S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

06/21/2018 - 23:16

అనంతపురం అర్బన్, జూన్ 21: ప్రయాణీకుల్లా నటిస్తూ బస్సుల్లో బ్యాగులను చోరీ చేయటంతోపాటు తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడే రెండు వేర్వేరు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు సీసీఎస్ డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. వీరి వద్ద నుంచి పెద్ద మొత్తంలో దొంగతనానికి పాల్పడిన 45 తులాల బంగారం నగలను, 30 తులాల వెండిని స్వాధీనం చేసుకోన్నామన్నారు. వీటి విలువ రూ.15 లక్షలు ఉంటుందన్నారు.

06/21/2018 - 23:14

ధర్మవరం, జూన్ 21 : మండల పరిధిలోని ఏలుకుంట్ల గ్రామంలో ఉపాధి కూలీగా పనిచేసే బాలచంద్రమోహన్ (42) పురుగులు మందు తాగి గురువారం మధ్యాహ్నం మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలచంద్రమోహన్ భార్య లక్ష్మితో కలిసి గురువారం ఉపాధి పనులకు వెళ్ళాడు.

06/21/2018 - 23:14

తాడిపత్రి, జూన్ 21: మండల పరిధిలోని పెన్నా సిమెంట్ కర్మాగారం సమీపంలో గురువారం ట్రాక్టర్ బోల్తా పడి ఆసీఫ్(12) బాలుడు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలైనాయి. కర్నూలు జిల్లా తిమ్మనాయినిపేట గ్రామానికి చెందిన వారు హాజీవలి దర్గాలో కేశ ఖండన కార్యక్రమం ముగించుకొని గ్రామానికి ట్రాక్టర్ ట్రాలీలో దాదాపు 20మంది వెళ్తుండగా ప్రమాదం సంభవించింది.

06/20/2018 - 04:34

కోనరావుపేట, జూన్ 19: కోనరావుపేట మండలం మల్కపేట గ్రామానికి చెందిన ఎల్లంకి శ్రీనివాస్(50), పద్మ(45) దంపతులు బలవన్మరణం పొందారు. మంగళవారం ఉదయం ఇంటిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పులు ఆర్థిక ఇబ్బందులకు తోడు అనారోగ్యం ఈ చర్యకు కారణాలు అని తెలిసింది. శ్రీనివాస్‌కు సుమారు రూ.30 లక్షల మేరకు అప్పులు కాగా, అప్పులు చెల్లించలేని పరిస్థితిలో కొంత కాలంగా మనోవేదనకు గురవుతున్నట్టు తెలిసింది.

06/20/2018 - 04:33

ఇల్లందకుంట, జూన్ 19: మండలంలోని సిరిసేడు గ్రామంలో ఓ భూ తగాద విషయంలో రైతు దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవరం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బీసు నిర్మల, తిరుపతిలకు పూర్వీకుల నుంచి వచ్చిన 34 గుంటల భూమి ఉంది. కాగా గత కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయ సాగు చేస్తున్నారు.

06/20/2018 - 04:29

వరంగల్ క్రైం, జూన్ 19: వరంగల్ అర్భన్ జిల్లాలోని హసన్‌పర్తి మండల కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి అతి ఘోరం జరిగింది. దంపతుల కళ్లల్లో కారంపొడి చల్లి, గొంతుకోసి అతి దారుణంగా హతమార్చిన సంఘటనతో మండల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. హసన్‌పర్తి గ్రామానికి చెందిన గడ్డం దామోదర్(56), పద్మ(48) దంపతులు హసన్‌పర్తి జాతీయ రహాదారి పక్కనే కిరాణం షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

06/20/2018 - 04:26

తాండూర్, జూన్ 19: మండలంలోని బోయపల్లి గ్రామంలో మంగళవారం నకిలీ పత్తి విత్తనాలు పట్టుకుని, ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తాండూర్ ఎస్‌ఐ రవి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా వంటవారిపాలెంకు చెందిన పుట్ట శ్రీనివాస్, బెల్లంపల్లి మండలం గోండుగూడెం చెందిన కుర్సింగ అంబరావులు బోయపల్లిలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకోవడం జరిగిందన్నారు.

06/20/2018 - 04:18

సంగారెడ్డి, జూన్ 19: పరీక్షల్లో మాస్‌కాఫీయింగ్‌కు పాల్పడుతూ ఇన్విజిలెటర్‌కు పట్టుబడి డిబారైనందుకు మనస్థాపం చెందిన పీజీ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఖేడ్ ఎస్‌ఐ నరేందర్ కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

06/20/2018 - 04:15

కల్వకుర్తి, జూన్ 19: కల్వకుర్తి పట్టణంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన గ్యాంగ్ రేప్ నిందింతులను 24 గంటలు దాటకముందే పోలీసులు గుర్తించారు. మంగళవారం సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిఎస్పీ ఎల్‌సీ నాయక్ వివరాలు వెల్లడించారు. కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో వివాహిత మెడిసిన్ తీసుకొని వెళ్తుండగా ఆమెను రెండు బైక్‌లపై వెంబడించారు.

06/20/2018 - 04:14

మహబూబ్‌నగర్‌టౌన్, జూన్ 19: గత నెల 12న బాలానగర్ మండలం ఉడిత్యాల గ్రామానికి చెందిన మైనర్ కిడ్నాప్ కేసును చేధించి ఇద్దరిని బాలానగర్ పోలీసులు అరెస్టు చేసినట్లు డిఎస్పీ భాస్కర్ వెల్లడించారు. మంగళవారం డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాలానగర్ మండలానికి చెందిన సుజాత అనే మహిళ తన కూతురితో కలిసి జీవనం కొనసాగిస్తుండేది. అయితే మంజూల అనే మహిళతో సుజాతకు పరిచయం ఏర్పడింది.

Pages