవహరించాల్సిన ఓ కొడుకు మానవత్వం మరచి భార్య, బావమరిదితో కలిసి కళ్లల్లో కారంపొడి చల్లి, ఇనుప రాడ్‌తో దాడి చేసిన సంఘటన మంగళవారం తిరుపతిలో జరిగింది. సభ్య సమాజం సిగ్గుపడే ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక అనంత వీధిలోని మునికిష్టయ్య (88)పై ఆయన పెద్ద కొడుకు విజయ్, భార్య, బంధువులతోకలిసి దాడి చేశాడు.

Pages