S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/29/2019 - 22:59

పోలవరం, మార్చి 29: పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం పట్టిసం పంచాయతీ పరిధిలోని కన్నాపురం అడ్డరోడ్డు వద్ద ఎన్నికలు సందర్భంగా ఏర్పాటుచేసిన చెక్‌పోస్టులో శుక్రవారం ఉదయం నిర్వహించిన తనిఖీల్లో 712.643 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. పోలవరం ఎస్సై సీహెచ్‌ఎస్ రామచంద్రరావు కథనం ప్రకారం శుక్రవారం ఉదయం తనిఖీలు నిర్వహిస్తుండగా పట్టిసం గ్రామం వైపు నుంచి వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తనిఖీ చేశారు.

03/29/2019 - 22:42

న్యూఢిల్లీ/ హైదరాబాద్, మార్చి 29: ఎన్నికల ప్రవర్తనా నియమావళికి కేసీఆర్ సర్కార్ తూట్లు పొడుస్తోందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. టీపీసీ ఎన్నికల కమిషన్ సమన్వయ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి శుక్రవారం ఇక్కడ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

03/29/2019 - 22:40

విజయవాడ, మార్చి 29: మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు శుక్రవారం ముగిసాయి. కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 15కు వాయిదా వేసింది. విచారణను వాయిదా వేస్తూ హైకోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసింది.

03/29/2019 - 22:39

విజయవాడ, మార్చి 29: కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) జారీ చేసిన ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమని ఏపీ హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర నిఘా విభాగ డీజీ సహా ముగ్గురు ఐపీఎస్ అధికారుల వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో నిఘా విభాగ డీజీ వెంకటేశ్వర రావును బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

03/29/2019 - 22:29

శ్రీరాంపూర్ రూరల్, మార్చి 29: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కె-5 గనిలో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ప్రమాదంలో కార్మికులకు తీవ్రగాయాలైయాయి. గనిలో 2వ సీం 17వ లెవల్‌లో పైకప్పు బండకూలింది. విధి నిర్వర్థిస్తున్న 12మంది కార్మికులు తృటిలో తప్పించుకున్నారు.

03/29/2019 - 21:30

న్యూఢిల్లీ, మార్చి 29: శారదా చిట్‌ఫండ్ కేసు దర్యాప్తులో ఎందుకు సహకరించడం లేదో తగిన వివరణ ఇవ్వాలని టెలికాం కంపెనీలైన వోడాఫోన్, ఎయిర్‌టెల్‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది. శారదా చిట్స్ కుంభకోణానికి సంబంధించి తాము అడిగిన కాల్స్ వివరాలు, ఇతర డేటాను ఇవ్వడానికి ఈ రెండు సర్వీస్ ప్రొవైడర్లు నిరాకరిస్తున్నాయని సుప్రీంకు సీబీఐ వివరించింది.

03/29/2019 - 21:28

నోయిడా, లక్నో, మార్చి 29: గ్రేటర్ నోయిడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలు ఉండగా, ప్రమాదంలో 30 మందికి పైగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని జాలన్ జిల్లా నుంచి ఢిల్లీకి ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు గ్రేటర్ నోయిడా ప్రాంతంలోని ఎక్స్‌ప్రెస్‌వేపై శుక్రవారం ఉదయం ట్యాంకర్‌ను ఢీకొంది.

03/29/2019 - 21:26

న్యూఢిల్లీ, మార్చి 29: 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన 186 కేసుల దర్యాప్తును పూర్తి చేయడానికి స్పెషల్ ఇనె్వస్టిగేషన్ టీమ్ (సిట్)కు మరో రెండు నెలల సమయం ఇస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. న్యాయమూర్తులు ఎస్‌ఏ బోబ్డే, ఎస్.అబ్దుల్ నజీర్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.

03/29/2019 - 21:25

న్యూఢిల్లీ, మార్చి 29: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులంతా ముందుగానే తమ నేర చరిత్రను ఎన్నికల సంఘానికి తెలియజేయాలని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ధిక్కరించినందుకు గాను కోర్టు ధిక్కారం కింద విచారణ ప్రారంభించాలని కోరుతూ దాఖలయిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.

03/29/2019 - 21:22

న్యూఢిల్లీ, మార్చి 29: ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్న సంస్థలకు నిర్వాహకులుగా వ్యవహరిస్తున్న ముగ్గురికి 15 లక్షల జరిమానా విధించడమే కాక, ఉగ్రవాదులకు సమకూర్చేందుకు తీసుకువెళ్తున్న ఏడు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం తెలిపారు.

Pages