S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/16/2019 - 02:02

మేడ్చల్, జూలై 15: జిల్లా బాలల రక్షణ అధికారులు సోమవారం మేడ్చల్ మండలం డబిల్‌పూర్ ఎక్స్ రోడ్డు వద్ద గల శ్రీరామా స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్ కంపెనీపై దాడి నిర్వహించి 15 మంది బాలకార్మికులకు విముక్తి కల్పించారు.

07/16/2019 - 01:19

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన స్టీల్ వ్యాపారి తేలప్రోలు రాంప్రసాద్ హత్యకేసును పంజాగుట్ట పోలీసులు ఛేదించారు. ఆర్థిక లావాదేవీల వివాదం వల్లే విజయవాడకు చెందిన వ్యాపారవేత్త కోగంటి సత్యం ఈ హత్య చేయించినట్లు పోలీసులు తెలిపారు.

07/16/2019 - 00:56

కదిరి: పురాతన శివాలయంలో ఉన్న గుప్తనిధులపై కనే్నసిన దుండగులు ఏకంగా ముగ్గురిని చంపి వారి రక్తంతో శివలింగానికి రక్త్భాషేకం చేశారు. హత్యకు గురైన ముగ్గురిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ దారుణం అనంతపురం జిల్లా తనకల్లు మండలం కోర్తికోటలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. ఆలయం వద్దే ఆరుబయట నిద్రిస్తున్న శివరామిరెడ్డి(68), ఆయన సోదరి సత్యలక్ష్మి(70), మరో భక్తురాలు కమలమ్మ(75) గొంతుకోసి హత్య చేశారు.

07/15/2019 - 23:26

హైదరాబాద్ : బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధరరావు సహా ఎనిమిది మంది తనను మోసం చేశారని, దీనిపై తాము పెట్టిన కేసు దర్యాప్తు సరిగ్గా జరగడం లేదని పేర్కొంటూ టీ. ప్రవర్ణారెడ్డి అనే మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

07/16/2019 - 01:28

మంచిర్యాల: తమ పేరుపైన ఉన్న భూమిని కొందరు దొంగపట్టా చేయించుకున్నారని పట్టా రద్దు చేసి తమ పట్టా ఇప్పించాలని బాధితుడు కలెక్టరేట్ ముందు ఆత్మహత్యా యత్నానికి పాల్పడటం సంచలంన సృష్టించింది.

07/15/2019 - 04:46

కీసర, జూలై 14: కారు ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన ఘటనలో నలుగురికి తీవ్రగాయలైన సంఘటన రింగ్‌రోడ్డుపై జోటు చేసుకుంది. సీఐ నరేందర్ గౌడ్ తెలిపిన విరరాల ప్రకారం నల్గొండ జిల్లాకు చెందిన శ్యాంసుందర్ భార్య జ్యోతి, కూతుళ్లు మేఘన, గాయత్రితో కలిసి మారుతి జెన్ కారులో బాసర వెళ్లేందుకు రింగ్‌రోడ్డు ఎక్కాడు.

07/15/2019 - 04:39

లింగాలఘణపురం, జూలై 14: భూ తగాదా విషయంలో తండ్రిపై కుమారుడు గొడ్డలితో దాడి చేసిన ఘటన జనగామ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... లింగాలఘణపురం గ్రామానికి చెందిన ఎడ్ల బసవయ్యకు నాలుగు ఎకరాల పట్టా భూమి ఉంది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల వలన ఒక ఎకరం భూమి గతంలో అమ్ముకున్నాడు. మిగిలిన 3 ఎకరాల భూమి నుంచి 2 ఎకరాల భూమి తన కుమారుడైన ఎడ్ల చంద్రయ్యకు పట్టాచేశారు.

07/15/2019 - 04:03

విశాఖపట్నం (క్రైం), జూలై 14: ఇక్కడి పెందుర్తి పరిధిలో తల్లి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం సృష్టించింది. స్థానిక ప్రహ్లాదపురం, భరత్‌నగర్‌కాలనీలో నివాసముంటున్న బి.సత్యనారాయణ శనివారం రాత్రి పైడిభీమవరంలోని ఫార్మకాంపెనీలో విధులకు హాజరై మరుసటి రోజు ఉదయం ఇంటికి చేరుకున్నాడు.

07/15/2019 - 03:56

కిర్లంపూడి, జూలై 14: తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో 16వ నెంబరు జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం టోల్ గేటు కేబిన్ కూలి ఒక యువకుడు మృతిచెందాడు. టోల్‌గేటులో టీసీగా పనిచేస్తున్న ఉండూరి రాజు (25) ఆదివారం ఉదయం విధులు నిర్వహిస్తున్నాడు.

07/15/2019 - 01:22

భద్రాచలం టౌన్: చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టు దళ కమాండర్లు హతమయ్యారు. జిల్లాలోని కిరండల్ పోలీసుస్టేషన్ పరిధిలో గుమియాపాల్ అటవీ ప్రాంతంలో డీఆర్‌జీ బలగాలు మావోయిస్టుల కోసం వేట ప్రారంభించాయి. ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడగా భద్రత బలగాలను చూసి కాల్పులకు దిగారు.

Pages