S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

09/21/2018 - 03:37

సైదాబాద్, సెప్టెంబర్ 20: కులం మరో ప్రేమ జంటను కాటు వేసింది. యువకుడు దళితుడు కావటం, యువతి తండ్రి పోలీసు కావటం ఈ సారి శాపమైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను తన నుంచి దూరం చేశారన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘంటన పాతబస్తీలో చోటుచేసుకుంది. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

09/21/2018 - 02:20

ఆర్మూర్, సెప్టెంబర్ 20: ఆర్మూర్ పట్టణంలోని సిద్ధులగుట్ట వెనుక పాత నరేంద్ర కళాశాల ఎదుట గురువారం ఉదయం ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో నల్ల యోగేష్(15), దత్తపురం సునీల్(16) అనే ఇద్దరు యువకులు మరణించారు. పోలీసులు తెలిపిన ప్రకారం సంఘటన వివరాలు ఉన్నాయి. ఆర్మూర్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు నిజామాబాద్‌కు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి.

09/21/2018 - 02:13

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: ముజఫర్‌పూర్‌లోని వసతిగృహాల్లో మహిళలపై జరిగిన అత్యాచారాలు, అకృత్యాలకు సంబంధించి వార్తాసంస్థలు ఇచ్చే వార్తల ప్రచురణ, ప్రచారంపై ఎలాంటి నిషేధం ఉండదని సుప్రీం కోర్టు గురువారం స్పష్టం చేసింది.

09/21/2018 - 02:05

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: కోరెగావ్-్భమా హింసకు సంబంధించి అరెస్టు చేసిన పౌరహక్కుల నేతలను వెంటనే విడుదల చేయాలని, వీరి అరెస్టుపై సిట్‌తో విచారణ జరపాలని చారిత్రకారులు రొమిలా తపర్, మరికొందరు వేసిన కేసు తీర్పును సుప్రీం రిజర్వ్‌లో ఉంచింది.

09/21/2018 - 03:57

పలాస: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న ప్రేమికులపై దాడుల ఘటన లాంటిదే పలాసలో గురువారం చోటు చేసుకోవడంతో పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో ఆందోళన నెలకొంది. కాశీబుగ్గ పోలీసుల కథనం ప్రకారం పొందర మురళీ, అదే వీధికి చెందిన రూప అనే అమ్మాయిని ప్రేమించాడు. 2017లో ఆమెను వివాహం చేసుకునేందుకు తీసుకెళ్లగా అప్పట్లో ఆమె మేజర్ కాకపోవడంతో అమ్మాయి బంధువులు ఫిర్యాదు చేయడంతో మురళీపై కేసు నమోదైంది.

09/21/2018 - 01:47

కాకినాడ సిటీ: ఉన్నత విద్యాభ్యాసం కోసం స్టడీ లీవు కోసం దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయుడి నుండి రూ.10వేలు లంచం తీసుకున్న తూర్పు గోదావరి జిల్లా విద్యాశాఖ కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం ప్రభాకరరావును అవినీతి నిరోధక శాఖ అధికార్లు గురువారం వలపన్ని పట్టుకున్నారు. జిల్లా కేంద్రం కాకినాడలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

09/21/2018 - 01:44

ఏలూరు: షెడ్యూల్డు కులాలకు చెందిన ఒక ఒక హమాలీ కార్మికుడిపై దాడిచేసి, గాయపరచినట్టు వచ్చిన ఫిర్యాదుపై రాష్ట్ర ప్రభుత్వ విప్, పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై గురువారం రాత్రి ఏలూరు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదుచేశారు. ఆయనతోపాటు ముగ్గురు గన్‌మ్యాన్లు, మరో ఇద్దరు నేతలపై కూడా పోలీసులు కేసు నమోదుచేశారు.

09/21/2018 - 01:10

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 20: నగర శివారులోని పోలీస్టేషన్ పరిధిలో కొద్దిరోజుల క్రితం జరిగిన మహిళ హత్య, దోపిడీ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇంట్లో అద్దెకుంటున్న ప్రియుడు, తన ప్రియురాలితో కలిసి హత్య చేసి నగలు దోచుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. బాకీ డబ్బులు అడిగినందుకు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

09/21/2018 - 00:05

ఆత్మకూర్(ఎం), సెప్టెంబర్ 20: యువతిని ప్రేమించి గర్భవతిని చేసిన నిర్వాకం బయటపడటంతో ఇరువర్గాల పెద్దలు పెళ్లికి మూహుర్తం పెట్టడంతో కులాంతర పెళ్లి ఇష్టం లేదని యువకుడు బలవన్మరణం చేసుకున్న ఘటన ఆత్మకూర్(ఎం) మండల కేంద్రంలో వెలుగుచూసింది. మండలంలోని కొరటికల్ గ్రామానికి చెందిన కట్టేకోల కిరణ్‌గౌడ్ (23) గత కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన ఓ దళిత యువతిని ప్రేమించాడు.

09/20/2018 - 23:10

డోన్, సెప్టెంబర్ 20:డోన్ పట్టణంలోని పాతపేటలో గురువారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించి సుమారు రూ. 3 లక్షల విలువ చేసే వివిధ రకాల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా పాతపేటకు చెందిన కె.రాజు, వి.మోహన్, గుండా సతీష్‌కుమార్, రహిమాన్ ప్రభుత్వం నిషేధం విధించిన గుట్కా వ్యాపారాన్ని గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తున్నారు.

Pages