S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

05/05/2019 - 04:22

గోదావరిఖని, మే 4: వేసవి నుంచి ఉపశమనం పొందేందుకు ఈతకు వెళ్ళిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని ఓ ఊర చెరువు మింగేసింది. అప్పటి దాకా ఇంటి వద్ద కలివిడిగా తిరిగిన ఆ నలుగురు కొద్ది సమయంలోనే మృత్యువు ఒడిలోకి వెళ్ళారన్న వార్త తెలియగానే ఆ కుటుంబం రోదనలు మిన్నంటాయి. ఊరు ఊరంతా చెరువు వద్దకు పరుగులు తీశారు. ఈ విషాదకరమైన ఘటన పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్ గ్రామంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది.

05/05/2019 - 02:27

థెని, మే 4: తమిళనాడులోని ఓ గుడిలో జరిగిన చోరీ యత్నాన్ని అక్కడి అర్చకులు తిప్పికొట్టారు. అయితే, దోపిడీకి వచ్చిన దుండగులు జరిపిన దాడిలో ఒక అర్చకుడు మృతి చెందగా, మరో అర్చకుడు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం...సురులి ప్రాంతంలోని భూత నారాయణస్వామి ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి ఇద్దరు ముసుగులు ధరించి చొరబడ్డారు. హుండీని పగులగొట్టేందుకు వారు ప్రయత్నించారు.

05/05/2019 - 01:46

విజయవాడ పశ్చిమ, మే 4: బాధ్యతలు తీరాయి, కొడుకు, కుమార్తె వివాహాలు జరిగాయి. అయినా అనుమానంతో ఆలిని కడతేర్చి తానూ తనువు చాలించిన విషాద సంఘటన కొత్తపేట పోలీసు స్టేషన్ పరిధిలో వైఎస్‌ఆర్ కాలనీలో శనివారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం జక్కంపూడి కాలనీలోని ఎస్‌ఎఫ్ 5, బ్లాక్ 230 రెండో అంతస్తులో చోటుచేసుకున్న ఉదంతమిది. అవనిగడ్డ నరసింహారావు (54), కృష్ణకుమారి (40)లకు సుమారు 25ఏళ్ల క్రితం వివాహమైంది.

05/05/2019 - 01:46

పామర్రు, మే 4: పామర్రు మండలం కనుమూరులో వారం రోజులు కిందట నూతనంగా నిర్మించి ప్రతిష్టించిన శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో ఏప్రిల్ 30వ తేదీ అర్ధరాత్రి దాటిన తరువాత చోరీకి గురైన ఆలయ హుండీని పామర్రు ఎస్‌ఐ హబీబ్ భాషా, టిఎస్‌ఐ సూర్య శ్రీనివాసరావు ప్రత్యేక సిబ్బందితో దర్యాప్తు జరిపి గాలింపు జరిపి దొంగలను పట్టుకోవటం విశేషమని పామర్రు సీఐ డి శివశంకర్ శనివారం స్థానిక పోలీసు స్టేషన్‌లో విలేఖర్ల సమావేశంలో

05/04/2019 - 23:56

హైదరాబాద్, మే 4: రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపిన సీరియల్ సైకోకిల్లర్ మర్రి శ్రీనివాసరెడ్డిపై పోలీసుల ఉచ్చు బిగుస్తోంది. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి రాచకొండ కమిషనరేట్ నాలుగు పోలీసుల బృందాలను ఏర్పాటు చేసింది. భువనగిరి జిల్లా హాజీపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి వృత్తిరీత్యా ఏసీ మెకానిక్‌గా పని చేస్తూ జీవనం సాగించేవాడు.

05/04/2019 - 23:54

హైదరాబాద్, మే 4: హైదరాబాద్‌లో ఉగ్రవాదుల చర్యలకు మద్దతుగా నిలుస్తున్న స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా(సిమీ)కి వ్యతిరేకంగా సాక్ష్యాలను సేకరించడానికి ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. ట్రిబ్యునల్‌కు ఢిల్లీ హైకోర్టు జస్టిస్ జడ్జి ముక్తాగుప్తా హాజరు అవుతున్నారు. సిమీ చట్టవ్యతిరేక కార్యకలాపాల సంస్థగా గుర్తించినందున దానికి వ్యతిరేకంగా సాక్ష్యాలను సేకరిస్తోందని రిజిస్ట్రార్ తెలిపారు.

05/04/2019 - 23:39

కేపీహెచ్‌బీకాలనీ, మే 4: ఇంటికి తాళం వేసి తీర్థయాత్రలకు వెళ్లి వచ్చే సరికి ఇళ్లు గుల్లైన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం హైదర్‌నగర్‌లోని హనుమాన్ ఆలయం సమీపంలో నివాసం ఉంటున్న రామరాజు, రమ దంపతులు ఈ నెల 1న తీర్థయాత్రలకని ఇంటికి తాళం వేసి తిరుపతికి వెళ్ళారు.

05/04/2019 - 23:39

నేరేడ్‌మెట్, మే 4: ఇంట్లో ఎవరు లేని సమయంలో యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మల్కాజిగిరి దయానంద్‌నగర్‌లో నివసించే శీలం అయ్యప్ప శ్రీనిదీ(21) కుటుంబ సభ్యులు గత రెండు రోజుల క్రితం స్వంత గ్రామానికి వెళ్లినట్టు పోలీసులు తెలిపారు.

05/04/2019 - 23:38

హైదరాబాద్, మే 4: గంజాయిని లిక్విడ్ రూపం లో విక్రయిస్తున్న ముఠా సభ్యుల్లో ఇద్దరిని తెలంగాణ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.15లక్షలు విలువ చేసే గంజాయి లిక్విడ్ కలిగిన బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. శనివారం మధ్యాహ్నం నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ సూపరింటెండెంట్ టీ.అన్నపూర్ణ వెల్లడించారు.

05/04/2019 - 23:36

కొత్తూరు రూరల్, మే 4: స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగానే ఇరువర్గాల మద్య ఘర్షణ చోటు చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం నందిగామ మండలం మామిడిపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్ నేతలు, ఇండిపెండెంట్ నేతలు ప్రచారం నిర్వహించేందుకు గ్రామానికి ఒకేసారి చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటమాట పెరిగి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.

Pages