S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

09/01/2018 - 00:51

గచ్చిబౌలి: ఏసీబీ వలలో చిన్న చేప పడింది. ట్రాన్స్‌కోలో ఏ పని జరగాలన్న అటెండర్ నుంచి అధికారుల వరకు చేతులు తడపాల్సిన పరిస్థతి నెలకొంది. నగరం, శివారు ప్రాంతాల్లోని ట్రాన్స్‌కో విభాగంలో పోస్టింగ్ కావాలంటే భారీ స్థాయి డబ్బులే చెల్లించడంతో పాటు పైరవీ చేయాల్సిందే.

09/01/2018 - 00:48

వనస్థలిపురం, ఆగస్టు 31: వైన్ షాపుల ముందు పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను దొంగిలించి తప్పించుకొని తిరుగుతున్న ఐదుగురు ముఠా సభ్యులను కుషాయిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రూ.22 లక్షల విలువైన 47 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఎల్బీ నగర్‌లోని రాచకొండ సీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు.

09/01/2018 - 00:42

సారంగాపూర్, ఆగస్టు 31: అందం గా ముస్తాబు చేసిన పెళ్లిపందిరి..మరి కాసేపట్లో వివాహం జరగాల్సిన తరుణం. వేడుకల్లో పాల్గొనేందుకు తరలివచ్చిన బంధువులు..ఇంతలోనే పెళ్లింట కలకలం రేగింది. వరుడు అరెస్టు అయ్యాడన్న సమాచారంతో వధువు ఇంట పెనువిషాధం నిండింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

09/01/2018 - 00:33

జిన్నారం, ఆగస్టు 31: అర్ధ్రరాత్రి సమయంలో నగల షాపుకు కన్నంకొట్టి భారీగా వెండి, బంగారం దోచుకెళ్ళిన ఘటన మండలంలోని బొల్లారంలో చోటు చేసుకుంది. స్ధానికుల కధనం ప్రకారం బొల్లారంలో గత 20 సంవత్సరాలుగా నకోడా నగల వ్యా పారం పేరుతో సంజయ్ అనేవ్యక్తి వా యపారాన్ని నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి వ్యాపారాన్ని ముగించుకొని షాపుకు తాళ్ళం వేసి వెళ్ళాడు.

09/01/2018 - 00:12

జగ్గయ్యపేట, ఆగస్టు 31: పట్టణంలో భార్యాభర్తలు సంతానం కలగలేదని చుట్టుపక్కలవారి సూటిపోటు మాటలతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం జరిగింది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్టీల్ ప్లాంట్‌లో ఏపీఎస్‌పీఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేసే ప్రసాద్ (41), భార్య లక్ష్మీసరస్వతి శుక్రవారం ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

09/01/2018 - 00:12

మచిలీపట్నం, ఆగస్టు 31: జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్ జిల్లా దొంగల ముఠాకు చెందిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నిందితులను శుక్రవారం స్థానిక తాలుకా పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో అడిషనల్ ఎస్పీ సోమంచి సాయికృష్ణ మీడియా ముందు హాజరుపర్చారు.

08/31/2018 - 23:48

పిసిపల్లి, ఆగస్టు 31: మండలంలోని వివిధ ప్రదేశాల్లో నిర్వహించిన తనిఖీల్లో డ్రంక్ డ్రైవ్ కేసులో 12 మందిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరుచగా శుక్రవారం మూడు రోజులు జైలుశిక్ష విధించినట్లు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన శిక్షలు తప్పవన్నారు.

08/31/2018 - 23:34

దాచేపల్లి, ఆగస్టు 31: దాచేపల్లిలో రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్న మందపాటి నరసింహారావును అరెస్ట్‌చేసి అతని వద్ద నుండి భారిగా రు.4.90,000లు, ఆరు బియ్యం బస్తాలు, స్విఫ్ట్ డిజైర్ కారుని స్వాధీనం చేసుకున్నట్లు దాచేపల్లి ఎస్‌ఐ మహ్మద్ రఫీ శుక్రవారం తెలిపారు.

08/31/2018 - 23:04

లేపాక్షి, ఆగస్టు 31 : గుంటూరు సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మండల పరిధిలోని గొంగటిపల్లి గ్రామానికి చెందిన నరసింహప్ప (35) మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నరసింహప్ప తన లారీలో గుంటూరుకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో గురువారం తెల్లవారుఝామున రోడ్డు పక్కన తన లారీని ఆపి రోడ్డు అవతలి వైపునకు టీ తాగేందుకు వెళ్తున్న సమయంలో మరో వాహనం ఢీ కొంది.

08/31/2018 - 23:03

గుంతకల్లు, ఆగస్టు 31 : పట్టణంలోని కసాపురం రోడ్డు వంతెన సమీపంలో ఉన్న దుర్గమ్మ ఆలయం వద్ద రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు జేఆర్పీ పోలీసులు తెలిపారు. ఆమె వయస్సు 38 సంవత్సరాలు ఉండి, ఎర్రని చీర ధరించిందని తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Pages