S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

02/12/2020 - 23:22

ఇండోర్, ఫిబ్రవరి 12: హత్య కేసులో పెరోల్‌పై విడుదలైన దోషికి బదులుగా మరొకరిని అరెస్టు చేసిన పోలీసు యంత్రాంగానికి చివాట్లు పెడుతూ అమాయక వ్యక్తిని జైలులో పెట్టిన నేరానికి ఐదు లక్షల రూపాయిల పరిహారాన్ని చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించిన ఉదంతం మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకొంది.

02/12/2020 - 23:46

న్యూఢిల్లీ: సీబీఐ మాజీ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్థానా అవినీతి కేసు విచారణ జరుగుతున్న తీరుపై ఢిల్లీ కోర్టు తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేసింది. ఆస్థానాపై ఆయన పనిచేసిన సంస్థ సీబీఐ విచారణ చేపట్టింది. రాకేష్ ఆస్థానాపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినా చార్జిషీట్‌లో ఆయన పేరు తప్పించారు. అవినీతితో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని దర్యాప్తు సంస్థ తేల్చింది.

02/12/2020 - 23:12

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా నిర్బంధంపై దాఖలైన పిటిషన్‌పై విచారించే సుప్రీం బెంచ్ నుంచి న్యాయమూర్తి ఎంఎం శంతన్‌గౌడర్ తప్పుకున్నారు. నెలల తరబడి తన సోదరుడు ఒమర్‌ను గృహ నిర్బంధంలో ఉంచారంటూ ఆయన సోదరి సారా అబ్దుల్లా పైలట్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఒమర్ అబ్దుల్లా జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేయడమే కాకుండా నేషనల్ కాన్ఫరెన్స్ అధినేతగా ఉన్నారు.

02/13/2020 - 01:17

న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న భజన్‌పురాలో ఒక కుటుంబానికి చెందిన ఐదుగురు మృత దేహాలను పోలీసులు కనుగొన్నారు. మృతదేహాలు కుళ్ళిపోయిన స్థితిలో ఉండగా, పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ-రిక్షా డ్రైవర్ శంభు చౌదరి ఇంట్లో నుంచి దుర్వాసన రావడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు.

02/12/2020 - 23:44

న్యూఢిల్లీ: నిర్భయ గ్యాంగ్‌రేప్, హత్యోదంతంలో దోషులుగా ఖరారైన నలుగురిలో ఒకడైన పవన్‌గుప్తా విజ్ఞప్తి మేరకు న్యాయ సహాయం అందించేందుకు ఢిల్లీ కోర్టు బుధవారం అనుమతి ఇచ్చింది. తన తరఫున వాదించేందుకు లాయర్ లేరంటూ పవన్‌గుప్తా కోర్టుకు చేసిన విజ్ఞప్తి మేరకు అదనపు సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా ఉరిశిక్ష అమలులో జాప్యం జరుగుతోందని అసహనం వ్యక్తం చేస్తూనే న్యాయ సహాయం అందించేందుకు అంగీకరించారు.

02/12/2020 - 06:16

హైదరాబాద్: ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ ఎంపిక సందర్భంగా రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు ఎక్స్‌అఫీషియో ఓటు వినియోగించుకోవడంపై మంగళవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంపై పూర్తి వివరాలను కోర్టుముందుంచాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది.

02/12/2020 - 05:43

ఏలూరు, ఫిబ్రవరి 11: బస్సులో తోటి ప్రయాణీకురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న యువకుడిని దిశ యాప్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు నిమిషాల వ్యవధిలో అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం కలపర్రు టోల్‌గేటు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలావున్నాయి...

02/12/2020 - 01:45

ఉయ్యూరు, ఫిబ్రవరి 11: మండలంలోని కాటూరు గ్రామంలో సోమవారం రాత్రి అంతరాష్ట్ర దొంగలముఠా ఇంటి యజమానిని అతని భార్యను తాళ్లతో కట్టి మరీ 10 కాసుల బంగారునగలు దోచుకున్న సంఘటన స్థానికంగా సంచలనమైంది. రూరల్ పోలీసుల కథనం ప్రకారం కాటూరు గ్రామానికి చెందిన రియల్‌ఏస్టేట్ వ్యాపారి ఆరేపల్లి రజని ఇంట్లో దొంగలుపడ్డారు. అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో ఇంటి తలుపులు పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు.

02/12/2020 - 01:45

చల్లపల్లి, ఫిబ్రవరి 11: కార్పొరేషన్ రుణం పేరుతో తమ సంతకాలు సేకరించి డ్వాక్రా రుణం పొంది తమను ఒక మహిళ మోసం చేసిందని మంగళాపురానికి చెందిన పలువురు డ్వాక్రా మహిళలు మంగళవారం పోలీసులను ఆశ్రయించారు.

02/12/2020 - 01:44

కోడూరు, ఫిబ్రవరి 11: కృష్ణాజిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (కేడీసీసీబీ) కోడూరు శాఖలో రూ.కోటి 54లక్షల నిధులు దుర్వినియోగం ఆలస్యంగా వెలుగు చూసింది. నిధుల దుర్వినియోగంపై బ్రాంచ్ మేనేజర్ నండూరి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ పి రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Pages