S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/22/2019 - 01:16

గచ్చిబౌలి, మార్చి 21: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అనుమానాస్పద స్థితిలో జింక మృతిచెందింది. ఉదయం యూనివర్సిటీలోని షూటింగ్ రేంజ్ సమీపంలో జింక మృతి చెంది శరీరంపై గాయాలుండడం గమనించిన విద్యార్థులు.. గచ్చిబౌలి పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. మూడు రోజుల క్రితం జింకను కుక్కలు చంపినట్లు యూనివర్సిటీ విద్యార్థులు తెలిపారు.

03/22/2019 - 01:15

ఉప్పల్, మార్చి 21: హోలీ వేడుకల్లో అపశృతి దొర్లింది. ఉదయమంతా స్నేహితులతో రంగుల్లో ఆడి పాడిన బాలుడు స్విమ్మింగ్‌పూల్‌లో ఈత కొడుతూ మునిగి మరణించాడు. విషాద సంఘటన మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం గుజరాత్ దామేరాకు చెందిన భాయి కుమారుడు భగవాన్ భాయి(16) విద్యార్థి. హైదరాబాద్ పాతబస్తీ బేగంబజార్‌లో ఉంటున్న బంధువు చంపాలాల్ ఇంటికి ఈనెల 19న వచ్చాడు.

03/21/2019 - 03:41

హైదరాబాద్(గచ్చిబౌలి), మార్చి 20: విజిటింగ్ వీసా మీద కువైట్‌కు ఉద్యోగాల పేరిట పంపిన రెండు ముఠాలకు చెందిన 18 మందిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు ఎయిర్‌పోర్టు సిబ్బంది, కానిస్టేబుల్‌తోపాటు 15మందిని అరెస్టు చేసినట్లు సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ వెల్లడించారు.

03/21/2019 - 03:43

హైదరాబాద్, మార్చి 20: నూతనంగా నిర్మిస్తున్న విల్లాస్ ఆర్చీ శ్లాబ్ కూలి ఆరుగురు గాయపడ్డారు. బుధవారం గోల్కొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. గాయపడ్డవారిలో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలిసింది. విల్లాస్ ఆర్చీ ఒక్కసారిగా కూలింది. శిధిలాల కింద కూలీలకు స్థానికులు బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గోల్కొండ ఇన్‌స్పెక్టర్ కొమరయ్య కథనం ప్రకారం..

03/21/2019 - 02:28

అహ్మదాబాద్: గోద్రా అల్లర్ల కేసులో ఒక నిందితుడికి జీవిత ఖైదును విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. గోద్రా రైలుదహనం కేసు 2002లో జరిగిన విషయం విదితమే. ప్రత్యేక సిట్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌సీ వోహ్రా ఈ తీర్పు ఇచ్చారు. ఈ కేసులో యాకుబ్ పటాలియాకు యావజ్జీవ ఖైదును విధించారు. ఈ నిందితుడిపై వచ్చిన అభియోగాలను ప్రాసిక్యూషన్ రుజువు చేసింది. పటాలియాను గత ఏడాది జనవరిలో పోలీసులు అరెస్టు చేశారు.

03/21/2019 - 01:41

న్యూఢిల్లీ, మార్చి 20: ఉత్తరప్రదేశ్‌కు చెందిన రిటైర్డు ఐఏఎస్ అధికారి చెందిన రూ.225 కోట్ల ఆస్తులను పన్ను ఎగవేత కేసులో ఆదాయంపన్ను (ఐటీ) శాఖ జప్తు చేసింది. ఈ మేరకు రిటైర్డు ఐఏఎస్ అధికారి ఎన్ రామ్‌కు ఐటీ అధికారులు నోటీసులను జారీ చే శారు. ఢిల్లీ, ముంబయి, నోయిడా, కోల్‌కొతాలో 20కుపైగా ఆస్తుల ను జప్తు చేశారు. లక్నోలోని ఆయన ఆఫీసు వద్ద మూడు లగ్జరీ కార్లను కూడా ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

03/21/2019 - 01:36

విజయవాడ (క్రైం), మార్చి 20: మద్యం అక్రమ నిల్వలపై టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఓ గోడౌన్ నుంచి సుమారు రూ.77,67,610 లక్షలు విలువైన 67 రకాల కంపెనీలకు చెందిన మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

03/21/2019 - 01:36

మచిలీపట్నం, మార్చి 20: జిల్లా కేంద్రం మచిలీపట్నంలో బుధవారం బాంబులు కలకలం సృష్టించాయి. సుకర్లాబాద్‌లోని ఓ వివాహిత మహిళ ఇంట్లో బయటపడిన రెండు బాంబులు పట్టణ వాసులను ముచ్చెమటలు పట్టించాయి. మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న అనుమానంతో ఆ వివాహిత మహిళను మట్టుపట్టేందుకు భర్తే తన మీద అనుమానంతో ఈ బాంబులను పెట్టినట్టు బాధిత మహిళ పేర్కొంటోంది.

03/21/2019 - 01:27

షాద్‌నగర్ రూరల్, మార్చి 20: టైర్ల పరిశ్రమలో గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం ఫరూఖ్‌నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామ పంచాయతీ పరిధిలోని దొంతికుంటతండా సమీపంలో ఉన్న టైర్ల పరిశ్రమలో గ్యాస్ సిలిండర్ పేలి దుద్దేల ప్రవీణ్‌తోపాటు మరో కార్మికులు తీవ్రంగా గాయపడ్డాడు.

03/21/2019 - 01:26

వికారాబాద్, మార్చి 20: అక్రమంగా మట్టి తరలిస్తున్న నాలుగు లారీలను సీజ్ చేసిన సంఘటన వికారాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ లక్ష్మయ్య వివరాల ప్రకారం.. మున్పిపల్ పరిధిలో శివరెడ్డిపేట్ తాగునీటి జలాశయం వద్ద కొంతమంది వ్యక్తులు అక్రమంగా మట్టిని తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు.

Pages