S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

08/13/2018 - 23:30

తూప్రాన్, ఆగస్టు 13: నగరం నుండి ఇంకి వెళుతున్న ముగ్గురు యువకుల బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన తూప్రాన్ పట్టణ శివారులో 44వ నంబరు జాతీయ రహదారిపై సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. తూప్రాన్ మండలం చిన్న శివనూర్ గ్రామానికి చెందిన యువకులు రాజు, సంతోష్, సురేష్‌లు టీఎస్ 35-2668 నంబరు గల ఫల్సర్ వాహనంపై స్వగ్రామానికి వెళుతున్నారు.

08/13/2018 - 23:25

గద్వాల, ఆగస్టు 13: జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండల పరిధిలోని ఓబులోనిపల్లి గ్రామ సమీపంలో నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు చిన్నారులు 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు(పిల్లలకు పేర్లు పెట్టలేదు) మృత్యువాత పడిన సంఘటన సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఓబులోనిపల్లి గ్రామానికి చెందిన పెద్ద నర్సింహులు, చిన్న నర్సింహులు అన్నదమ్ములు. వీరికి గ్రామ సమీపంలో వ్యవసాయ పొలం ఉంది.

08/13/2018 - 23:22

కర్నూలు, ఆగస్టు 13:మహిళను వేధించిన కేసులో ఆత్మకూరు ఎస్‌ఐ వెంకటసుబ్బయ్యను సస్పెండ్ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాసులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. న్యాయం చేయాల్సిన రక్షణ అధికారి మహిళకు ఫోన్ చేసి లైంగికంగా వేధిస్తుండటంతో ఆధారాలతో సహా ఆమె ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీంతో సదరు ఎస్‌ఐను వీఆర్‌కు పంపుతూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.

08/13/2018 - 23:15

సంతమాగులూరు, ఆగస్టు 13: నడిరోడ్డుపై ఉన్న గొయ్యి వర్షపు నీటితో నిండి ఉండటంతో వేగంగా వస్తున్న ఆటో డ్రైవర్ గుంటను గమనించకుండా వేగంగా రావడంతో గుంటలో దిగిన ఆటో బోల్తా కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఇంజనీరింగ్ విదార్థి మృత్యువాత పడగా మరో వ్యక్తి తీవ్రగాయాలతో మృత్యువుతో పోరాడుతున్నాడు.

08/13/2018 - 23:14

మద్దిపాడు,ఆగస్టు 13: సుమారు పదిలక్షల రూపాయల విలువైన ఎర్రచందనం దుంగలను స్థానిక ఎస్‌ఐ పి సురేష్ తమ సిబ్బందితో పట్టుకున్న సంఘటన ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఒంగోలు డిఎస్‌పి బి శ్రీనివాసరావు సోమవారం విలేఖర్ల సమావేశాన్ని నిర్వహించి వివరాలను వెల్లడించారు.

08/13/2018 - 23:14

ఒంగోలు, ఆగస్టు 13: జిల్లాలో వివిధ చోరీలకు పాల్పడుతున్న బాలనేరస్తుడితోపాటు బాల నేరస్తుడి నుండి దొంగ సొత్తును స్వీకరించిన పులగాల అవినాష్ అనే వ్యక్తిని ఒంగోలు వన్‌టౌన్ పోలీసులు సోమవారం ఒంగోలోని సివియన్ రీడింగ్ రూం వద్ద అరెస్ట్ చేసినట్లు డిఎస్‌పి బి శ్రీనివాసరావు తెలిపారు.

08/13/2018 - 23:01

గుంటూరు (పట్నంబజారు), ఆగస్టు 13: గుంటూరు నగరంతో పాటు పలు ప్రాంతాల్లో దారిదోపిడీలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యులు గల దొంగలముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం ఈ మేరకు అర్బన్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఎస్‌పి విజయారావు నిందితుల వివరాలను తెలియజేశారు.

08/13/2018 - 22:59

తెనాలి, ఆగస్టు 13: రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా ప్రాణాపాయ స్థితిలో వైద్యశాలో భర్త చికిత్స పొందుతున్న సంఘటన తెనాలి రూరల్ మండలం కొలకలూరు గ్రామ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు, పోలీసుల కథనం ప్రకారం కొలకలూరు గ్రామానికి చెందిన కలకండ మాధవి ఓప్రైవేటు విద్యాసంస్థలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది.

08/13/2018 - 22:51

టేకులపల్లి, ఆగస్టు 13: పశువులను మేపడానికి వెళ్లిన కాపరి వాగులో జారిపడి కొట్టుకుపోయి మృతి చెందాడు. ఈ సంఘటన బోడు పోలీసు స్టేషన్ పరిధిలోని మొక్కంపాడులో సోమవారం జరిగింది. గ్రామస్థుల కథనం ప్రకారం మొక్కంపాడుకు చెందిన ఈసం సమ్మయ్య (48) మేత మేపడానికి తన ఆవులను ఇంటి నుండి తోలుకొని వెళ్లాడు. సమీపాన గల ధరంపురేవు వాగు (పెద్దవాగు) వైపు ఆవులు వెళ్తుండగా వాటిని అదిలించే క్రమంలో సమ్మయ్య జారిపడిపోయాడు.

08/13/2018 - 22:22

మిర్యాలగూడ టౌన్, ఆగస్టు 13: కల్యాణలక్ష్మి పధకం కింద అనుమానాస్పద పద్దతిలో దరఖాస్తుతో పాటు సర్ట్ఫికెట్లు సమర్పించిన త్రిపురారం మండలం బొర్రాయిపాలెం గ్రామానికి చెందిన వధువు నిమ్మల మమత తల్లి నిమ్మల లక్ష్మివి నకిలీవని తేలడంతో ఆమెపై క్రిమినల్ కేసు పెట్టాలని మండల తహసీల్దార్‌కు ఆదేశించినట్టు స్థానిక ఆర్డీఓ జగన్నాధరావు తెలిపారు.

Pages