S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

09/11/2018 - 03:10

కీసర, సెప్టెంబర్ 10: బ్యాంక్‌లో చోరీకి యత్నించిన వ్యక్తిని పోలీస్‌లు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కధనం ప్రకారం కోల్‌కత్తాకు చెందిన హరికృష్ణ దేబానత్ (21) గత మూడు సంవత్సరాలుగా నాచారంలో నివాసం ఉంటూ, అక్కడే గోల్కొండ మిషనరీస్‌లో మిషన్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కంపెనీకి సంబంధించిన మనీ లావాదేవీలను మల్లాపూర్‌లోని ఏస్‌బీఐ బ్యాంక్‌లో నిర్వహించేవారు.

09/11/2018 - 03:08

సూళ్లూరుపేట, సెప్టెంబర్ 10: తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. గూడూరు డీఎస్పీ రాంబాబు సోమవారం సూళ్లూరుపేట పోలీస్‌స్టేషన్‌లో విలేఖర్ల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

09/11/2018 - 02:10

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: మాదకద్రవ్యాల కేసును సుప్రీంకోర్టు ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది. మాదక ద్రవ్యాల నియంత్రణపై కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ప్రధాన న్యాయమూర్తి దీపక్‌మిశ్రాతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది.

09/11/2018 - 02:09

గాంధారి, సెప్టెంబర్ 10: అక్రమంగా కలపను రవాణా చేయడానికి స్మగ్లర్లు సిద్ధంగా ఉన్నారన్న సమాచారం అందుకొన్న అటవీ శాఖాధికారులు వారిని అడ్డుకోవడానికి యత్నించగా దుంగడగులు వారి వాహనంతో ఢీకొట్టే ప్రయత్నం చేసిన వైనమిది. అయతే, స్మగ్లర్ల దాడి నుంచి అధికారులు తృటిలో తప్పించుకొన్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని చద్మల్ తాండా శివారులో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

09/11/2018 - 02:00

న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసు విచారణను నిర్ణీత సమయంలోగా ఎలా పూర్తి చేస్తారో తెలియజేయాల్సిందిగా సుప్రీం కోర్టు సోమవారంనాడు సంబంధిత జిల్లా కోర్టు న్యాయమూర్తిని ఆదేశించింది. ఇందుకు సంబంధించి నివేదికను సీల్డ్ కవర్‌లో అందజేయాలని సూచించింది. ఈ కేసు విచారణను 2019 ఏప్రిల్ లోగా పూర్తి చేయాలని గతంలో సుప్రీం కోర్టు డెడ్‌లైన్ విధించింది.

09/11/2018 - 01:06

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్ దాఖలుచేస్తే సూత్రప్రాయంగా దాన్ని అవినీతి చర్యగా పరిగణిస్తామని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. అయితే ఈ రకమైన తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసే వ్యక్తులను పోటీకి అనర్హులుగా ప్రకటించేందుకు ఓ చట్టాన్ని తీసుకురావాలని పార్లమెంటును ఆదేశించేందుకు మాత్రం నిరాకరించింది.

09/11/2018 - 00:28

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి తమ పన్ను రీ అసెస్‌మెంట్ కోరుతూ ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ చేసిన విజ్ఞప్తులను ఢిల్లీ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. అలాగే రీ అసెస్‌మెంట్‌పై కాంగ్రెస్ నేత అస్కార్ ఫెర్నాండెజ్ వేసిన పిటిషన్‌ను సైతం బెంచ్ కొట్టివేసింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

09/11/2018 - 00:16

హైదరాబాద్, సెప్టెంబర్ 10: గోకుల్‌చాట్, లుంబినీ పార్కు జంట పేలుళ్ల కేసులో ఎన్‌ఐఏ కోర్టు సోమవారం నాడు తుది తీర్పును వెలువరించింది. ఇప్పటికే దోషులుగా ఖరారైన అనీఖ్ షఫీఖ్ సరుూద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలకు ఉరిశిక్ష విధించింది. ఒకొక్కరికీ చెరో 10వేల రూపాయిలు చొప్పున జరిమానా విధిస్తూ ఎన్‌ఐఏ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి శ్రీనివాసరావు తీర్పు వెలువరించారు.

09/10/2018 - 23:51

కోడూరు, సెప్టెంబర్ 10: మండల పరిధిలోని లింగారెడ్డిపాలెం గ్రామంలో ఆదివారం రాత్రి ఐదు దేవాలయాలలో హుండీలను పగులగొట్టి విధ్వంసం సృష్టించిన దొంగల ముఠాను త్వరలోనే పట్టుకుంటామని అవనిగడ్డ డీఎస్పీ పోతురాజు పేర్కొన్నారు. సోమవారం ఉదయం దేవాలయాల పరిసరాలలో హుండీలు చెల్లాచెదరుగా పడి ఉన్న దృశ్యాలను చూసిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.

09/10/2018 - 23:44

రామాపురం, సెప్టెంబర్ 10: కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిలోని రామాపురం మండలం నల్లగుట్టపల్లె పంచాయతీ బీసీ కాలనీ సమీపంలోని శివాలయం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్థుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి..

Pages