S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/30/2018 - 23:20

తడ, జూలై 30: ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు గ్రామమైన ఆరంబాకం వద్ద సోమవారం జరిగిన రోడ్డుప్రమాదంలో తమిళనాడుకు చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. తమిళనాడు పోలీసుల సమాచారం మేరకు తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సత్యమంగళంకు చెందిన శరవణకుమార్ (28), చెన్నై ఆవడికి చెందిన పెరుమాళ్ (24) అనే యువకులు చెన్నైలోని లామినర్ టెక్నికల్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థలో టెక్నీషియన్లుగా పని చేస్తున్నారు.

07/30/2018 - 23:16

తిరుపతి, జూలై 30: పేరూరులోని రాజవారి వీధిలో ఇంటి ప్రహరీగోడ నిర్మాణ విషయంలో ఇరు కుటుంబాల మధ్య వివాదం చెలరేగి ఒక మహిళపై కత్తితో దాడి చేసిన సంఘటన సోమవారం ఉదయం 7గంటలకు జరిగింది. ఘర్షణకు పాల్పడ్డ వారంతా సమీప బంధువులే. బాధితురాలి కుమారుడు గోపి ఓ ప్రైవేట్ మెడికల్ సంస్థలో ఏరియా మేనేజర్‌గా పనిచేస్తూ తన తండ్రి సత్యనారాయణ రాజు, తల్లి ప్రమీలమ్మతో కలిసి పేరూరు రాజవారి వీధిలో నివాసం ఉంటున్నాడు.

07/30/2018 - 22:42

గంగవరం./గోకవరం, జూలై 30: ఇంటిలో చదువుకోమంటున్నారని మనస్తాపానికి గురైన పదోతరగతి విద్యార్థిని సూరంపాలెం జలాశయంలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీనికి సంబంధించిన వివరాలు గంగవరం ఎస్సై రామలింగేశ్వరరావు తెలిపారు. గోకవరం మండలానికి చెందిన చందనాల పూజిత (16) అనే బాలిక కామరాజుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతోంది.

07/30/2018 - 22:32

నల్లగొండ రూరల్, జూలై 30: నల్లగొండ మున్సిపాల్టీలోని 21వ వార్డు కౌన్సిలర్ మహ్మద్ షాహీన్ భర్త టకీ మున్సిపల్ కార్యాలయం ముందు సోమవారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనం రేపింది. తన భార్య ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డు అభివృద్ధికి మున్సిపల్ చైర్‌పర్సన్, అధికారులు నిధుల విడుదలలో వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు.

07/30/2018 - 22:30

నల్లగొండ రూరల్, జూలై 30: నల్లగొండ పట్టణంలోని రామగిరి సెంటర్‌లో ఉన్న ఎస్టీ బాలుర హాస్టల్ భవనంపై నుండి దూకి విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సోమవారం కలకలం రేపింది. తిరుమలగిరిసాగర్ మండలం ఎల్లాపురం గ్రామానికి చెందిన ధరావత్ రంగ (16) పట్టణంలోని ప్రతీక్‌రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు.

07/30/2018 - 22:29

దేవరకొండ, జూలై 30: టీవీ సెటప్‌బాక్స్‌కు విద్యుత్ సరఫరా కావడంతో విద్యుదాఘాతానికి గురై లకుమాళ్ళ యాదమ్మ (40) అనే మహిళ మృతి చెందిన సంఘటన సోమవారం రోజు చందంపేట మండలం గాగిళ్ళాపురం గ్రామంలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. చందంపేట మండలం గాగిళ్ళాపురం గ్రామానికి చెందిన యాదమ్మ సోమవారం రోజు టీవీ చూసేందుకు టీవీని అన్‌చేసింది.

07/30/2018 - 22:18

పెదనందిపాడు, జూలై 30: పెదనందిపాడు మండలం నాగులపాడులో ఈ నెల 14వ తేదీ జరిగిన దొంగతనం కేసులో నిందితుడు పట్టుబడ్డాడు. అట్లూరి మోహనరావు ఇంట్లో దొంగిలించిన 10 సవర్ల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు నగరంలోని ఏటి అగ్రహారంకు చెందిన నిందితుడు బండికట్ల రత్నరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి చోరీచేసిన బంగారాన్ని పట్టుకున్నారు.

07/30/2018 - 04:04

తిరుపతి, జూలై 29: తిరుమల కళ్యాణకట్టలో పనిచేస్తున్న విజయ్ అనే ఉద్యోగి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆదివారం ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. గత 35 రోజుల వ్యవధిలో ఆత్మహత్యకు పాల్పడిన వారి సంఖ్య విజయ్‌తో కలిపి నాలుగుకు చేరింది.

07/30/2018 - 04:02

మదనపల్లె, జూలై 29: చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలోని డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన సంఘటన నిమ్మనపల్లె మండలంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. నిమ్మనపల్లె ఎస్‌ఐ హరిహరప్రసాద్ కథనం ప్రకారం.. నిమ్మనపల్లె మండలానికి చెందిన విద్యార్థిని గ్రామం నుంచి ప్రతిరోజూ అందుబాటులో ఉన్న వాహనంలో మదనపల్లె కళాశాలకు వెళ్తోంది.

07/30/2018 - 03:17

ఆత్మకూరు, జూలై 29: అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం ఒడ్డుపల్లి గ్రామంలో శనివారం అర్ధరాత్రి 70 ఏళ్ల వయసున్న లక్ష్మమ్మపై అదే గ్రామానికి చెందిన పెద్దన్న(35) శనివారం అర్ధరాత్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. అందుకు సంబంధించిన వివరాలు ఒక రోజు ఆలస్యంగా వెలుగు చూశాయి. లక్ష్మమ్మ ఒడ్డుపల్లి ఎస్సీ కాలనీలో ఒంటరి జీవనం గడుపుతోంది. తనకంటూ ఎవరూ లేని స్థితిలో కాలం గడుపుతోంది.

Pages