S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

08/12/2018 - 03:50

హైదరాబాద్, ఆగస్టు 11: లాజిస్టిక్ సెగ్మంట్‌లో మార్కెట్‌లీడర్‌గా షాడోఫాక్స్ ఆవిర్భవించిందని సంస్థ సీఈఓ అభిషేక్ బన్సాల్ తెలిపారు. రానున్న ఐదేళ్లలో సంస్థ 150 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఈ క్రమంలోనే 22 మిలియన్ల పెట్టుబడులను ఆకర్షించినట్టు ఆయన తెలిపారు.

08/12/2018 - 03:30

మర్రిగూడ, ఆగస్టు 11: ప్రేమించి పెళ్లి చేసుకున్న మోర హన్మంతు తన భార్య ప్రియాంకను పథకం ప్రకారమే దారుణంగా హత్చ చేసి నల్లగొండ జిల్లాలోని రాంరెడ్డిపల్లి గ్రామ శివారులోగల కుమ్మరోళ్లబావిగా పిలువబడే పాడుబడిన బావిలో అర్ధరాత్రి సమయంలో ప్రియాంక శవాన్ని పడవేశాడు. నార్కట్‌పల్లి మండలం మాండ్ర గ్రామానికి చెందిన లింగమ్మ అలియాస్ ప్రియాంక మృతదేహానికి సంబంధించిన ఎముకలను శనివారం పోలీసులు బావిలో నుండి వెలికితీశారు.

08/12/2018 - 00:37

న్యూఢిల్లీ, ఆగస్టు 11: ఏడాది వంద కార్లు అపహరించడం అతని టార్గెట్. అది కూడా మామాలు కార్లు కాదండోయ్.. లగ్జరీ కార్లే. అతని కన్ను ఏ లగ్జరీ కారుపై పడినా అది క్షణాల్లో మాయమవుతుంది. ఇలా గత ఐదేళ్ల అతను దొంగిలించిన లగ్జరీ కార్లు 500 వరకు ఉన్నాయి. కార్లను దొంగిలించిన తర్వాత దేశంలోని వేర్వేరు ప్రదేశాల్లో మారుపేర్లతో విక్రయించడం అతని హాబీ. తరచూ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు విమానంలోనే రాకపోకలు సాగిస్తుంటాడు.

08/12/2018 - 01:32

హైదరాబాద్: పెనమలూరు పోలీసులు తాను చేసిన ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని, కోర్టు ద్వారా కేసులు నమోదు చేయాలని వైసీపీ నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే రోజా శనివారం హైకోర్టును ఆశ్రయించారు.

08/11/2018 - 05:51

వినుకొండ, ఆగస్టు 10: పథకం ప్రకారం వైసీపీవారు ముగ్గురిని హతమార్చడం దుర్మార్గమైన చర్య అని సాంఘిక సంక్షేమ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. శుక్రవారం మంత్రి ఆనందబాబు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ఉన్న గురజాల సోమయ్య, చల్లా వెంకట కృష్ణ, మేడబోయిన మల్లికార్జునరావు మృతదేహాలను సందర్శించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

08/11/2018 - 04:19

మర్రిగూడ, ఆగస్టు 10: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను భర్త కిరాతకంగా హత్య చేసి బావిలో పడేశాడో భర్త. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని కుదాభక్షిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని వెంకేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

08/11/2018 - 02:55

చిత్తూరు, ఆగస్టు 10: ఎక్సైజ్ శాఖలో విధులు నిర్వహిస్తూ అక్రమ మార్గాల్లో కోట్లాది రూపాయలు గడించిన ఎస్సై ఇంటిపై శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు రూ.20కోట్ల రూపాయలు అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. చిత్తూరు నగరంలో జరిగిన ఈ దాడులు కలకలం సృష్టించాయి. చిత్తూరు నగరానికి చెందిన విజయకుమార్ కర్నూలు జిల్లాలో ఎక్సైజ్‌శాఖలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాడు.

08/11/2018 - 02:29

హైదరాబాద్, ఆగస్టు 10: మారు పేర్లతో పరిచయాలు చేసుకుంటూ అమాయకులతో పాటు చదువుకున్న యువకులు, వ్యాపారస్థులను బురిడీ కొట్టిస్తున్న మోసగాడు సిద్దిక్వి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. విదేశీ కరెన్సీని బదిలీ చేయడానికి పర్సెంటేజ్‌లను తీసుకుంటూ దందాలు చేయడాన్ని పోలీసుల దృష్టికి వచ్చింది. శుక్రవారం సైబరాబాద్ పోలీసులు సిద్దిక్విని అరెస్టు చేశారు.

08/11/2018 - 02:05

శేరిలింగంపల్లి, ఆగస్టు 10: ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎం కేంద్రంలో భారీ చోరీ జరిగింది. తారానగర్ ఏటీఎం సెంటర్‌లోని రెండు మెషిన్‌లను గ్యాస్ కట్టర్‌ల సహాయంతో తొలగించారు. రూ.13 లక్షలను దోచుకుని షట్టర్ దింపేసి దొంగలు ఉడాయించారు. మాదాపూర్ జోన్ డీసీపీ వెంకటేశ్వర రావు, క్రైం డీసీపీ జానకీ షర్మిల, మియాపూర్ ఏసీపీ సంక్రాంతి రవికుమార్ పరిశీలించారు.

08/11/2018 - 01:56

న్యూఢిల్లీ, ఆగస్టు 10: నిరసన ప్రదర్శనల్లో చోటు చేసుకుంటున్న హింసాత్మక సంఘటనలపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. చట్ట సవరణ చేసే వరకూ అనర్థాలను చూస్తూ ఊరుకోబోమని కేంద్రానికి స్పష్టం చేసింది. తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

Pages