S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

06/27/2018 - 00:40

గుర్రంపోడు, జూన్ 26: మండలంలోని నడికుడ గ్రామంలో మంగళవారం సాయంత్రం కట్టేబోయిన వెంకటయ్య(35)కు ప్రమాదవశాత్తు విద్యుత్ సర్వీస్ వైరు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. ఈ సంఘటనపై భార్య పుష్పలత ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్‌ఐ క్రాంతికుమార్ తెలిపారు

06/27/2018 - 00:33

హైదరాబాద్, జూన్ 26: తెలంగాణలో వెనుకబడిన కులాల (బీసీ) గణాంకాల వివరాలు తేల్చిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీ ఎన్నికలకు సంబందించి బిసి రిజర్వేషన్లు శాతం ఎంత అన్నది తేల్చాలని కాంగ్రెస్ నేతలు బి రవీందర్‌నాథ్, దాసోజి శ్రవణ్‌కుమార్ హైకోర్టును ఆశ్రయించారు.

06/26/2018 - 23:49

భద్రాచలం టౌన్, జూన్ 26: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని చర్ల మండలంలో మావోయిస్టులకు కొరియర్లుగా పని చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. భద్రాచలం ఏఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ మంగళవారం తెలిపిన వివరాల మేరకు..

06/26/2018 - 05:46

అనకాపల్లి, జూన్ 25: ఆకలిచావుతో తుమ్మపాల సుగర్స్ కార్మికుడు సోమవారం చింతలపాటి రాంబాబు(55) మృతి చెందారు. ఈ సుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న రాంబాబుకు గడచిన 45నెలలు నుండి జీతాలు లేక అర్ధాకలితో అలమటిస్తున్నారు. గడచిన గతకొంత కాలంగా గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. నెలలు తరబడి జీతాలు అందకపోవడంతో పూటగడవడానికి కష్టంగా ఉన్న తరుణంలో వైద్యం పొందేందుకు సైతం డబ్బులు లేక నానా అవస్థలు పడ్డాడు.

06/26/2018 - 05:42

చౌటుప్పల్, జూన్ 25: యాదాద్రి భువన గిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం గ్రామానికి చెందిన రైతు ఎర్రగోని అంజయ్య (60) తన వ్యవసాయ భూమికి రైతుబంధు పాసుపుస్తకం, పెట్టుబడి చెక్కు రాలేదని తహశీల్దార్ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొట్టి నిరాశకు గురై అదే భూమివద్ద చింత చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తాళ్లసింగారం శివారులో ఆదివారం రాత్రి జరిగింది.

06/26/2018 - 05:26

తుని, జూన్ 25: తూర్పు గోదావరి జిల్లా తుని మండలం వెలమకొత్తూరు గ్రామంలో సోమవారం ఉదయం యాత్రికులతో వెళుతున్న బస్సుకు విద్యుత్ తీగలు తగలడంతో బస్సు క్లీనర్ దుర్మరణం చెందాడు. డ్రైవర్ సహా ముగ్గురు గాయపడ్డారు. వివరాలిలావున్నాయి... ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన భక్తులు కాశీ యాత్ర నిమిత్తం ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో వెళ్ళారు.

06/26/2018 - 05:24

దుమ్ముగూడెం, జూన్ 25: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండల పరిధిలోని తూరుబాక గ్రామంలో 16 నెలల బాలికపై ఒక యువకుడు ఆదివారం అర్థరాత్రి లైంగిక దాడికి యత్నించాడు. ఆ యువకుడిని సోమవారం మండల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం భద్రాచలం పట్టణానికి చెందిన భూక్యా మమత తన 16 నెలల పాపతో తూరుబాక గ్రామానికి ఒక వివాహ వేడుకకు ఆదివారం హాజరైంది.

06/26/2018 - 02:37

పొందూరు,జూన్ 25:మండలం రాపాక పంచాయతీ పరిధిలో గల ఇల్లయ్యగారి పేట సమీపంలోనున్న కొండ క్వారీలో జి.సిగడాం మండలం పాలఖండ్యాం గ్రామానికి చెందిన ట్రాక్టర్ కూలి మాదర్స నాగరాజు (24) మృతి చెందాడు. ఇల్లయ్యగారిపేట కొండ ఆలి త్రినాధ్ క్వారీలో సోమవారం ఉదయం సుమారు 7గంటలకు ట్రాక్టర్ లోడింగ్ చేసారు.

06/26/2018 - 01:48

పొన్నూరు, జూన్ 25: మండల పరిధిలోని పచ్చలతాడిపర్రు గ్రామ శ్మశానవాటికలో సమాధి చేసిన మైనర్ బాలుడు డక్కుమళ్ల కిరణ్‌బాబు మృతదేహాన్ని సోమవారం అధికారులు బయటకు తీయించి, శ్యాంపిల్స్ సేకరించి పరీక్ష నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. వివరాల్లోకి వెళితే... పొన్నూరు పట్టణానికి చెందిన రత్నం, మేరి విజయకుమారి దంపతుల సంతానమైన డక్కుమళ్ల కిరణ్‌బాబు (17)కు మతిస్థిమితం తక్కువ.

06/26/2018 - 01:27

న్యూఢిల్లీ, జూన్ 25: చెట్లను నరికివేసి, ఆ స్థలాల్లో భవనాలను నిర్మించాలనుకోవడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని ఢిల్లీ హై కోర్టు స్పష్టం చేసింది. వచ్చేనెల నాలుగో తేదీ వరకూ చెట్లను నరికే ప్రయత్నం చేయవద్దని నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఎన్‌బీసీసీ)ని ఆదేశించింది. చెట్లు నరికి భవనాల నిర్మాణమా? అంటూ ఎన్‌బీసీసీని నిలదీసింది.

Pages