S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

06/24/2018 - 04:15

కల్లూరు, జూన్ 23:మండల పరిధిలోని లక్ష్మీపురం జగన్నాథగట్టుపై వెలసిన కోనేటిలో శనివారం ప్రమాదవశాత్తూ కాలు జారి కోనేటిలో పడి డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. వివరాలు.. వెల్దుర్తి గ్రామానికి చెందిన అగ్గిరాముడు కుమారుడు పసుపుల జయాకర్(కృష్ణ) జన్ననాథగట్టుపై వారి బంధువులు పుట్టెంట్రుకలు తీయిస్తుండటంతో అక్కడకి వచ్చారు.

06/24/2018 - 03:55

ఇబ్రహీంపట్నం, జూన్ 23: కంచికచర్లలోని మిక్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న నలుగురు విద్యార్థులు పవిత్ర సంగమం వద్ద గల్లంతయ్యారు. సేకరించిన సమాచారం ప్రకారం కంచికచర్ల మిక్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కాలేజీలో తరగతులు జరగకపోవటంతో శనివారం ఆట విడుపుగా ఐదుగురు విద్యార్థులు బయటకు వచ్చారు.

06/24/2018 - 03:52

కంకిపాడు, జూన్ 23: ప్రేమించినవాడి చేతిలో మోసపోయిన యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని పునాదిపాడులో సంచలనం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. పునాదిపాడు బీసీ కాలనీలో నివసించే లోయ రాణి(24) మైలవరంలోని లకిరెడ్డి బాలరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో గత సంవత్సరం ఈసీఈ పూర్తిచేసుకొని ఇంటి వద్ద ఖాళీగా ఉంటోంది. ఆమె ప్రేమించిన వ్యక్తి మోసగించినట్లు గుర్తించి తీవ్ర మనస్థాపానికి గురైంది.

06/24/2018 - 01:53

బొల్లాపల్లి, జూన్ 23: ఆస్తి వివాదం నేపథ్యంలో అన్నను తమ్ముడు హతామార్చాడు. ఈ సంఘటన బొల్లాపల్లి మండలంలోని గరికపాడు గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. పొలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దొంతు వెంకటయ్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరికి ఉన్న ఉమ్మడి ఇంటి స్థలం తండ్రితో పాటు అన్నదమ్ములు ఇద్దరూ పెద గోపాల్ (38), తమ్ముడు పున్నారావులు కొంత కాలం కిందట పంచుకున్నారు.

06/24/2018 - 01:52

దాచేపల్లి, జూన్ 23: దాచేపల్లిలో అక్రమంగా తరలి వెళుతున్న 240 బస్తాల లోడ్‌గల రేషన్ బియ్యం లారిని శనివారం పోలీసులు పట్టుకొని ఆరుగురు నిందితులను అరెస్ట్ చేయడంతోపాటు 2.76లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.

06/24/2018 - 01:51

పిడుగురాళ్ల, జూన్ 23: బాలుడు ఉరి వేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన పిడుగురాళ్ల పట్టణం లెనిన్ నగర్ మండల పరిషత్ హైస్కూల్‌లో శనివారం జరిగింది.

06/24/2018 - 01:46

కాకినాడ, జూన్ 23: పెదపూడి మండలంలోని జి మామిడాడలో ఓ బంగారు నగల దుకాణంలో జరిగిన చోరీకి గురైన 22 లక్షల బంగారు, వెండి వస్తువుల కేసులో నిందితులను పోలీసులు అరెస్టుచేశారు. వీరిని కాకినాడలోని ఓ భవనంలో ఉండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ నెల 10వ తేదీన మామిడాడలోని శ్రీ దుర్గామల్లేశ్వర నగల దుకాణంలో ఈ చోరీ జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ తన కార్యాలయంలో వివరించారు.

06/24/2018 - 01:42

తిరుపతి, జూన్ 23: ఎర్రచందనం స్మగ్లర్‌లకు రోజురోజుకు కష్టాలు పెరుగుతున్నాయి. దట్టమైన అడవుల్లో సంచరిస్తున్న స్మగ్లర్ల కదలికల గుట్టు రట్టు చేయడంలో టాస్క్ఫోర్స్‌కు చెందిన బిట్టు వారి పాలిట సింహ స్వప్నంలా మారుతోంది. ఇప్పటికే పలువురు స్మగ్లర్లను దట్టమైన పొదల్లో దాచివుంచుతున్న ఎర్రచందనాన్ని గుర్తించడంలో బిట్టు తిరుగులేని ప్రతిభను కనబరుస్తున్న విషయం పాఠకులకు విదితమే.

06/24/2018 - 01:32

బి.కోడూరు, జూన్ 23: మండల పరిధిలోని మేకవారిపల్లిలో ఆటో ప్రమాదం జరిగి పందిటి వెంకటసుబ్బమ్మ (50), పందిటి ఆదిలక్షుమ్మ (30) అనే ఇద్దరు మహిళలు మృతిచెందడంతో పాటు మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం వివరాల్లోకెళ్తే...

06/23/2018 - 05:55

కరీంనగర్ రూరల్, జూన్ 22: కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల్ల గ్రామ వాగులో 1984 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల్లో భాగంగా జిల్లాలో కురిసిన వర్షాలకు వాగు పొంగిపొర్లి వంతెనపై నుంచి నీటి ప్రవాహం వెళ్తుండగా, వంతెనపై దాటే క్రమంలో లారీతో సహా అందులోని డ్రైవర్ దౌలత్‌ఖాన్, పశువుల వ్యాపారులు ముగ్దంఖాన్, కటిక శంకర్, వెంకటస్వామి గల్లంతు కాగా, వారి అవశేషాలు శుక్రవారం చేపట్టిన ఇసుక తవ్వకాల్లో బయటప

Pages