S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

11/21/2018 - 02:07

వార్ధా (మహరాష్ట్ర), నవంబర్ 20: మహారాష్టల్రోని వార్ధా జిల్లాలో మంగళవారం ఒక ఆర్డినెన్సు ఫ్యాక్టరీలో జరిగిన పేలుళ్ల ఘటనలో ఆరుగురు వ్యక్తులు మరణించారు. పది మంది గాయపడ్డారు. ఈ పేలుళ్లు ఉదయం 7 గంటల నుంచి 7.15 గంటల మధ్య సంభవించాయి. కేంద్ర ఆయుధ గిడ్డంగిలో పేలుళ్లు జరిగాయి. వార్ధా జిల్లాలో పుల్గాన్ పట్టణంలోని ఆర్డినెన్సు ఫ్యాక్టరీలో ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు చెప్పారు.

11/21/2018 - 02:05

రాయపర్తి, నవంబర్ 20: విష ప్రయోగంతో బాలుడు మృతిచెందిన సంఘటన మండలంలోని సన్నురు శివారు రాజ్యనాయక్ తండాలో మంగళవారం చోటు చేసుకుంది. బానోతు రెడ్యా-సూజాత దంపతులకు ఇద్దరు కుమార్తెలు 10 నెలల బాలుడు ఉన్నారు. గత పది రోజుల క్రితం రెడ్యా పాలెరు పనికి వెళ్ల గా భార్య సుజాత తన కుమార్తెతో పాటు బాలుని కూడా తన మామకు అప్పగించి వ్యవసాయ పనుల కోసం వెళ్లింది. తన మామ రైతు బందు చెక్కుల నిమిత్తం బ్యాంక్‌కు వెళ్లాడు.

11/21/2018 - 01:50

న్యూఢిల్లీ, నవంబర్ 20: సీబీఐలో డైరెక్టర్ అలోక్ వర్మపై వచ్చిన అభియోగాలపై ఇచ్చిన జవాబు లీక్ కావడంపై సుప్రీంకోరు ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేసింది. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో మంగళవారం ఉదయం కోర్టు విచారణ ప్రారంభమైన వెంటనే ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసును విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది.

11/21/2018 - 01:36

ఆత్మకూరు రూరల్, నవంబర్ 20: భార్యపై అనుమానంతో కన్నకొడుకునే కడతేర్చాడు ఓ తండ్రి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆత్మకూరు పోలీసుస్టేషన్‌లో మంగళవారం డీఎస్పీ రామాంజనేయరెడ్డి విలేఖరుల సమావేశంలో ఈ సంఘటన వివరాలు వెల్లడించారు. ఆయన మాటల్లోనే.. ఏఎస్ పేట మండలం రాజవోలు గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యిక్తి భార్యపై అనుమానంతో తరచూ ఇద్దరి మధ్యన గొడవలు జరుగుతుండేవని తెలిపారు.

11/21/2018 - 03:53

న్యూఢిల్లీ: ఢిల్లీ సిక్కుల ఊచకోతకు సంబంధించి 1984 నాటి సిక్కుల వ్యతిరేక అల్లర్ల కేసులో ఒక దోషికి మరణ శిక్ష, మరో దోషికి జీవిత ఖైదును విధిస్తూ ఢిల్లీ కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య అనంతరం ఢిల్లీ నగరంలో అల్లర్లు జరిగాయి. ఈ ఘటనలో మూడు వేల మంది ప్రజలు మరణించారు.

11/20/2018 - 23:35

శెట్టూరు, నవంబర్ 20 : మండల పరిధిలోని చిన్నంపల్లి గ్రామంలో ధనలక్ష్మి (35) విద్యుదాఘాతంతో మంగళవారం మృతి చెందింది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు ఇంట్లో ఏర్పాటు చేసుకున్న 2హెచ్‌పీ మోటారుకు విద్యుత్ సరఫరా కావడంతో గమణించిన ధనలక్ష్మి పక్కన కూర్చొని ఉండగా షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.

11/20/2018 - 04:14

గూడూరు, నవంబర్ 19: ప్రమాదవశాత్తు వృద్ధులు దహనమైన సంఘటన ఆదివారం రాత్రి నెల్లూరు జిల్లా గూడూరు మండల పరిధిలోని చవటపాళెం గిరిజన కాలనీలో చోటు చేసుకుంది. సోమవారం స్థానికులు ఫిర్యాదు మేరకు గూడూరు రూరల్ ఎస్సై బాబి సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సై కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

11/20/2018 - 02:45

ఖాజీపేట, నవంబర్ 19: డబ్బు కోసం గొప్పింటి కుర్రాళ్లకు కూతురునే ఎరగా వేశాడు ఓ తండ్రి. దీనికి ఆ కూతురు కూడా పచ్చజెండా ఊపింది. పనె్నండేళ్లకే కూతురు 7వ తరగతి చదువుతుండగానే మొదటి పెళ్లి చేశాడు. ఆ తరువాత మరో పెళ్లి.. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు పెళ్లిళ్లు చేశాడు. పెళ్లి చేసి ఓ నెల, రెండు నెలలు కాపురం చేసిన తరువాత బంగారం, డబ్బుతో ఉడాయించడం, కొద్ది రోజుల తరువాత మరో పెళ్లి చేయడం..

11/20/2018 - 02:04

న్యూఢిల్లీ, నవంబర్ 19: సాక్షుల రక్షణకు నేషననల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా)తో కలిసి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పథకాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేసేలా ఆదేశాలు జారీ చేస్తామని సుప్రీం కోర్టు తెలియజేసింది.

11/20/2018 - 00:48

ఉప్పల్, నవంబర్ 19: ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు దుర్మరణం చెందిన సంఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం సరూర్‌నగర్ జింకల బావి కాలనీలో నివసిస్తున్న కేసని సతీష్ (24) ప్రైవేటు ఉద్యోగం. అతడు సోమవారం హబ్సిగూడ వైపు బైక్ వెళ్తుండగా ప్రమాదవశాత్తు సర్వే ఆఫ్ ఇండియా గేట్ వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది.

Pages