S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

01/15/2019 - 03:15

సనత్‌నగర్, జనవరి 14: ఇద్దరు భార్యలు ఉండగా మూడో పెళ్లికి యత్నిస్తున్న భర్తపై భార్యలు ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే....బోరబండకు చెందిన మహ్మద్ ఖాన్ గతంలో రుక్సార్ బేగం, నిస్సార్ బేగంలను వివాహం చేసుకున్నాడు. రెండో భార్య నిస్సార్ బేగం 15 రోజుల క్రితం బాబుకు జన్మనిచ్చింది.

01/15/2019 - 03:15

కదిరి, జనవరి 14: కర్నాటక రాష్ట్రం చిక్‌బళ్ళాపూర్ సమీపంలో ఆర్టీసీ బస్సు లారీనీ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. మరికొంత మందికి గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా కదిరి డిపో బస్సు బెంగళూరు వెళ్తుండగా చిక్‌బళ్ళాపూర్ వద్ద ఆదివారం అర్ధరాత్రి ఎదురుగా వెళ్తున్న లారీని ఢీకొంది. దీంతో బస్సు డ్రైవర్ హేమంత్‌కుమార్(35), కదిరికి చెందిన ప్రయాణికుడు నందసాయి(14) అక్కడికక్కడే మృతి చెందారు.

01/15/2019 - 02:39

న్యూఢిల్లీ, జనవరి 14: 1984 సిక్కు అల్లర్ల కేసులో అరెస్టు అయిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు సజ్జన్ కుమార్ తనకు జీవితకాల శిక్ష విధించడంపై చేసిన అభ్యర్థనపై ఏమి చర్యలు తీసుకున్నారో తెలపాలని సుప్రీంకోర్టు సీబీఐకి నోటీసు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టు తనకు యావజ్జీవ కారాగారం విధించడాన్ని సవాల్ చేస్తూ సజ్జన్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

01/15/2019 - 04:39

న్యూఢిల్లీ: సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు నియామకాన్ని రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈనెల 10 నాగేశ్వరరావును జాతీయ దర్యాప్తు సంస్థ డైరెక్టర్‌గా నియమించారు. సీబీఐలో అదనపుడైరెక్టర్‌గా ఉన్న రావుకు తాత్కాలిక డైరెక్టర్‌గా పదోన్నతి లభించింది. ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని ఉన్నతస్థాయి కమిటీ అలోక్ కుమార్ వర్మకు ఉద్వాసన చెప్పిన సంగతి తెలిసిందే.

01/15/2019 - 03:30

రాజమహేంద్రవరం, జనవరి 14: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ బొమ్మూరు పోలీసుస్టేషన్ సోమవారం తెల్లవారుజామున గంజాయి కేసులో నిందితుడు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం గ్రామానికి చెందిన నడింపల్లి సీతారామరాజు కారులో గంజాయిని రవాణా చేస్తుండగా ఆదివారం రాత్రి బొమ్మూరు పోలీసులు పట్టుకున్నారు.

01/15/2019 - 01:41

నిజామాబాద్, జనవరి 14: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఇటీవలి కాలంలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనల్లో చిరుత పులులు మృత్యువాత పడుతున్నాయి. అనుకోని రీతిలో సంభవిస్తున్న ప్రమాదాలు సైతం వాటిని బలిగొంటున్నాయి. గడిచిన ఏడాదిన్నర కాలంలోనే వేర్వేరు సంఘటనల్లో ఐదు చిరుత పులులు మృత్యువాతపడడం ఆందోళన కలిగిస్తోంది.

01/15/2019 - 00:14

హైదరాబాద్, జనవరి 14: సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ( జగన్మోహన్ రెడ్డిసోదరి) షర్మిల నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం షర్మిల తన భర్త అనిల్ కుమార్, పార్టీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులతో కలిసి నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్‌ను కలిసి ఈ మేరకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

01/14/2019 - 23:30

కురబలకోట, జనవరి 14: సంక్రాంతి పండుగ రోజున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ రైతు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కురబలకోట మండలంలోని అంగళ్ళు దగ్గరున్న మల్లేలగడ్డ వద్ద సోమవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముదివేడు ఎస్‌ఐ నెట్టి కంఠయ్య కథనం మేరకు మండలంలోని మట్టివారిపల్లె గ్రామం, శివరామపురంకు చెందిన వై.వీరనాగప్పనాయుడు (64) వ్యవసాయం చేసుకుంటూ చీటీలు కూడా నిర్వహిస్తున్నాడు.

01/14/2019 - 23:30

తిరుపతి, జనవరి 14: పండగలంటే ఇంటికి వచ్చే అల్లుళ్లకు ఎనలేని గౌరవం ఇస్తారు. అయితే మద్యం సేవించి వచ్చి దుర్భాషలాడటంతో మామే అల్లుడిని కత్తితో పొడిచిన సంఘటన పాకాల మండలం తలారిపల్లిలో సోమవారం మధ్యాహ్నం జరిగింది. గాయపడ్డ అల్లుడిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయాస్పత్రికి తరలించారు. సీఐ హరినాథ్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

01/14/2019 - 23:29

తిరుపతి, జనవరి 14: తిరుచానూరు ఎస్‌ఐ రామాంజనేయులు లాఠీ విరిగేంత వరకు కొట్టడంతో నందకిశోర్ (24) అనే యువకుడి ఎడమ చేతి ఎముక విరగడంతో పాటు అతని శరీరంపై వాతలు లేచాయి.

Pages