S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

04/04/2019 - 04:59

సంబేపల్లె, ఏప్రిల్ 3: పదవ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో కడప జిల్లాకు చెందిన ముగ్గురు ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయినులను పోలీసులు అరెస్టు చేశారు. మార్చి నెల 30వ తేదీ జరిగిన పదో తరగతి సాంఘిక శాస్త్రం పేపర్-2 ప్రశ్నాపత్రం వాట్సాప్ ద్వారా లీకైన విషయమై కర్నూలు జిల్లా పోలీసులు కేసు నమోదుచేశారు.

04/04/2019 - 04:26

ముదినేపల్లి, ఏప్రిల్ 3: అతి వేగంగా వెళుతున్న ద్విచక్ర వాహనం అదుపు తప్పిన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందిన ఘటన బుధవారం కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలం వణుదుర్రు గ్రామంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

04/04/2019 - 04:25

కైకలూరు, ఏప్రిల్ 3: పట్టణంలోని ప్రముఖ చేపల వ్యాపారి కార్యాలయంలో బుధవారం ఆదాయపు పన్ను శాఖాధికారులు సోదాలు నిర్వహించారు. ప్రముఖ చేపల ఎగుమతుల వ్యాపారి బీహార్ రాష్ట్రానికి చెందిన బాలేశ్వరరావుకు సంబంధించిన కార్యాలయంలో, ఎన్‌జీవో కాలనీలో ఉన్న ఆయన నివాసంలోనూ పెద్ద ఎత్తున అధికారులు దాడులు నిర్వహించారు.

04/03/2019 - 22:55

నెల్లూరు రూరల్, ఏప్రిల్ 3: తొమ్మిది రోజుల క్రితం పుట్టిన బాబును సూర్య కిరణాల కోసం అపార్ట్‌మెంట్ పైకి తీసుకువెళ్లిన అమ్మమ్మ లిఫ్టు ఉందన్న భ్రమలో లిఫ్టు గోతిలో పడి ఇద్దరూ మృతిచెందిన సంఘటన నెల్లూరు రూరల్ మండలంలో బుధవారం జరిగింది.

04/03/2019 - 22:44

రేణిగుంట, ఏప్రిల్ 3: చిత్తూరు జిల్లా రేణిగుంట మండల పరిధిలోని గాజులమండ్యం రూరల్ పోలీసులు నాయుడుపేట, తిరుపతి రహదారిలో తనిఖీలు చేస్తుండగా రూ. 39లక్షలు నగదును సీజ్‌చేసిన సంఘటన బుధవారం మధ్యాహ్నం గాజులమండ్యం కూడలిలో చోటుచేసుకుంది.

04/03/2019 - 22:43

చీరాల, ఏప్రిల్ 3: సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో ఫ్లైయింగ్ స్క్వాడ్ , పోలీసుసిబ్బంది సంయుక్తంగా దాడులు నిర్వహించి రూ.72 లక్షల 50 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు చీరాల డిఎస్‌పి యు నాగరాజు తెలిపారు. 2వ పట్టణ పోలీసుస్టేషన్లో బుధవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.

04/03/2019 - 04:54

చందుర్తి, ఏప్రిల్ 2: సరదాగా ఈతకోసం వెళ్లి ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తుపాకుల మణి జస్వంత్ (10), గుండి మనోజ్ (11) అనే ఇద్దరు చిన్నారులు గ్రామంలోనే ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుకుంటున్నారు.

04/03/2019 - 02:02

విజయవాడ (క్రైం), ఏప్రిల్ 2: నగరంలో టాస్క్ఫోర్స్ పోలీసులు కోటి 36లక్షల నగదును పట్టుకున్నారు. ఏవిధమైన లెక్కలు లేని అక్రమ సొమ్ముగా తేల్చారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

04/03/2019 - 01:51

సనత్‌నగర్, ఏప్రిల్ 2: అమీర్‌పేట ఆదిత్య పార్క్ హోటల్‌లో హైటెక్ పద్ధతిలో కొంత కాలంగా వ్యభిచారం కొనసాగుతుంది. పక్కా సమాచారంతో సంజీవరెడ్డినగర్ పోలీసులు దాడి చేసి ఉజ్బెకిస్తాన్ దేశానికి చెందిన నలుగురు యువతులను అరెస్టు చేశారు. మంగళవారం ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను పంజాగుట్ట అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) తిరుపతన్న వెల్లడించారు.

04/03/2019 - 01:43

నేరేడ్‌మెట్, ఏప్రిల్ 2: విద్యార్ధుల పట్ల ఆన్‌లైన్ పబ్‌జీ గేమ్ యమపాశంగా మారింది. మల్కాజిగిరిలో ఓ ప్రైవేట్ పాఠశాలలో పదవ తరగతి పూర్తిచేసుకున్న కల్లాకురి భరత్ (16) సెల్‌ఫోన్‌లో ఆన్‌లైన్ పబ్‌జీ గేమ్ ఆటకు బానిసయ్యాడు. భరత్ గంటల తరబడి పబ్‌జీ గేమ్ ఆడుతుండగా తల్లిదండ్రులు మందలించడంతో ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.

Pages