S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

12/11/2018 - 23:37

పాయకరావుపేట, డిసెంబర్ 11: మండలంలో పాల్మాన్‌ఫేట సిరిమెరిన్ హాచరీస్‌లో రొయ్యిల ట్యాంక్‌ను పరిశీలిస్తుండగా పంపర బోయిన రాము(22) ట్యాంక్ తలకు ఢీ కొనడంతో చనిపోయినట్లు ఎస్సై ఎల్.రామకృష్ణ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. పాల్మాన్‌పేట సిరిమెరిన్‌హాచరీస్‌లో రాము మూడు నెలలుగా పని చేస్తున్నాడన్నారు.

12/11/2018 - 23:30

కంచిలి, డిసెంబర్ 11: మండలంలోని బూరగాం గ్రామంలో మంగళవారం ఉదయం చెరువులో పడి కేశవరావు(40) మృతి చెందాడు. పోలీసులు, కుటుంబీకులు చెప్పిన వివరాలు ప్రకారం కేశవరావు ఉదయం స్నానానికి వెళ్లి చెరువులో జారిపడిపోవడంతో ఈత రాకపోవడంతో మరణించినట్లు తెలిపారు. పడిపోవడాన్ని గమనించిన స్థానికులు చెరువులో వెతికేసమయానికి మృతి చెందినట్లు తెలిపారు.

12/11/2018 - 23:25

కొమరోలు, డిసెంబర్ 11: మండలంలోని గుంర్రెడ్డిపల్లి వద్ద రోడ్డుమార్జిన్‌లో ఆపి ఉన్న ఆటోను వేగంగా వస్తున్న వ్యాన్ ఢీకొనడంతో ఆటోడ్రైవర్ గణేష్ (34) మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. గుంర్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన గణేష్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా ప్రయాణికుల కోసం రోడ్డుపక్కన ఆటో ఆపి వేచి ఉన్నాడు. వేగంగా లారీ వస్తుండగా దాని వెనుక ప్రైవేటు వాహనం వస్తున్నది.

12/11/2018 - 22:59

కుప్పం, డిసెంబర్ 11: కుటుంబ కలహాలతో తల్లీబిడ్డ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల పరిధిలోని లక్ష్మీపురంలో మంగళవారం జరిగింది. కుప్పం ఎస్సై లోకేష్ కథనం ప్రకారం కర్నాటక రాష్ట్రం బుదికోట గ్రామానికి చెందిన వీణకు కుప్పం మండలం లక్ష్మీపురానికి చెందిన శివతో నాలుగేళ్ల కిందట వివాహం జరుగగా, వీరికి ఏడాది వయసు కలిగిన కొడుకు ఉన్నాడు. నాలుగు నెలలుగా భార్యభర్తల నడుమ తరుచూ చిన్నిచిన్న గోడవలు జరుగుతుండేవి.

12/11/2018 - 22:58

తిరుపతి, డిసెంబర్ 11: స్థానిక చింతలచేను వద్ద ఉన్న ఓ గోడౌన్‌లో దాదాపు 260 టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేసి ఉండగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, సివిల్ సఫ్ల్సై అధికారులు మంగళవారం ఆకస్మికంగా దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. ముందుగా అందిన సమాచారంతో జరిగిన ఈ దాడుల సమయంలోనే రెండు షేర్ ఆటోల్లో రేషన్ బియ్యం అక్కడకు తీసుకువచ్చారు.

12/11/2018 - 22:53

మడకశిర, డిసెంబర్ 11: మండల పరిధిలోని వైబీ హళ్ళి ప్రధాన రహదారిలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్, ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో భార్య భర్తలు రంగస్వామి (40), నాగరత్నమ్మ (28)లు దుర్మరణం చెందారు. ఇందుకు సంబంధించి వివరాలు ఉన్నాయి. వైబీ హళ్ళికి చెందిన నాగరత్నమ్మ పరిగిలో ఉన్న గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తోంది.

12/11/2018 - 02:50

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: భూసేకరణ చట్టం-2013కు సవరణలు ఎలా చేస్తారంటూ ఐదు రాష్ట్రాలను సుప్రీం కోర్టు ప్రశ్నించింది. చట్టానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, జార్ఖంఢ్ ప్రభుత్వాలు సవరణ చేశాయి. ఈ సవరణలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు ధర్మాసనం సోమవారం విచారించింది. సవరణలు చట్టాన్ని నీరుగార్చేవిధంగా ఉన్నాయని సామాజికవేత్త మేధాపాట్కర్ ఈ పిటిషన్ వేశారు.

12/11/2018 - 04:42

న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాల కేటాయింపుకోసం ఏర్పాటు చేసిన జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌లో వాదనలు తెలుగు రాష్ట్రాల మధ్యనే విభజన చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మహారాష్ట్ర కర్ణాటకకు గతంలో నీటి కేటాయింపులపై ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులకు విఘాతం కలిగించకుండా ఏపీ, తెలంగాణకు నీటి పంపకాలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేవించింది.

12/11/2018 - 02:43

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: అగస్టావెస్ట్‌లాండ్ వీవీఐపీ హెలీకాప్టర్ల కుంభకోణం కేసులు మధ్యవర్తి క్రిస్టియన్ మిచెల్‌కు మరో ఐదురోజుల రిమాండ్ పొడిగించారు. సోమవారం మిచెల్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి అర్వింద్ కుమార్ ఎదుట హాజరుపరిచారు. మిచెల్ విచారణకు సహకరించడం లేదని అధికారులు కోర్టుకు తెలిపారు. దీంతో మరో ఐదు రోజులు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ న్యాయమూర్తి ఆదేశించారు.

12/11/2018 - 02:42

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన ప్రజావ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. గవర్నర్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి తాము జోక్యం చేసుకోదల్చుకోలేదని చీఫ్‌జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్‌కె కౌల్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Pages