S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

08/10/2018 - 01:11

న్యూఢిల్లీ, ఆగస్టు 9: రాజకీయాధికారం, వ్యవస్థల్లోకి, ఎన్నికల రాజకీయాల్లో నేరగాళ్లు ప్రవేశించకుండా ఉండేందుకు కఠిన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని, కాని ఈ చట్టాలను రూపొందించే బాధ్యత పార్లమెంటుపై ఉందని, ఈ విషయమై తాము ఎటువంటి వ్యాఖ్యలు చేయమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

08/09/2018 - 23:49

సూర్యాపేట, ఆగస్టు 9: రాష్టవ్య్రాప్తంగా సంచలనం రేపిన సూర్యాపేట కలెక్టరేట్ నిర్మాణ స్థల వివాదానికి తెరపడింది. ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నా కొందరు వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చేందుకే ప్రైవేట్ స్థలంలో కలెక్టరేట్ భవన నిర్మాణం చేపడుతున్నారన్న ఆరోపణలతో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ విపక్ష కాంగ్రెస్ నేతలు వేసిన పిటిషన్‌ను గురువారం హై కోర్టు కొట్టివేసింది.

08/09/2018 - 23:46

గోదావరిఖని, ఆగస్టు 9: సింగరేణి కోల్‌బెల్ట్ ఏరియాలో రోజు రోజుకు రౌడియిజం మితిమీరిపోతోంది. అనతి కాలంలోనే హత్యలు... అరాచకాలు పెరిగిపోతుండటంతో ఇక్కడ అలజడి మళ్లీ మొదలయ్యింది. నేర సంచనాలకు నిలయమైన గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం కావడం లేదన్న విమర్శలు తరుచూ జరిగే సంఘటనలను బట్టి చూస్తే రుజువవుతున్నాయి.

08/09/2018 - 23:22

మిడుతూరు, ఆగస్టు 9:మండల పరిధిలోని వీపనగండ్ల గ్రామానికి చెందిన రైతు సోలమన్‌రాజు(35) గురువారం విద్యుదాఘాతంతో మృతిచెందాడు. వివరాలు.. సోలమన్‌రాజు తనకున్న 2 ఎకరాల పొలంలో మొక్కజొన్న, కొంత పొగాకు నారు సాగు చేశాడు. పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన సోలమన్‌రాజు ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఫీజు పోవడంతో దానిని సరి చేసేందుకు ట్రాన్స్‌ఫార్మర్ దగ్గరకు వెళ్లాడు.

08/09/2018 - 22:42

ధర్మవరం, ఆగస్టు 9 : అప్పులబాధ తాళలేక పట్టణంలోని రామ్‌నగర్‌కు చెందిన చేనేత కార్మికులు నాగోజీ (32) గురువారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు నాగోజి కూలిమగ్గం నేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. అయితే నాలుగేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతూ విధిలేక ఆరోగ్యం క్షీణించినా మగ్గం నేస్తూ కుటుంబ పోషణకు అప్పులు చేశాడు.

08/09/2018 - 06:11

ముసునూరు, ఆగస్టు 8: వయోభారం ఒకవైపు... మరోపక్క భార్యకు మానసికస్థితి సరిగా లేకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి బలవన్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముసునూరుకు చెందిన కొమ్మన రామదాసు (90) ఆయన భార్య అచ్చిమాంబ (80) వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు విశాఖపట్నంలో ఉద్యోగం నిమిత్తం స్థిరపడగా కూతురు వివాహం చేసుకుని భర్తతో జీవిస్తోంది.

08/08/2018 - 04:27

గజ్వేల్, ఆగస్టు 7: నిందితులు చాకచక్యంగా వ్యవహరించి సినీ ఫక్కీలో చోరీకి పాల్పడగా, పోలీసులు తమదైన శైలిలో 24 గంటల్లో చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడంతోపాటు దొంగలను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా గౌరారం సీఐ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ అందించిన వివరాలిలా ఉన్నాయి.

08/08/2018 - 04:24

చిలకలూరిపేట, ఆగస్టు 7: చిలకలూరిపేట పట్టణంలోని ఓల్డ్‌బ్యారెన్ నగర్‌లో ఉన్న కలప షాపులు మంగళవారం దగ్ధమయ్యాయి. చిలకలూరిపేట పట్టణ సిఐ సురేష్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం... ఓల్డ్‌బ్యారెన్ నగర్‌లోని కలప షాపుల్లో ఒక్కసారిగా మంటలు వచ్చాయని, రోడ్డుపై ఉన్న కలప దుంగలకు, షెడ్లకు మంటలు వ్యాప్తిచెందాయి. సమీప ప్రాంతంలో ఎవరూ లేకపోయే సరికి పక్కనున్న షాపులకు మంటలు వ్యాపించాయి.

08/08/2018 - 04:20

కేతేపల్లి, ఆగస్టు 7: కుటుంబ కలహాలతో భార్య, కాళ్లు చేతులు నరికి భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం తుంగతుర్తి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జటంగి శ్రీను (33)కు సూర్యాపేట మండలం కేసారం గ్రామానికి చెందిన రజితతో 13 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

08/08/2018 - 03:56

హైదరాబాద్, ఆగస్టు 7: హైదరాబాద్ నడిబొడ్డున లుంబినీ పార్కు, గోకుల్‌చాట్‌లో జరిగిన బాంబు పేలుళ్ల సంఘటనపై నిందితులకు ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు శిక్షలను ఖరారు చేయనుంది. 2007 ఆగస్టు 25వ తేదీన జంట పేలుళ్లు సంభవించాయి. ఈ సంఘటనకు సంబంధించిన అంశాలను ఈ నెల 12వ తేదీన ఎన్‌ఐఏ పూర్తి నివేదికను ప్రత్యేక కోర్టుకు అందివ్వనున్నది. ఈనెల 27వ తేదీన ప్రత్యేక కోర్టు తీర్పును ప్రకటించనుంది.

Pages