S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

05/04/2019 - 23:35

ఖైరతాబాద్, మే 4: లక్డీకపూల్ ప్రధాన రహదారిపై ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వివరాల్లోకి వెళితే.... ముషీరాబాద్‌కు చెందిన సలీమ్ వ్యాపారి. శనివారం సాయంత్రం తన ద్విచక్రవాహం రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై మరో వ్యక్తితో కలిసి ముషీరాబాద్ నుంచి మెహిదీపట్నం బయలుదేరాడు. లక్డీకపూల్ మూలమలుపు పై ఉన్న పెట్రోల్ బంక్ ఎదురుగా ప్రయాణిస్తుండగా మంటలు చెలరేగాయి.

05/04/2019 - 00:30

ఖైరతాబాద్, మే 3: పంజాగుట్టలోని దుర్గానగర్ కాలనీలో శుక్రవారం ఉదయం స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కాలనీలోని ఫ్లాట్ నెంబర్ 61లోని సర్వెంట్ రూమ్‌లో వంట చేస్తున్న సమయంలో గ్యాస్ స్టౌవ్‌లో తలెత్తిన సమస్యతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంట్లోని బట్టలు, ఇతర సామాగ్రి అగ్నికి ఆహుతి అయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటల చెలరేగకుండా అదుపులోనికి తీసుకువచ్చాయి.

05/04/2019 - 00:28

నాచారం, మే 3: హైదరాబాద్ నాచారంలోని పారిశ్రామికవాడలో నార్కోటిక్ డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. ఇంతం ల్యాబ్‌పై అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించగా కేటమైన్ డ్రగ్ తయారీ గుట్టురట్టయింది. డ్రగ్ తయారు చేస్తున్న ఇంతం ల్యాబ్‌ని సీజ్ చేశారు. బెంగళూరులో ఇద్దరు పట్టుపడటంతో వారు ఇచ్చిన సమాచారంతో ఇంతం ల్యాబ్‌లో తనిఖీలు నిర్వహించారు.

05/04/2019 - 00:25

న్యూఢిల్లీ, మే 3: వారణసిలో తమ నామినేషన్ల తిరస్కరిచడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ, తమిళనాడు రైతులు ఫిర్యాదు చేశారు. వారణాసి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు తాము ప్రయాత్నించామన్నారు. స్థానిక ఎన్నికల అధికారి తమ నామినేషన్లను తిరస్కరించారని ఆరోపించారు. ఈమేరకు సీఈసీకి వారణాసి ఎన్నికల రిటర్నింగ్ అధికారిపై ఫిర్యాదు చేసినట్టు రైతులు వెల్లడించారు.

05/04/2019 - 00:24

న్యూఢిల్లీ,మే 3: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించటంపై తామింత వరకు పదకొండు ఫిర్యాదులు చేసినా కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఎలాంటి చర్య తీసుకోలేదని కాంగ్రెస్ విమర్శించింది. ఈ వ్యవహారంలో సీఈసీ వైఖరి సిగ్గు చేటని ధ్వజమెత్తింది.

05/04/2019 - 00:23

కామారెడ్డి, కామారెడ్డిరూరల్, మే 3: ఎఆర్ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. కామారెడ్డి డిఎస్పీ లక్ష్మినారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ జిల్లాకు చెందిన శ్రీనివాస్‌గౌడ్(46) ఎఆర్ కానిస్టేబుల్ కామారెడ్డి జిల్లా కేంద్రంలో గత నాలుగు సంవత్సరాలుగా విదులు నిర్వహిస్తున్నారని తెలిపారు.

05/04/2019 - 00:22

న్యూఢిల్లీ, మే 3: ఈవీఎంలతో యాభై శాతం వీవీ ప్యాట్‌లను కూడా లెక్కించేందుకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో ఇరవై మంది ప్రతిపక్ష నాయకులు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై వచ్చే వారం విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది.

05/03/2019 - 23:59

అనంతసాగరం, మే 3: వేసవి సెలవుల్లో మేనమామ ఊరొచ్చిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు జలాశయంలో మునిగి మృతిచెందారు. ఎండల తాకిడి నుంచి ఉపశమనం పొందేందుకు నీటిలో దిగిన వారిద్దరూ మృతిచెందడం విషాదం నింపింది. కడప జిల్లా రైల్వేకోడూరు మండలం ముత్తరాశిపల్లెకు చెందిన సుబ్బరాయుడు కుమార్తె అంజలి (10), అంజలి పెద్దమ్మ కుమార్తె ప్రసన్న (16)తో కలసి గురువారం జిల్లాలోని కలువాయి మండలం రాజుపాలెం గ్రామానికి విచ్చేశారు.

05/03/2019 - 23:21

రాజేంద్రనగర్, మే 3: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమా సెట్‌లో శుక్రవారం తెల్లవారుఝామున అగ్ని ప్రమాదం జరిగింది. కోకాపేటలోని చిరంజీవి సొంత ఫాంహౌస్‌లో వేసిన సైరా సెట్‌లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో సెట్ దాదాపుగా కాలిపోయింది. సుమారు రూ.2 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

05/03/2019 - 22:33

తాడేపల్లి, మే 3: ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసం సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో భద్రతా సిబ్బంది ఉలిక్కిపడ్డారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండల పరిధిలో ఉండవల్లి కరకట్ట ప్రాంతంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకు నిప్పుపెట్టడంతో మంటలు చెలరేగాయి.

Pages