S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

08/08/2018 - 00:02

జగ్గయ్యపేట రూరల్, ఆగస్టు 7: విజయవాడ - హైదరాబాదు 65వ నెంబరు జాతీయ రహదారిపై కృష్ణా జిల్లా సరిహద్దు రవాణా చెక్‌పోస్టు వద్ద సోమవారం అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో మూడు బస్సులు, ఒక కారు ఒకదానికొకటి ఢీకొన్న ప్రమాద సంఘటనలో ఒకరు మృతి చెందగా 27 మందికి గాయాలయ్యాయి.

08/07/2018 - 22:37

దేవరకొండ, ఆగస్టు 7: ఫోన్‌లో అసభ్యకరమైన మెసేజ్‌లు పెడుతూ మహిళలను వేధించడమే గాక డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కునుమళ్ళ శ్రీనివాస్ అనే ఆకతాయని దేవరకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆకతాయ శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి మంగళవారం కోర్టులో రిమాండ్ చేసినట్లు దేవరకొండ సీఐ ఎంజీఎస్ రామకృష్ణ చెప్పారు.

08/07/2018 - 05:07

మచిలీపట్నం (లీగల్), ఆగస్టు 6: ఇటీవల జిల్లా బహిష్కరణకు గురైన రౌడీషీటర్ మాదివాడ శివ శంకరరావు అలియాస్ శంకర్‌కు హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష, రూ.5వేలు జరిమానా విధిస్తూ 6వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి టి మల్లిఖార్జునరావు సోమవారం తీర్పు చెప్పారు. 2012 నవంబర్ 27వతేదీన మచిలీపట్నం నవకళా సెంటరులో శక్తిగుడి సెంటరుకు చెందిన వడ్డీ వ్యాపారి గంధం వెంకటేశ్వరరావు దారుణ హత్యకు గురయ్యాడు.

08/07/2018 - 03:47

హైదరాబాద్, ఆగస్టు 6; తనపై తీవ్రమైన ఆరోపణలు చేసిన కొమురెల్లి విజయలక్ష్మీ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ప్రభుత్వ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి సోమవారం బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనను శారీరకంగా వాడుకుని వదిలేశాడని విజయలక్ష్మీ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే.

08/07/2018 - 03:36

న్యూఢిల్లీ, ఆగస్టు 6: కేరళ చర్చి లైంగిక కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు మత గురువులకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఓ వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడిన అభియోగాలను ఈ ఇద్దరు నిందితులు ఎదుర్కొంటున్నారు. వీరు తప్పనిసరిగా ఈ నెల 13లోగా పోలీసులకు లొంగిపోవాలని జస్టిస్ సిక్రి, అశోక్ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.

08/07/2018 - 03:30

న్యూఢిల్లీ, ఆగస్టు 6: జమ్మూకాశ్మీర్ ప్రజలకు కొన్ని ప్రత్యేక హక్కులు కల్పిస్తూ అమలవుతున్న ఆర్టికల్ 35-ఎ రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్‌విల్కర్, డివై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం విచారిస్తోంది.

08/07/2018 - 03:10

డియోరియా, లక్నో, ఆగస్టు 6: బిహార్‌లోని ముజఫర్ సంఘటన మరువక ముందే అలాంటి సంఘటనే ఈసారి యూపీలో వెలుగులోకి వచ్చింది. ఆశ్రమంలోని 24 మంది బాలికలపై నిర్వాహకులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ ఆశ్రమంపై అధికారులు దాడులు నిర్వహించారు.

08/07/2018 - 02:42

అనకాపల్లిటౌన్, కశింకోట, ఆగస్టు 6: ఉదయానే్న టౌన్‌కెళ్లి పనులు ముగించుకుని వద్దామనుకున్న ఆ ఇద్దర్నీ ఆర్టీసీ బస్సు మృత్యువై కబళించింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...

08/07/2018 - 02:39

నక్కపల్లి, ఆగస్టు 6: జాతీయ రహదారిపై ఆగిఉన్న ట్రాలీని కారు ఢీకొన్న ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం చెందారు. విశాఖ జిల్లా నక్కపల్లి మండలం న్యాయంపూడి జంక్షన్ వద్ద సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో విశాఖపట్నానికి చెందిన భార్యాభర్తలు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో వారి రెండేళ్ల కుమారుడు, స్నేహితులు కూడా తీవ్రంగా గాయపడ్డారు.

08/07/2018 - 01:36

వరంగల్ క్రైం: ఓ కుమారుడి ఆగ్రహం ముగ్గురి సజీవ దహనానికి కారణమైంది. వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం కంఠాత్మకూర్ గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. పరాయి స్ర్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం ఓ తండ్రి ప్రాణాల మీదికి తెచ్చింది. తండ్రి తన తల్లిని, చెల్లిని, తనను పట్టించుకోవడం లేదని కొడుకు కొంతకాలంగా పగతో రగిలిపోయాడు.

Pages