S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

06/20/2018 - 04:09

మోర్తాడ్, జూన్ 19: మట్టికోసం మొండివాగులో తవ్విన గుంతలో నీరు నిండగా, అందులో పడి బావన నరేందర్ (42)అనే రైతు మృతి చెందాడు. ఇటీవల కురిసిన వర్షాలకు మొండివాగులోని గుంతలన్నీ నీటితో నిండిపోయాయి. అందులో మోటార్లను ఏర్పాటు చేసుకుని రైతులు పంటలు పండించుకుంటున్నారు. మంగళవారం బావిలో ఉన్న మోటార్‌ను సరి చేసేందుకు దిగగా, ప్రమాదవశాత్తు అందులోనే మునిగి మృతి చెందాడు.

06/20/2018 - 03:55

శామీర్‌పేట, జూన్ 19: రాజీవ్ రహదారి పై ఆర్టీసీ బస్సు ఢీ కొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన హృ దయ వీదారకమైన సంఘటన శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం కీసర మండ లం చీర్యాల గ్రామానికి చెందిన మలగల చిన్న పెంట య్య(45), యాదాద్రి జిల్లా , బొమ్మలరామారం మం డలం, తుర్కల తూంకుంటకు చెందిన యాదగిరి (43), వరసకు వియ్యంకులు.

06/20/2018 - 00:30

చిల్లకూరు, జూన్ 19: మండల పరిధిలోని ఓడూరు హరిజనవాడలో ఎఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగిశెట్టి వెంకటరమణయ్య ఇంటిలో మంగళవారం తెల్లవారుఝామున తలుపులను తొలగించి సినీఫక్కీలో చోరీకి పాల్పడ్డారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

06/20/2018 - 00:18

కర్లపాలెం, జూన్ 19: రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఓయువకుడు మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన బుద్దాం గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం కృష్ణా జిల్లా కోడూరు మండలానికి చెందిన కుంచాల యేసుబాబు యాజలి వైపునుండి కర్లపాలెం వస్తుండగా కర్లపాలెం నుండి బుద్దాంవైపు వెళుతున్న మరోబైకు ఎదురెదురుగా ఢీకొన్నాయి.

06/20/2018 - 00:11

రాజమహేంద్రవరం, జూన్ 19: ఉన్మాదంతో కన్న తల్లి తన ఆరేళ్ల కుమార్తెపై కర్కశంగా కత్తితో దాడి చేసి, హత్యాయత్నం చేసింది. పోలీసు కేసు నుంచి తప్పించుకునేందుకు కట్టుకథ అల్లింది. అయితే చిన్నారి బాలిక పోలీసులకు జరిగిన విషయం తెలియజేయడంతో కన్నతల్లి కర్కశం బయటపడింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం దివాన్‌చెరువులో నివసించే సుబ్బా శారద స్థానిక దాబాలో పనిచేస్తుంది. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.

06/19/2018 - 23:59

తాళ్లపూడి, జూన్ 19: చిన్నారి బాలికపై 25 ఏళ్ల యువకుడు అత్యాచారం చేసిన సంఘటన మంగళవారం పెద్దేవంలో చోటుచేసుకుంది. తాళ్లపూడి ఎస్సై అశోక్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దేవం గ్రామానికి చెందిన మూడవ తరగతి చదువుతున్న ఆరేళ్ల బాలికను మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో బుట్టాయగూడెం గ్రామానికి చెందిన మర్రి ఉదయ్‌కిరణ్ తన అమ్మమ్మ ఇంటికి వచ్చి ఈ దారుణానికి పాల్పడ్డాడు.

06/19/2018 - 23:34

గాండ్లపెంట, జూన్ 19: మండల పరిధిలోని కదిరి-రాయచోటి ప్రధాన రహదారిలోని తాళ్లకాల్వ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎన్.పీకుంట మండలం గోపాలపురంకు చెందిన బీ.చక్రే నాయక్ (17) అక్కడికక్కడే మృతి చెందగా, అదే మండలంలోని సున్నపుగుట్టతండాకు చెందిన మురళీ నాయక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్‌ఐ హరినాథ్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు..

06/19/2018 - 23:34

అనంతపురం అర్బన్, జూన్ 19: నగరంలోని నారాయణరెడ్డి కాలనీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి యమ్. శ్రీరామలు(44)ని సోమవారం గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా హత్య చేశారు. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు నారాయణరెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం అన్నారు. సోమవారం గుత్తి కోర్టుకు హాజరవ్వటం జరిగిందన్నారు. అనంతరం నగరానికి చేరుకొన్న శ్రీరాములు రాత్రి బయటికి వెళ్లినట్లు తెలిపారు.

06/19/2018 - 04:27

కనగల్, జూన్ 18: మండలంలోని రంగారెడ్డి బంగ్లా వద్ద కారు బైకును ఢీకొన్న సంఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, ఒకరు మృతిచెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై నర్సింహులు గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..

06/19/2018 - 04:13

హుజూరాబాద్ రూరల్, జూన్ 18: హుజూరాబాద్ మండలం చెల్పూర్ గ్రామంలో నిదనపురం సిరివల్లి (6) అనే చిన్నారి అనుమానాస్పద స్థితిలో సోమవారం శవమై కనిపించింది. కాగా తన మామే చిన్నారిని గొంతునులిమి హత్య చేశాడని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే చెల్పూర్ గ్రామానికి చెందిన నిదనపురం సంతోష్, స్వరూప దంపతులు జమ్మికుంటలో నివాసముంటున్నారు.

Pages