S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

04/27/2018 - 02:26

విజయవాడ (క్రైం), ఏప్రిల్ 26: చోరీ కేసుల్లో ముగ్గురిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రెండు వేలు విలువైన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. పెజ్జోనిపేటకు చెందిన బెల్లంకొండ నాగేంద్రబాబు అలియాస్ బాబు(35) సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. రాజరాజేశ్వరీపేటకు చెందిన గొడా లింగమయ్య(23) టాపీ పని చేస్తుంటాడు.

04/27/2018 - 01:43

చీరాల, ఏప్రిల్ 26: క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న బృందాన్ని ఒకటవ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని లక్ష్మీ థియేటర్, బండపాలెం ప్రాంతాలలో బెట్టింగ్ జరుగుతుందన్న సమాచారం మేరకు సీఐ సూర్యనారాయణ ఆదేశాలతో సిబ్బంది దాడులు నిర్వహించారు.

04/27/2018 - 01:41

కోవెలకుంట్ల, ఏప్రిల్ 26:11 ఏళ్ల బాలికపై పాస్టర్ అత్యాచారానికి పాల్పడిన సంఘటన కోవెలకుంట్ల మండలంలో ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. దానికి సంబంధించి ఆళ్లగడ్డ డీఎస్పీ చక్రవర్తి తెలిపిన వివరాలు.. రేవనూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని వల్లంపాడు గ్రామానికి చెందిన లింగధారి ఓలం సుబ్బయ్య అదే గ్రామంలోని చర్చిలో పాస్టర్‌గా బోధనలు చేస్తుంటాడు. అతడికి గ్రామంలోనే ఒక కిరాణా కొట్టు ఉంది.

04/27/2018 - 01:29

మాచర్ల, ఏప్రిల్ 26: ఇంటి పన్ను తగ్గించేందుకు రూ. 18 వేలు లంచం తీసుకుంటున్న మున్సిపల్ ఆర్‌ఐ ప్రసాద్‌ను ఏసిబి అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. సంఘటన వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన కాటేపల్లి వేణుగోపాల్‌కు సొసైటీకాలనీ అన్నపూర్ణేశ్వరి ఆలయం ఎదురు మూడంతస్తుల భవనం ఉంది. కింద ఇంటికి 800 ఇంటి పన్ను ఉండగా మిగిలిన రెండు భవనాలకు కొత్తగా పన్ను విధించాలని ఆర్‌ఐ ప్రసాద్‌ను కలిశారు.

04/27/2018 - 01:18

గొల్లప్రోలు, ఏప్రిల్ 26: గొల్లప్రోలు-చేబ్రోలు గ్రామాల మధ్య 216 జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతిచెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పిఠాపురం నుండి కత్తిపూడి వెళుతున్న ఆటోను చెందుర్తి సెంటర్ సమీపంలో వైజాగ్ నుండి కాకినాడ వైపు వెళుతున్న లారీ ఢీకొట్టింది.

04/27/2018 - 00:52

మదనపల్లె, ఏప్రిల్ 26: ఐపిఎల్ మ్యాచ్‌లను క్రికెట్ బెట్టింగ్‌లుగా మార్చుకుని వేర్వేరు ప్రాంతాలలో బెట్టింగ్ జూదాలు ఆడుతున్న 17మంది బెట్టింగ్ రాయుళ్లను గురువారం అరెస్టుచేసినట్లు మదనపల్లె డిఎస్‌పి చిదానందరెడ్డి తెలిపారు. వారి వద్ద నుంచి 19 సెల్‌ఫోన్‌లు, రూ.78,380 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గురువారం మదనపల్లె వన్‌టౌన్ సర్కిల్ కార్యాలయంలోఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు.

04/27/2018 - 00:52

తంబళ్ళపల్లె, ఏప్రిల్ 26: అప్పుల బాధతో యువరైతు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. సంబంధించిన వివరాలిలా వున్నాయి. తంబళ్ళపల్లె మండలంలోని గుండ్లపల్లె పంచాయతీ, చెట్లవారిపల్లెకు చెందిన యగారం పెద్దరెడ్డెప్ప(42) అప్పుల బాధతో బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పొలం వద్దకు వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళి అక్కడే ఆత్మహత్య చేసుకున్నాడు.

04/26/2018 - 04:16

ముంబయి, ఏప్రిల్ 25: సోహ్రాబుద్దీన్ షేక్ బూటకపుఎన్‌కౌంటర్ కేసులో సీనియర్ పోలీసులు అధికారులకు విముక్తికల్పించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రివ్యూపిటిషన్ స్వీకరించిన బాంబే హైకోర్టు జూన్‌లో పునఃవిచారణ జరపనున్నట్టు వెల్లడించింది. సోహ్రాబుద్దీన్ సోదరుడు రుబాబుద్దీన్, సీబీఐ ఈ రివ్యూపిటిషన్లు దాఖలు చేశాయి. మొత్తం మూడు పిటిషన్లు దాఖలయ్యాయి.

04/26/2018 - 04:14

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: ప్రొఫెసర్ లైంగిక వేధింపులపై విద్యార్థులు ఫిర్యాదు చేసినా జవహార్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థినుల ఫిర్యాదుపై ఏం చర్యలు తీసుకున్నారంటూ వైఎస్ చాన్సలర్‌ను కోర్టు నిలదీసింది.

04/26/2018 - 02:44

కలిదిండి, ఏప్రిల్ 25: మండల పరిధిలోని కోరుకొల్లు గ్రామ శివారు గంజాలవారితోటలో 2010 ఏప్రిల్ నెలలో జరిగిన హత్య కేసులో నిందితుడైన గంజాల దుర్గారావు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఈ కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించిన గుడివాడ రెండవ అదనపు జిల్లా స్పెషల్ జడ్జి జి వల్లభనాయుడు నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు.

Pages