S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

05/22/2018 - 00:21

రాజాం, మే 21: రాజాం మండలం కొఠారిపురం గ్రామానికి చెందిన కంతలి సురేష్ (17) అనే విద్యార్థి తిరుమల దేవాలయం క్యూ లైన్‌లో అదృశ్యమయ్యాడు. వివరాల్లోకి వెళితే ఇటీవల పదో తరగతి పరీక్ష ఉత్తీర్ణుడైన సురేష్ మొక్కు చెల్లించుకొనేందుకు తమ బంధువులు నరసింహులు, చినమ్మడుతో తిరుపతి వెళ్లారు.

05/22/2018 - 00:15

చీరాల టౌన్, మే 21: ఇంటర్ పూర్తి చేసుకుని ఉన్నత విద్యనభ్యసించి చేతికి అందివస్తాడనుకున్న కుమారుడు అర్ధాంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించసాగారు. ఈ సంఘటన మండలంలోని వాడరేవు-రామాపురం రోడ్డులోని ఓ అతిథి గృహం వద్ద చోటుచేసుకుంది.

05/22/2018 - 00:15

ఒంగోలు, మే 21 : మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై జిల్లా పోలీస్ యంత్రాంగం కొరఢా ఝులిపించింది. అందులో భాగంగా జిల్లావ్యాప్తంగా పోలీసులు మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. జిల్లాలో మొదటిసారిగా 138 మందిని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకే రోజు పోలీసులు జైలుకు పంపారు.

05/22/2018 - 00:12

కర్నూలు ఓల్డ్‌సిటీ, మే 21:చెల్లని చెక్కు ఇచ్చిన కేసులో చెన్నైకి చెందిన ఎల్.శ్రీనివాసన్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ మొబైల్ కోర్టు మేజిస్ట్రేట్ ఎంవీఎన్.పద్మజ సోమవారం తీర్పు చెప్పారు. మైనింగ్ వ్యాపార లావాదేవీల్లో భాగంగా కర్నూలు నగరానికి చెందిన ఎస్‌ఎ మినరల్ అధినేత ఎస్‌ఎండీ సోహైల్‌కు చెన్నైకు చెందిన వీఎల్‌ఎస్ లాజిస్టిక్ సంస్థ అధినేత ఎల్.శ్రీనివాసన్ రూ. 2కోట్లకు చెక్కు ఇచ్చాడు.

05/21/2018 - 23:55

ఏన్కూరు, మే 21: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల మరిధిలోని భగవన్‌నాయక్‌తండాలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తండాకు చెందిన గుగ్గులోత్ రమేష్ (33) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రమేష్‌కు మణుగూరుకు చెందిన అనూషతో గత సంవత్సరం వివాహం జరిగింది.

05/21/2018 - 23:35

కుప్పం, మే 20: తమిళనాడు ఆర్టీసీ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గుడుపల్లి ఎస్సై భాస్కర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రం చిన్న బొమ్మరసపల్లి గ్రామానికి చెందిన చంద్రప్ప భార్య సరస్వతి(39), కుమారులు ప్రకాష్(18), సుబ్రమణ్యం(24)లు ద్విచక్రవాహనంలో ఆదివారం మధ్యాహ్నం ఓ వివాహానికి వెళ్లి తిరిగి వస్తున్నారు.

05/21/2018 - 23:33

ప్రొద్దుటూరు, మే 21: ప్రభుత్వం వేలకు వేలు జీతాలు ఇస్తూ ఉద్యోగాలు చేయమంటే రాష్ట్రంలో కొందరు స్వార్థం కోసం ప్రజలను పట్టిపీడిస్తుంటారని అందులో భాగంగా కడప జిల్లా యర్రగుంట్ల తహసీల్దారు కార్యాలయంలో సోమవారం ఏసీబీ వారు దాడులు నిర్వహించి మండలంలోని కల్లమల్ల వీఆర్‌ఓ భాషావల్లి లంచం తీసుకుంటుండగా పట్టుకొని అరెస్టుచేసినట్లు ఏసీబీ డీఎస్పీ నాగరాజు తెలిపారు.

05/21/2018 - 23:33

ప్రొద్దుటూరు, మే 21: కడప జిల్లా యర్రగుంట్ల రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కిందపడి సుబ్బరాయుడు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. సోమవారం ఒంటేరు సుబ్బరాయుడు (72) అనే వ్యక్తి మతిస్థిమితంలేక యర్రగుంట్ల సమీపంలో రైలు వెళ్తుండగా హటాత్తుగా రైలు కమీలపై పనుకున్నాడు. ఆ రైలు కిందపడి శరీరం రెండు భాగాలు అయినట్లు చూపరులు కూడా చూడలేక కల్లు మూసుకున్నారని పోలిసులు తెలిపారు.

05/21/2018 - 23:17

రాప్తాడు, మే 21 : మండల కేంద్రంలోని స్థానిక 44వ జాతీయ రహదారిపై లింగనపల్లి క్రాస్ వద్ద కారు బోల్తాపడడంతో ఆరు మంది గాయపడ్డారు. రాప్తాడు ఎస్‌ఐ ధరనిబాబు తెలిపిన వివరాల మేరకు హైదరాబాద్‌కు చెందిన 6 మంది మిత్రులు కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి గుడికి వెళ్ళి తిరిగి వస్తుండగా రాప్తాడు సమీపంలోకి రాగానే కారుకుముందు టైరు పగలడంతో రోడ్డు పక్కన కారు బోల్తా పడింది.

05/21/2018 - 04:23

తంగళ్ళపల్లి, మే 20: ప్రభుత్వ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వల వేసి ఆన్‌లైన్ ద్వారా డబ్బులు దండుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిరుద్యోగుల ఆశలను ఆసరాగా తీసుకుని మోసాలకు పాల్పడుతున్న ముఠాలు రోజు రోజుకు పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్నాయి. బలహీనతలను ఆసరాగా తీసుకుని ఆన్‌లైన్ మోసాలతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయి ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.

Pages