S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/11/2018 - 00:45

న్యూఢిల్లీ, జూలై 10: పేరుకున్న చెత్త గుట్టల మధ్య ఢిల్లీ సమాధి అవుతోందని, వర్షపునీటిలో ముంబయి మునిగిపోతోందని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. తమ రాష్ట్రాల పరిధిలో ఘన వ్యర్థపదార్ధాల యాజమాన్య నిర్వహణకు తీసుకుంటున్న చర్యలపై అఫిడవిట్లను దాఖలు చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పది రాష్ట్రాలకు , రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు జరిమానాను విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

07/10/2018 - 23:45

కాకినాడ, జూలై 10: కొత్తగా నిర్మించిన తక్కువ ఇంటికి పన్ను వేస్తానని ఇంటి యజమాని నుండి రూ.15 వేలు లంచం తీసుకుంటున్న తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఆదిశేషయ్యను మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

07/10/2018 - 06:06

కాల్వశ్రీరాంపూర్, జూలై 9: కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన పురం మధూకర్(25) ఆదివారం సాయంత్రం ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.

07/10/2018 - 04:34

నిజామాబాద్, జూలై 9: వరుసకు కుమార్తె అయ్యే ఓ అభంశుభం తెలియని బాలిక (14)ను గర్భవతిని చేసి ఆమె జీవితాన్ని నరకప్రాయంగా మార్చిన మారు తండ్రి, అనంతరం ఈ విషయం ఎలాగైనా బయటపడుతుందనే భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలో సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. నిజామా బాద్ జిల్లా నవీపేట మండలం మహంతం గ్రామానికి చెందిన సాయిలు (50)కు పాతికేళ్ల క్రితమే వివాహం జరిగింది.

07/10/2018 - 04:16

హైదరాబాద్, జూలై 9: చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధిలోని టెలిఫోన్ కాలనీలో ఉన్న నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదవుతున్న సూర్యాపేటకు చెందిన సూర్య అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీ సిబ్బంది వేధింపుల వల్లనే ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. యాజమాన్యానికి నిరసనగా 300 మంది విద్యార్థులు కాలేజీ ముందు బైఠాయించి నిరసన తెలిపారు.

07/10/2018 - 02:54

బాగ్‌పట్ (యూపీ): పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ ప్రేమ్‌ప్రకాష్ సింగ్ అలియాస్ మున్నా భజరంగిని ఇక్కడి జిల్లా జైలులో తోటి ఖైదీ ఒకరు సోమవారం కాల్చి చంపారు. ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి యూపీ యోగి ఆదిత్యనాథ్ వెంటనే దీనిపై విచారణ జరపాలని ఆదేశించారు. ఈ సంఘటనకు బాధ్యులను చేస్తూ నలుగురు జైలు సిబ్బందిని సస్పెండ్ చేశారు.

07/10/2018 - 02:30

న్యూఢిల్లీ, జూలై 9: నర్మదా బచావో ఆందోళన్ ఉద్యమ నాయకురాలు మేధా పట్కర్‌పై పరువు నష్టం కేసు నమోదైంది. ఖాదీ విలేజ్ అండ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) చైర్మన్ వీకే సక్సేనా ఆమెపై చేసిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ హైకోర్టులో కేసు నమోదైంది. 2006లో మేధా పట్కర్ తనపై అన్యాయంగా ఆరోపణలు చేసినట్టు ఒక టీవీ చానెల్‌లో ప్రసారం కావడంతో తన పరువుకు భంగం కలగడంతో బాధితుడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

07/10/2018 - 02:02

ఆత్మకూరు, జూలై 9 : గిరిజన మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తుతెలియని దుండగులు ఆమెను దారుణంగా గొంతుకోసి చంపేశారు. ఒక రోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దుర్ఘటన పట్టణ శివారు ప్రాంతంలో సంచలనం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దగదర్తి మండలం కాట్రాయపాడు గ్రామానికి చెందిన గందళ్ల శేషమ్మ (45) ఆత్మకూరు శివారు ప్రాంతంలోని అనంతరాయేని ఎస్సీ కాలనీలో ఉంటున్న పుట్టింటికి ఆదివారం వచ్చింది.

07/10/2018 - 02:08

మనుబోలు, జూలై 9 : సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వ్యక్తి వరసకు చెల్లెలిని వేధిస్తున్నట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని కుడితిపల్లి గ్రామానికి చెందిన చెలమల సుబ్రహ్మణ్యం కుమారై చెలమల సుమలత, కుమారుడు సతీష్ బీటెక్ చేసి నాలుగేళ్ల క్రితం నుంచి హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.

07/10/2018 - 00:39

న్యూఢిల్లీ, జూలై 9: సభ్య సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన 23ఏళ్ల మెడికో నిర్భయపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్య పైశాచిక కృత్యంలో దోషలకు ఉరిశిక్ష ఖరారైంది. ఇప్పటికే మరణ శిక్ష ఎదుర్కొంటున్న నలుగురిలో ముగ్గురు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు సోమవారం కొట్టివేసింది. మరణ శిక్ష నుంచి ఉపశమనం కల్పించాలంటూ దోషులు చేసిన వాదనలో ఎలాంటి పస లేదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.

Pages