S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

05/18/2018 - 04:42

హైదరాబాద్: క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురు టాస్క్ఫోర్స్ అధికారులకు చిక్కారు. టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బేగంబజార్‌కు చెందిన మనోజ్ బత్తి, రాధాశ్యామ్ రాఠి, వినిత్ మంత్రి, సిటీ కాలేజీ సమీపంలోని ఆనంద్ గల్లీకి చెందిన జే.అరుణ్ కుమార్‌ను అరెస్టు చేసినట్లు డిసిపి తెలిపారు. వీరి నుంచి రూ.84350 నగదు, ఐదు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు.

05/18/2018 - 04:34

గుడివాడ, మే 17: గత ఏప్రిల్ 28వ తేదీ రాత్రి గుడివాడ పట్టణంలోని బేతవోలు స్మశానవాటికలో జరిగిన హత్యకేసును వన్‌టౌన్ పోలీసులు ఛేదించారు. మృతుడు గుడివాడ రూరల్ మండలం లింగవరం గ్రామానికి చెందిన ఇలపర్తి నాగచౌదరి(25)గా గుర్తించిన వన్‌టౌన్ పోలీసులు ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. నాగచౌదరి తలకు బలమైన గాయం కావడం వల్లే మృతి చెందినట్టుగా తేలింది.

05/18/2018 - 02:51

భువనగిరి, మే 17 : మండలంలోని అనాజీపురం గ్రామ శివారులో నివాసం ఉంటున్న సైదాచారిని కిడ్నాప్ చేసి 50లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్లను పోలీసులు వలపన్ని పట్టుకున్నట్లుగా డీసీపీ రామచంద్రారెడ్డి తెలిపారు. భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి కిడ్నాప్ ఉదంతాన్ని వివరించారు.

05/18/2018 - 01:54

న్యూఢిల్లీ, మే 17: తత్కాల్ రైల్వే టికెట్ల సాఫ్ట్‌వేర్‌ను దుర్వినియోగం చేసి అరెస్టయిన సీబీఐ ప్రోగ్రామర్ భారీగా అక్రమాస్తులు కూడగట్టినట్టు వెల్లడైంది. అజయ్ గర్గ్ అనే అసిస్టెంట్ ప్రోగ్రామర్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు తాజాగా కేసు నమోదు చేశారు. గర్గ్ ఆదాయానికి మించి 96.09 లక్షల రూపాయలు కలిగి ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.

05/18/2018 - 01:25

పాల్వంచ, మే 17: ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి వాహనంలో తిరుగుతున్న ఐదుగురు కిడ్నాపర్లను గురువారం పాల్వంచ పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం తెలిపారు. ఈ సందర్భంగా కిడ్నాపర్లను హాజరుపర్చిన పాల్వంచ డీఎస్పీ బి శ్రీనివాసులు వివరాలను వెల్లడించారు.

05/18/2018 - 04:13

న్యూ ఢిల్లీ: రాజ్యాంగ విలువలకు తిలోదకాలిచ్చి బీజేపీని ప్రభుత్వం ఏర్పాటుకు కర్నాటక గవర్నర్ ఆహ్వానం పంపారని ఆరోపిస్తూ, గవర్నర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రసిద్ధ న్యాయవాది రాంజెఠ్మలానీ గురువారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తున్నట్లు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ప్రకటించారు.

05/18/2018 - 00:23

న్యూఢిల్లీ, బెంగళూరు, మే 17: దేశ న్యాయ వ్యవస్థలో అరుదైన ఘట్టంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఆవిష్కృతమైంది. నరాలు తెగే ఉత్కంఠ పరిణామాల మధ్య సుప్రీం కోర్టు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున 2 గంటలకు సమావేశమై కర్నాటక గవర్నర్ బీజేపికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పంపిన ఆహ్వానాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించింది. దాదాపు

05/17/2018 - 23:58

హైదరాబాద్, మే 17: నిబంధనలు ఉల్లంఘించిన పోలీసులను సైతం నగర ట్రాఫిక్ పోలీసులు వదిలిపెట్టడం లేదు. ఇందుకు తాజాగా జరిగిన రెండు సంఘటనలే ఉదాహరణ. ఇటీవల పంజాగుట్ట స్టేషన్‌లో పని చేసే ఎస్‌ఐ ఒకరు సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్న సంగతి నగర సిపి అంజనీకుమార్ ఆదేశం మేరకు బదిలీ చేశారు.

05/17/2018 - 23:36

గాండ్లపెంట, మే 17: అనుమతి లేని పేలుడు పదార్థాలు శ్రీలక్ష్మినరసింహ క్వారీలో వుండగా వాటిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ హరినాథ్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు గొడ్డువెలుగల పంచాయతీలో క్వారీలో రాళ్లు పేల్చేందుకు వినియోగిస్తున్న తూటాలు, నల్లమందును గురువారం తమ సిబ్బందితో వెళ్లి స్వాధీనం చేసుకున్నామన్నారు.

05/16/2018 - 04:25

రెబ్బెన, మే 15: మండలంలోని క్రిష్టాపూర్ గ్రామానికి చెందిన దుర్గం నర్సయ్య (35)ను అతని భార్య జ్యోతి ప్రియుడితో కలిసి గొంతు నులిమి హత్య చేసిన సంఘటన సంచలనం సృష్టించింది.

Pages