S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/25/2019 - 23:07

హైదరాబాద్, మార్చి 25: రుణాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టయింది. తక్కువ వడ్డీలకు రుణాలు ఇప్పిస్తామంటూ అమయకులను టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్న లోన్ కాల్ సెంటర్ నిర్వహకులను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైకి చెందిన ఒక ముఠా టీమ్ లీడర్లను, మేనేజర్‌లను ఏర్పాటు చేసుకుని మోసాలకు పాల్పాడుతోంది.

03/25/2019 - 22:55

న్యూఢిల్లీ, మార్చి 25: ఆదాయానికి మించిన ఆస్తులు కలిగివున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజవాది పార్టీ నాయకుడు ములాయం సింగ్ యాదవ్, అతని కుమారులు అఖిలేష్ యాదవ్, ప్రతీక్ యాదవ్‌లపై కేసు నమోదు విషయంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు సీబీఐపై తీవ్రంగా మండిపడింది. ఈమేరకు కేంద్ర దర్యాప్తు సంస్థకు నోటీసులు జారీ చేసింది.

03/25/2019 - 22:55

న్యూఢిల్లీ, మార్చి 25: ఢిల్లీలో పాలనాపరమైన విభాగాల్లో ఎదురవుతున్న సమస్యలను నియంత్రించేందుకు, త్వరితగతిన పరిష్కరించేందుకు వీలుగా ఒక ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయాలని ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ‘ఆప్’ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈమేరకు సుప్రీంలో ఒక పిటిషన్‌ను దాఖలు చేసింది.

03/25/2019 - 22:52

న్యూఢిల్లీ, మార్చి 25: మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి న్యాయవాది గౌతమ్ ఖైతాన్, అతని భార్య రీతూతోపాటు విండ్‌సర్ హోల్డింగ్ గ్రూప్ లిమిటెడ్, ఇస్‌మాక్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన చార్జిషీటుపై సమన్లు జారీ చేసింది.

03/25/2019 - 22:52

న్యూఢిల్లీ, మార్చి 25: దేశంలో వచ్చే నెలలో వివిధ రాష్ట్రాల్లో జరుగనున్న జనరల్, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఒక్కో సెగ్మెంట్‌కు కేటాయించిన వీవీప్యాట్లను ఏమేరకు పెంచుతారో అన్న అంశంపై ఈనెల 28 తేదీలోగా స్పష్టం చేయాలని సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్‌ను సోమవారం ఆదేశించింది.

03/25/2019 - 04:23

గరిడేపల్లి, మార్చి 24: సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో ఆదివారం తెల్లవారుఝామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో రోడ్డుపై నడుచుకుంటు వెళ్తున్న వీరన్న భక్తులపైకి లారీ దూసుకెళ్లటంతో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతోహుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు. చనిపోయిన వారంతా గరిడేపల్లికి చెందినవారే.

03/25/2019 - 01:41

మేడ్చల్, మార్చి 24: భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్థాపానికి గురైన భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ గణేశ్ తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ రైల్వేస్టేషన్ రోడ్డులో నివాసం ఉండే శ్రీనివాస్(36) శైలజ భార్యాభర్తలు. దంపతులు మూడు రోజులుగా ఎదో విషయమై గొడవపడుతున్నారు. అలిగిన భార్య శైలజ పుట్టింటికి వెళ్లిపోయింది.

03/25/2019 - 01:41

హయత్‌నగర్, మార్చి 24: మనస్థాపానికి గురైన గృహిణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హయత్‌నగర్ విజయపురికాలనీకి చెందిన కొమిరెల్లి ప్రశాంతి(24) భర్త రమేష్ రెడ్డితో కలిసి ఉంటుంది. శనివారం రాత్రి ప్రశాంతి ఇంట్లో ఉన్న సమయంలో పక్క పోర్షన్‌లో నివాసం ఉండే కుంచాల నరేష్(27) తలుపుతట్టి అసభ్యకరంగా ప్రవర్తించాడు.

03/25/2019 - 01:28

ఖైరతాబాద్, మార్చి 24: పార్లమెంట్ ఎన్నికల్లో ధన ప్రవాహం భారీగా ఉంటుందన్న అంచనాలకు బలం చేకూరుస్తూ జూబ్లీహిల్స్‌లో రూ.1.49 కోట్లు పట్టుబడ్డాయి. పార్లమెంట్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నగరంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

03/24/2019 - 23:44

న్యూఢిల్లీ, మార్చి 24: సుమారు 8,100 కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించిన కేసు పురోగతి కోసం లెటర్స్ రొగాటరీ (ఎల్‌ఆర్)లను రాసేందుకు అనుమతించాల్సిందిగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ (ఈడీ) చేసిన వినతిపై ఢిల్లీ కోర్టు సానుకూలంగా స్పందించింది. గుజరాత్‌కు చెందిన స్టెర్లింగ్ బయోటెక్ లిమిటెడ్ వేల కోట్ల రూపాయల మోసానికి పాల్పడిన సంఘటనపై ఈడీ విచారణ జరుపుతున్నది.

Pages