S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/19/2018 - 23:19

తాడిపత్రి, జూలై 19: స్థానిక పెన్నా నది వంతెనపై గురువారం ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొని శివశంకరరెడ్డి(35) మృతి చెందాడు. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం బెలుం గ్రామానికి చెందిన శివశంకర్‌రెడ్డి ద్విచక్ర వాహనంలో తాడిపత్రికి వస్తుండగా పెన్నా వంతెనపై నాపరాయి లోడుతో ఆగి వున్న ట్రాక్టర్‌ను వెనుకవైపు ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలైనాడు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికత్స పొందుతూ మృతి చెందాడు.

07/19/2018 - 23:11

వరంగల్ క్రైం, జూలై 19: నగరంలో మహిళలు, యువతులపై వేదింపులకు పాల్పడుతున్న ఏడుగురు పోకిరీలను షీటీమ్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. హన్మకొండ కిషన్‌పుర, పోచమ్మ మైదాన్, పబ్లిక్ గార్డెన్ తదితర ప్రాంతాల్లో యువతులు, మహిళలను వేదిస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. దీంతో షీటీ మ్స్ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసారు.

07/19/2018 - 23:10

వరంగల్ క్రైం, జూలై 19: బీదర్ నుండి వరంగల్ పోలీసు కమిషనరేట్, భూపాలపల్లి, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ జిల్లాల్లో గుట్కా సరఫరా చేస్తున్న నలుగురిని టాస్క్‌పోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారినుండి 27.74.000లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

07/19/2018 - 23:01

ముకరంపుర కరీంనగర్, జూలై 19: ఆదిలాబాద్ ట్రాఫిక్ సీఐ దాసరి భూ మయ్య రూ.10 లక్షల నగదుతో హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్‌పై ఏసీబీకి పట్టుబడటం కరీంనగర్‌లో కలకలం రేపింది. నగదుకు సంబంధించి సీఐ స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడంతో అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు ఏకకాలంలో 8 చోట్ల తనిఖీలు నిర్వహించారు.

07/19/2018 - 23:01

మానకొండూర్, జూలై 19: మానకొండూర్ మండల పరిధిలోని వన్నా రం గ్రామ సర్పంచ్ బాకరాపు శ్రీనివాస్‌యాదవ్‌పై దాడి చేసిన సంఘటనలో ఏడుగురిపై కేసు నమోదు చేసిన్నట్లు సీఐ బిల్లా కోటేశ్వర్ గురువారం తెలిపారు.

07/19/2018 - 22:53

కోవూరు, జూలై 19: కట్న పిశాచి కోరలకు చిక్కి మరో అబల బలైన సంఘటన కోవూరులో బుధవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సీతారామపురం మండలం మారెంరెడ్డి పల్లె గ్రామానికి చెందిన కల్లూరి జనార్దన్ పెద్ద కుమార్తె తేజ (20)కు కడప జిల్లా పోరుమామిళ్లకు చెందిన వ్యవసాయం చేసుకునే పోకల రాజశేఖర్‌రెడ్డికి 2017లో జూన్ నెలలో వివాహం జరిగింది.

07/19/2018 - 22:51

కోట, జూలై 19: కోట మండలం విద్యానగర్ సమీపంలో లారీ, మోటార్‌బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఒక విద్యార్థి మృతిచెందగా, మరో విద్యార్థి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. వివరాలిలా ఉన్నాయి.

07/19/2018 - 22:43

చింతలపూడి, జూలై 19: ఈ మధ్యకాలంలో ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్‌లు వేదికగా రాజకీయ దుమారాలు రేపుతుండటం అందరికీ తెలిసిందే. కానీ అది శృతిమించి అసభ్య పదాలతో ఎదుటివారిమీద దాడి చేయడం జరుగుతుంది. ఇటీవల సుప్రీంకోర్టు ఎన్ని ఆదేశాలు జారీ చేసినప్పటికీ సోషల్ వార్ అనేది నియంత్రించలేకపోతున్నారు.

07/19/2018 - 22:36

రైల్వేకోడూరు, జూలై 19: రైల్వేకోడూరు సర్కిల్ పరిధిలోని జి.వెంకటరామాపురం గ్రామానికి చెందిన తోట వెంకటరమణ, నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన విజయకుమార్‌లకు అనే ముద్దాయిలకు జీవిత ఖైదు శిక్షను రాజంపేట కోర్టు జడ్జి సత్యవతి విధించినట్లు సీఐ సాయినాథ్ గురువారం తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు తన సిబ్బంది సహకారంతో ఈ కేసును చేధించినట్లు ఆయన చెప్పారు.

07/19/2018 - 22:36

రైల్వేకోడూరు, జూలై 19: మండలంలోని బాలుపల్లె సమీపంలోని శేషాచలం అడవులలో గురువారం 8 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ఫోర్స్ అధికారి సత్యనారాయణ తెలిపారు. తమ సిబ్బంది కూంబింగ్ నిర్వహిస్తుండగా తమిళ కూలీలు ఎర్రచందనం దుంగలను మోసుకెళ్లడం చూశామని, తమను చూసి వారు దుంగలను, గొడ్డళ్లను వదలేసి పారి పోయారన్నారు. 8 దుంగల విలువ సుమారు రూ. 2 లక్షల మేరకు ఉంటుందన్నారు.

Pages