S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

05/03/2019 - 01:08

నర్మెట, మే 2: ఇంటర్ ప్రథమ సంవత్సరంలో మూడు సబ్జెక్టులు ఫెయల్ అయ్యానని ఆత్మస్థైర్యం కోల్పోయిన ఓ విద్యార్థి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జనగామ జిల్లా తరిగొప్పుల మండలం నర్సాపూర్ గ్రామంలో గురువారం జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం...

05/03/2019 - 00:36

హైదరాబాద్: విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ నూతి రామమోహనరావు కోడలు సింధు శర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింఘ్ చౌహాన్ నేతృత్వంలోని బెంచ్ పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆమె పెద్ద కుమార్తెను తల్లికి అప్పగించాలని సూచించింది. అయితే వారంలో రెండు రోజులు తండ్రి వద్ద బిడ్డను ఉంచాలని పేర్కొంది. తదుపరి విచారణను జూన్ 4వ తేదీకి వాయిదా వేసింది.

05/03/2019 - 04:45

ఖమ్మం: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లా పరిధిలో మావోయిస్టులు గురువారం ఇద్దరు గ్రామస్థులను కాల్చి చంపారు. పోలీసుల కథనం ప్రకారం సుకుమా జిల్లాలోని కాస్టారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని కరిగుండం గ్రామంలో పొడియం ముక్తా, కోకోలంచు అనే ఇద్దరిని మావోయిస్టులు కాల్చి చంపారు. ఈ గ్రామానికి చెందిన వారి వల్లే ఇటీవల ఓ మహిళ మావోయిస్టు పోలీసులకు చిక్కిందని ఆరోపణలు ఉన్నాయి.

05/02/2019 - 23:21

చిత్తూరు, మే 2: కర్నాటక రాష్ట్రం పుణె జాతీయ రహదారిలోని కొడికుర్తి వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చిత్తూరు రూరల్ మండలం కుర్చి వేడు గ్రామానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో కుర్చివేడు గ్రామంలో విషాదం నెలకొంది.

05/02/2019 - 23:20

విజయవాడ, మే 2: ప్రముఖ క్రికెటర్, బీసీసీఐ చీఫ్ సెలక్టర్, గుంటూరు జిల్లా వాసి ఎంఎస్‌కే ప్రసాద్ పేరును వాడుకుని నగదు వసూలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఫోన్‌లో ఎంఎస్‌కేలా మాట్లాడి ప్రముఖుల వద్ద నుండి నాగరాజు అనే వ్యక్తి నగదును వసూలు చేస్తున్నట్లు ఆధారాలు లభించడంతో విజయవాడ పోలీసులు గురువారం అతడిని అరెస్ట్ చేసి రూ. 1.80 లక్షలు, పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

05/02/2019 - 23:03

నిజామాబాద్, మే 2: ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌లను నియంత్రించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన నిఘాను కొనసాగిస్తూ దాడులు నిర్వహిస్తున్నప్పటికీ, ఈ జాఢ్యానికి రుచి మరిగిన బుకీలు, పందెంరాయుళ్లు అదే స్థాయిలో బెట్టింగ్‌లు ఆడుతున్నారు.

05/02/2019 - 22:02

న్యూఢిల్లీ, మే 2: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అతిక్రమించారని ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ చీఫ్ అమిత్‌షాలపై దాఖలైన తొమ్మిది ఫిర్యాదులకు సంబంధించి ఈనెల ఆరులోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

05/02/2019 - 04:24

విజయపురం, మే 1: తన ప్రియురాలిని దక్కించుకోవడం కోసం ఆమె భర్తను హతమార్చడానికి ఓ వ్యక్తి పన్నిన కుట్రకు ఇద్దరు బలైన సంఘటన బుధవారం చిత్తూరు జిల్లా నిండ్ర మండలంలో జరిగింది. సీఐ వెంకటేశ్వర రావు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నిండ్ర మండలం అగరం దళితవాడకు చెందిన తాపీ మేస్ర్తి గోపీకి 17 సంవత్సరాల క్రితం తన మేనత్తకూతురు పరిమళతో వివాహమైంది.

05/02/2019 - 02:59

పటన్‌చెరు, మే 1: సంగారెడ్డి జిల్లా పటన్‌చెరు పోలీసులు బుధవారం సుమారు నాలుగు వందల కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. భారీ ఎత్తున మత్తు పధార్థాలను లారీలో తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు వారిని కోర్టు రిమాండుకు తరలించారు. మండల పరధిలోని ముత్తంగి గ్రామ శివారులలోని ఔటర్ రింగ్ రోడ్డుపై వైజాగ్ నుండి జహీరాబాద్ వైపు వెలుతున్న వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు.

05/02/2019 - 02:48

న్యూఢిల్లీ, మే 1: రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఖర్చు పెడుతున్న డబ్బుకు లెక్కాపత్రం ఉండడం లేదంటూ దాఖలైన పిటిషన్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాజకీయ పార్టీల వ్యయాన్ని క్రమబద్ధం చేయడానికి సంబంధించి ఈసీకి ఉన్న అధికారాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి రాజేంద్ర మీనన్, న్యాయమూర్తి ఏజే భంభానీతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.

Pages