S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

02/14/2020 - 00:27

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అన్ని క్రిమినల్ కేసుల వివరాలను పార్టీ వెబ్‌సైట్‌లో పొందుపరచాలని సుప్రీంకోర్టు అన్ని రాజకీయ పార్టీలను ఆదేశించింది. రాజకీయాలు పెద్ద ఎత్తున నేరపూరితం అవుతున్నాయంటూ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది.

02/14/2020 - 00:24

హైదరాబాద్: అసెంబ్లీ, సచివాలయ నిర్మాణాల సందర్భంగా అత్యంత పురాతన భవనాల కూల్చివేత తగదని పేర్కొంటూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం నాడు హైకోర్టులో విచారణ కొనసాగనుంది.

02/13/2020 - 01:41

జీడిమెట్ల, ఫిబ్రవరి 12: పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని మోసగించిన వ్యక్తి పై బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నిజాంపేట్‌లో నివాసముండే రవిగౌడ్ (23) ఆటో నడుపుతుంటాడు. జేఎన్‌టీయూలో హోటల్‌కు రవిగౌడ్ సామాన్లను సప్లయ్ చేస్తూ హోటల్ యజమాని కుమార్తెతో పరిచయం ఏర్పరుచుకున్నాడు. బాధితురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి మోసం చేసాడని తెలిపారు.

02/13/2020 - 01:41

కొందుర్గు, ఫిబ్రవరి 12: ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడంటూ యువతి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. జిల్లేడు చౌదరిగూడ ఎస్‌ఐ సయ్యద్ సరుూద్ కథనం ప్రకారం.. మంగళవారం రాత్రి మండల పరిధిలోని వనంపల్లి గ్రామానికి చెందిన రేణుక (20), ప్రేమించిన వ్యక్తి మహేష్ మోసం చేశాడంటూ తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని తెలిపారు.

02/13/2020 - 01:40

జీడిమెట్ల, ఫిబ్రవఠి 12: దుందిగల్ మున్సిపల్ పరిధిలోని గండిమైసమ్మ చౌరస్తా 120 గజాలు, చంద్రశేఖర్ రెడ్డి నగర్‌లో బాలానగర్ జోన్ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. బాలానగర్ జోన్ డీసీపీ పద్మజా నేతృథ్వంలో పేట్‌బషీరాబాద్ ఏసీపీ నర్సింహా రావు, ఐదుగురు సీఐలు, 8 మంది ఎస్‌ఐలు, 111 మంది సిబ్బందితో ప్రతి ఇంటిని గాలించారు. ఇంట్లో నివసిస్తున్న వారి వివరాలను సేకరించి గుర్తింపు కార్డులను పరిశీలించారు.

02/13/2020 - 01:32

ఖైరతాబాద్, ఫిబ్రవరి 12: ద్విచక్రవాహనాలను చోరీలతో పాటు సెల్‌ఫోన్లను స్నాచింగ్ చేస్తున్న ముగ్గురు పాత నేరస్తులను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పశ్చిమ మండల డిప్యూటీ కమిషనర్ (డీసీపీ) ఏఆర్ శ్రీనివాస్, ఏసీపీ తిరుపతన్న కేసు వివరాలను వెల్లడించారు.

02/13/2020 - 01:24

హైదరాబాద్: నూతన సచివాలయ భవనాల నిర్మాణాలకు సంబంధించిన తుది డిజైన్లను సమర్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తుది డిజైన్లు ఇంకా ఖరారు కాలేదని అధికారులు పేర్కొనగా, అలాంటపుడు పాత భవనాలను కూల్చివేయడంపై తొందర ఎందుకు? అని హైకోర్టు ప్రశ్నించింది. సచివాలయం తరలింపుపై తొందర ఎందుకని ప్రశ్చించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకూ సచివాలయంలో

02/13/2020 - 01:19

హైదరాబాద్: రైతుబంధు పథకం నిధులను వెంటనే విడుదల చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రైతు బంధు రెండో విడత, మూడో విడత నిధులు ఇంకా విడుదల కాలేదని రిటైర్డు డిఎస్పీ రాఘవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఈ ఆదేశాలను ఇచ్చింది. ప్రభుత్వం తలపెట్టిన రైతుబంధు పథకం రెండో విడత, మూడో విడత డబ్బులు రాలేదని పిటిషనర్ పేర్కొన్నారు.

02/13/2020 - 01:15

హైదరాబాద్, ఫిబ్రవరి 12: ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో సీబీఐ కోర్టులో జరిగే విచారణకు వ్యక్తిగత హాజరు నుండి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మినహాయింపును ఇవ్వొద్దని సీబీఐ బుధవారం హైకోర్టును కోరింది. ఈ మేరకు సీబీఐ లిఖిత పూర్వకంగా అఫిడవిట్‌ను దాఖలు చేసింది.

02/12/2020 - 23:34

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: బాల నేరస్థుల విషయంలో జువైనెల్ జస్టిస్ బోర్డు (జేజేబీ)లు వౌనం వీడాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే పలు సందర్భాల్లో జారీ చేసిన ఆదేశాలను తు.చ తప్పకుండా పాటించేలా చూడాల్సిన బాధ్యత జేజేబీలపై ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.

Pages