S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

08/05/2018 - 00:06

తిమ్మాపూర్, ఆగస్టు 4: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కడతేర్చాలని చూసాడు ఓ కసాయి భర్త. అందుకు నేపాల్ నుంచి నాటు తుపాకీ తీసు కువచ్చాడు. ఆ తుపాకీతో భార్యను కాల్చిన సంఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణకాలనీలో గల బుడిగ జంగాల కాలనీలో చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

08/04/2018 - 23:59

ఆదిలాబాద్, ఆగస్టు 4: జిల్లాలోని నేరడిగొండ మండల కేంద్రంలోని జాతీయ రహదారి పక్కనే ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో యధేచ్ఛగా కల్తీ మద్యం తయారీ చేస్తూ మహారాష్టత్రో పాటు ఉమ్మడి జిల్లాల్లో అక్రమ మద్యం దందా కొనసాగిస్తున్న ముఠా రాకెట్‌ను పోలీసులు గుట్టురట్టు చేశారు. పోలీసుల దాడిలో ప్రాణహానికి దోహదంచేసే విష పూరిత రసాయనాలు, ప్రభుత్వం నిషేదించిన దేశీదారు మద్యం నిల్వలు పట్టుబడ్డాయి.

08/04/2018 - 23:56

బెల్లంపల్లి, ఆగస్టు 4: పట్టణంలోని మంచిర్యాల చందా జాతీయ రహదారి కాల్ టెక్స్ ఏరియాలో శనివారం తెల్లవారుజామున టాస్క్ఫోర్సు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 50క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీన పరుచుకున్నారు.

08/04/2018 - 23:56

బోథ్ రూరల్, ఆగస్టు 4: మండలంలోని మందబొగడ గ్రామానికి చెందిన యువ రైతు సెడ్మకి మారుతి(33) శనివారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మారుతి తనకు ఉన్న రెండెకరాల వ్యవసాయ భూమిలో పత్తి పంట సాగు చేస్తున్నాడు.

08/04/2018 - 23:37

కొండమల్లేపల్లి, ఆగస్టు 4: దొంగతనం కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి శనివారం కోర్టులో రిమాండ్ చేసినట్లు కొండమల్లేపల్లి ఎస్ ఐ శంకర్‌రెడ్డి తెలిపారు. ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేసిన నిందితులను మీడియా ఎదుట హాజరుపర్చి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

08/04/2018 - 23:06

బనగానపల్లె, ఆగస్టు 4:బనగానపల్లె పోలీస్ స్టేషన్ పరిధిలోని యనకండ్ల గ్రామానికి చెందిన బాషా(7) గత ఏపిల్ 25వ తేదీ విద్యుదాఘాతంతో మృతి చెందగా గ్రామానికి చెందిన గోపాల్ ఫిర్యాదు మేరకు తాము శనివారం పూడ్చిపెట్టిన శవానికి పోస్టుమార్టం చేయించినట్లు సీఐ సురేష్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గ్రామస్థుడు ఫిర్యాదు చేయడంతో తాము తహశీల్దార్ శివరామిరెడ్డి, డా.

08/04/2018 - 22:47

నరసన్నపేట,ఆగస్టు 4: మండలంలోని నారాయణవలస గ్రామం వద్ద వాహనం అదుపుతప్పి ఒకరు దుర్మరణపాలైన సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కోటబొమ్మాళిమండలం పెద్దబమ్మిడి గ్రామానికి చెందిన ముద్దాడ సింహాచలం(50)క్రిమిసంహారక మందుల కంపెనీలో సేల్స్ రిప్రజెంటివ్‌గా పనిచేస్తున్నాడు.

08/04/2018 - 22:41

లక్కవరపుకోట, ఆగస్టు 4: మండలంలోని గంగుపూడి వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఆధిత్య కింతం నారాయణాచార్య(40) అనే వ్యక్తి మృతి చెందాడు.

08/04/2018 - 22:38

పాచిపెంట, ఆగస్టు 4: ట్రాలీ ఢీకొని ఓ యువతి మృతిచెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని పి కోనవలస చెక్‌పోస్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిషా రాష్ట్రం కొరాపుట్ జిల్లా నారిగాం గ్రామానికి చెందిన చిట్టి ఆశా(26) శుక్రవారం రాత్రి మృతిచెందినట్లు ఎస్‌ఐ సన్యాసినాయుడు తెలిపారు.

08/04/2018 - 00:29

హైదరాబాద్, ఆగస్టు 3: సికింద్రాబాద్ లాల్‌గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సట్టా బెట్టింగ్ రాకెట్‌ను టాస్క్ఫుర్స్ పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో నిందితులు దొరికిపోయారు. దాడుల్లో 12 మందిని అరెస్టు చేశారు. సట్టా బెట్టింగ్‌ను శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు టాస్క్ఫుర్స్ అడిషనల్ కమిషనర్ రాధాకృష్ణా రావు తెలిపారు.
బొమ్మల దిలీప్ కుమార్ అరెస్టు

Pages