S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

06/22/2018 - 04:37

మాచవరం, జూన్ 21: మండలంలోని మోర్జంపాడులో గురువారం పట్టపగలు వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. తీవ్ర సంచలనం కలిగించిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయ. స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన దుగ్గు పుల్లారెడ్డి (65), భార్య పూర్ణమ్మ (60)ను మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో దుండగులు గొంతు కోసి అతి కిరాతకంగా హతమార్చారు.

06/22/2018 - 04:23

నందికొట్కూరు, జూన్ 21:పగిడ్యాల పోలీస్‌స్టేషన్ పరిధిలోని వనములపాడు గ్రామంలో గురువారం అనుమానంతో భార్యను భర్తే నరికి చంపిన సంఘటన చోటుచేసుకుంది. వివరాలు.. పగిడ్యాల మండలం వనములపాడు గ్రామానికి చెందిన ఏసన్న కుమారుడు ముత్తయ్యకు కొత్తపల్లె మండలం ఎదురుపాడు గ్రామానికి చెందిన చెన్నయ్య, చంద్రమ్మ దంపతుల కూతురు రూతమ్మను ఇచ్చి 12 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు సంతానం.

06/22/2018 - 04:19

ఓజిలి, జూన్ 21: బంగారు నగలకు మెరుగు పెడతామని చెప్పి ఇద్దరు మహిళలను బురిడీ కొట్టించి 8 సవర్ల బంగారు ఆభరణాలను స్వాహా చేసిన సంఘటన గురువారం చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళితే.. ఓజిలి మండలంలోని చిలమానుచేను గ్రామానికి చెందిన ముంతల ప్రమీలమ్మ, ఆమె కోడలు భారతి ఇద్దరు ఇంటిలో ఉండగా గుర్తుతెలియని ఓ ఇద్దరు వ్యక్తులు వారి ఇంటికి వచ్చారు.

06/22/2018 - 03:59

పరవాడ, జూన్ 21: అదృశ్యమైన మైనర్ బాలిక స్వీటీ కుమారి ఆచూకీ లభ్యం అయినట్లు పరవాడ పోలీస్‌స్టేషన్ రైటర్ కెనడీ తెలిపారు. మండలంలో దేశపాత్రునిపాలెంలో నివాసం ఉంటున్న సిఐఎస్‌ఎఫ్ ఉద్యోగి సత్యేంద్ర కుమార్ సింగ్ కుమార్తె స్వీటీ సింగ్ ఈనెల 19వ తేదీన ఇల్లు విడిచి వెళ్లినట్లు బుధవారం పరవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

06/22/2018 - 03:49

నూజివీడు, జూన్ 21: భార్యభర్తల గొడవ విషయంపై పోలీసు స్టేషన్లో పంచాయతీ జరుగుతుండగా ఆవేశంతో భార్య భర్తపై చెప్పుతో కొట్టింది. అవమాన భారంతో భర్త ఇంటికి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చాట్రాయిలో గురువారం జరిగింది.

06/22/2018 - 03:47

రెడ్డిగూడెం, జూన్ 20: రెడ్డిగూడెం శివారు రాఘవాపురం గ్రామంలో వేంచేసి ఉన్న ఆంజనేయస్వామి దేవాలయంలో గల అత్యంత ఖరీదైన దేవతా విగ్రహాలు బుధవారం రాత్రి చోరీకి గురికావటంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.

06/22/2018 - 03:46

పాతబస్తీ, జూన్ 21: ఇష్టంలేని పెళ్లి నరకం నుండి తప్పించుకుని విజయవాడకు పరారై వచ్చిన ఓ యువతి వ్యభిచార గృహంలో బందీ అయింది. ఏడాది పాటు నకరం అనుభవించిన బాధితురాలు గురువారం ఉదయం కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేయటంతో నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా నామాలపాడు గ్రామానికి చెందిన ఈసం మధుమతి(19) తండ్రి అటవీ శాఖలో పనిచేసేవాడు.

06/22/2018 - 03:42

విజయవాడ (క్రైం), జూన్ 21: కారులో నగదు చోరీ కేసులో ఒకరిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని వద్ద నుంచి రూ.50వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం మొగల్రాజపురం నెహ్రూ నగర్‌కు చెందిన బూదాల భరత్ (21) ఇంటర్ చదివి మానేసి, నేరబాట పట్టిన క్రమంలో మధుగార్డెన్ మోడరన్ పబ్లిక్ స్కూలు ఎదురుగా పార్కింగ్ చేసిన కారు అద్దాలు పగులగొట్టి జూన్ 16న రాత్రి రూ.50వేలు నగదు అపహరించాడు.

06/22/2018 - 03:39

గచ్చిబౌలి, జూన్ 21: నేను నిరుద్యోగిని.. ఉద్యోగం లేదని బాధపడడం లేదు. ఆన్‌లైన్ షేర్ మార్కెట్‌లో కొంత డబ్బు పెట్టుబడి పెట్టాను. ఇప్పడు లక్షలు సంపాదిస్తున్నాను అంటూ అన్‌లైన్‌లో వచ్చే ప్రచారాలను చూసి యువత మోస పోతుంది.

06/21/2018 - 23:19

ఉరవకొండ, జూన్ 21 : ఈతకెళ్లి ఇద్దరు మృతి చెందిన ఘటన గురువారం పెన్నోబిలం సమీపంలోని ఏటి గంగమ్మ ఆలయం వద్ద చోటు చేసుకుంది. అనంతపురంలోని ఆదర్శనగర్‌కు చెందిన ఖాదర్ (40), అల్లుడు షాబాత్ (12) ఈతకెళ్లి నీట మునిగి మృతి చెందారు. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు ఖాదర్ బంధువులతో కలిసి ఉరవకొండలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరయ్యారు.

Pages