S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

09/18/2018 - 23:17

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: దేశంలో రహదారుల నిర్వహణపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 2017 సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల్లో 3,597 మంది మృతి చెందడంపై కోర్టు స్పందించింది. మరణాలన్నీ అస్తవ్యస్త రోడ్లు, గోతుల మూలంగానే జరిగాయని తెలుసుకున్న సుప్రీం కోర్టు ‘ఇది అత్యంత దురదృష్టకరం’ అని వ్యాఖ్యానించింది. ఒక్క ఏడాదిలోనే ఇంత మంది చనిపోవడం బాధకరమని బెంచ్ పేర్కొంది.

09/18/2018 - 23:15

న్యూఢిల్లీ, సెప్టెంబరు 19: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన కృష్ణా నదీ జలాలను రెండు తెలుగు రాష్ట్రాలకు విభజించేందుకు ఉద్దేశించిన జస్టిస్ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు మంగళవారం తెలంగాణ క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగింది. కృష్ణా నదిలో నీటి లభ్యతకు సంబంధించిన అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తరపు సాక్షిగా ఉన్న విశే్వశ్వరరావును తెలంగాణ తరపు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు.

09/18/2018 - 23:14

సంతమాగులూరు, సెప్టెంబర్ 18: సంతమాగులూరు వినియక నిమజ్ఞనం కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. సంతమాగులూరు ద్వారకానగర్ కాలనీలో ఐదురోజులు పూజించిన వినాయకుని విగ్రహన్ని బుధవారం జలధిలో కలిపేందుకు అద్దంకి బ్రాంచికెనాల్‌కు తరలించి నీటిలో విగ్రహన్ని దింపుతుందడగా విగ్రహం పట్టుకుని నీటిలోకి దిగిన బత్తుల వెంకటేశ్వర్లు(47) విగ్రహంతోపాటు నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు.

09/18/2018 - 23:14

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: ఢిల్లీ చీఫ్ సెక్రటరీపై దాడి చేశారని నమోదైన కేసులో ఢిల్లీకోర్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, 11మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలకు మంగళవారం సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 25న వారందరూ వ్యక్తిగతంగా కోర్టుముందు హాజరు కావాలని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సమర్ విశాల్ ఆదేశాలు జారీ చేశారు.

09/18/2018 - 23:14

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: భారత్-ఫ్రాన్స్ మధ్య జరిగిన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)ను అక్టోబర్ 10 విచారించనున్నట్టు సుప్రీం కోర్టు వెల్లడించింది. న్యాయమూర్తులు రంజన్ గొగోయ్, నవీన్ సిన్హా, కేఎం జోసెఫ్‌తో కూడిన ధర్మాసనం ముందుకొచ్చింది.

09/18/2018 - 03:58

షాబాద్, సెప్టెంబర్ 17: షాబాద్ మండలంలో సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో మండల పరిధిలోని చర్లగూడ గ్రామానికి చెందిన రైతు పార్వతి జంగయ్య కాడెద్దుపై పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతిచెందింది. వర్షాకాలంలో వ్యవసాయనికి నిరంతరం కూలీ పని చేసుకొని జీవించే మాకు దేవుడు అన్యాయం చేశాడని బోరువిలపించారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

09/18/2018 - 03:51

శంకర్‌పల్లి, సెప్టెంబర్ 17: మనస్పర్థలతో ప్రేమికుల జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం శంకర్‌పల్లి మండలం టంగటూరులో రాత్రి 11గంటల ప్రాంతంలో జరిగింది. స్థానిక ఎస్‌ఐలు లక్ష్మీనారాయణ, సంజీవ్ తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మండలంలోని టంగటూరు గ్రామానికి చెందిన ఎల్లేశ్ (22), లావణ్య (19) కొన్నాళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు.

09/18/2018 - 03:48

తాండూరు, సెప్టెంబర్ 17: పట్టణంలోని సీతారాంపేట్ కల్లు డిపో ప్రాంతంలోని గల్లీలో ఈనెల 15న రాత్రి చోటు చేసుకున్న భార్యాభర్తల హత్య కేసులో ప్రధాన నిందితులను పట్టణ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

09/18/2018 - 03:30

గాజువాక, సెప్టెంబర్ 17: శ్రీకన్య థియేటర్ కాంప్లెక్స్‌లోగల రెండు సినిమా థియేటర్లు సోమవారం ఉదయం అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాద సంఘటన ఉదయం 6గంటలకు జరగడం వలన పెనుప్రమాదం తప్పింది. థియేటర్లలో సినిమా ప్రదర్శించే సమయంలో ఇటువంటి ప్రమాదం జరిగితే భారీగాప్రాణనష్టం జరిగి ఉండేదని పలువురు అంటున్నారు. ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌యే కారణంగా యాజమాన్యం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

09/18/2018 - 02:03

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: దేశ రాజధాని ఢిల్లీలో మహిళలు వాహనాలు నడిపే విషయంలో బేసి-సరి వాహన రోటేషన్ పథకం (ఆడ్ ఈవన్ వెహికిల్ రోటేషన్ స్కీం) నుంచి మినహాయించాలంటూ సుప్రీం ఆదేశించింది. అలాగే ద్విచక్ర వాహనాలకు సైతం మినహాయింపునిచ్చింది. ఈ మేరకు గత యేడాది జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సోమవారం స్టే ఇచ్చింది.

Pages