S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

04/17/2018 - 23:35

రేణిగుంట, ఏప్రిల్ 17: కోటి విద్యలు కూటి కొరకేనన్న నానుడిని.. ఒక్క అనుభవంతో కోటి మోసాలు చేయవచ్చని నానుడిని తిరగరాసిన ఎర్రావారిపాల్యెంకు చెందిన డేవిడ్‌కుమార్ అనే ఓ నిరుద్యోగ యువకుడు మంగళవారం రేణిగుంట విమానాశ్రయ పోలీసులకు అడ్డంగా చిక్కి కటకటాలపాలైన ఉదంతమిది. డేవిడ్‌కుమార్ డిగ్రీ చదువుకున్నాడు. ఎలాగైనా విమానాశ్రయంలో ఒక భద్రతాధికారిగా చేరాలని కలలు కన్నాడు.

04/17/2018 - 23:32

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 17: మండలంలోని జింగలపాల్యెం వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

04/17/2018 - 22:46

దుర్గి, ఏప్రిల్ 17: కారంపూడిలోని కార్తికేయ స్కూల్లో చదువుతున్న విద్యార్థిని పూజిత (5)అదే స్కూల్‌కు చెందిన బస్ కిందపడి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అడిగొప్పలకు చెందిన సంక్రాంతి ఆదినారాయణ కుమార్తె ఎల్‌కెజీలో కారంపూడిలోని కార్తికేయ పాఠశాలలో చేర్చారు. అడిగొప్పల నుండి కారంపూడికి విద్యార్థులను చేరవేసే బస్సు మంగళవారం తిరిగి విద్యార్థులను అడిగొప్పల ఇంటికి చేర్చేందుకు వచ్చింది.

04/17/2018 - 22:45

రెంటచింతల, ఏప్రిల్ 17: భర్త వేధింపులు తాళలేక తల్లీ, బిడ్డలు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన మండలంలోని రెంటాల గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. రెంటాల గ్రామానికి చెందిన సోము ఆంజనేయులు కుమార్తె కృష్ణవేణిని బెల్లంకొండ మండలం మాచాయపాలెం గ్రామానికి చెందిన బత్తుల రఘుకు 2009లో వివాహం చేశారు. వీరికి ఆరున్నర సంవత్సరాల కమలపిల్లలైన జేమ్స్, నాగజ్యోతి సంతానం.

04/17/2018 - 22:43

చేబ్రోలు, ఏప్రిల్ 17: స్థానికంగా ఓ బావిలో ఒక వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నారు. పోలీసుల కథనం ప్రకారం... చేబ్రోలులోని ఉప్పరపాలెంకు చెందిన వేల్పూరి శ్రీనివాసరావు (43) మృతదేహాన్ని మంగళవారం చేబ్రోలు పోలీసులు బావిలో కనుగొన్నారు. రెండు రోజుల క్రితం ప్రమాదవశాత్తు బావిలో పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. శ్రీనివాసరావు మృతదేహాన్ని బయటకు తీసి, జిజిహెచ్‌కు తరలించారు.

04/17/2018 - 22:37

కొత్తచెరువు, ఏప్రిల్ 17 : క్యాన్సర్‌కు కారణమనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన గుట్కా ప్యాకెట్లను కొత్తచెరువు కేంద్రంగా గత కొంతకాలంగా జిల్లా వ్యాప్తంగా వ్యాపారం కొనసాగిస్తున్న విషయం విదితమే. గతంలో సైతం కొత్తచెరువులో భారీ ఎత్తున గుట్కా ప్యాకెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నా గుట్కా వ్యాపారస్తులలో మార్పు రాకపోగా మరింత విస్తృతంగా వ్యాపారం సాగిస్తున్నారు.

04/17/2018 - 22:37

పెద్దవడుగూరు, ఏప్రిల్ 17 : మండల పరిధిలోని మిడ్తూరు గ్రామ పరిధిలోని రైల్వేట్రాక్‌పై మంగళవారం గుర్తుతెలియని మహిళా మృతదేహాన్ని ఆర్పీఎఫ్ పోలీసులు గుర్తించారు. తప్పిపోయిన మహిళల బాధితులు ఎవరైనా వస్తే శవాన్ని చూపిస్తామని పోలీసులు తెలిపారు. మహిళ వయస్సు 50 సంవత్సరాలు ఉండి, గోధుమ రంగు చీర ధరించి ఉన్నట్లు తెలిపారు.

04/17/2018 - 22:36

పామిడి, ఏప్రిల్ 17 : చేపల వేట కెళ్లి ప్రమాదవశాత్తు వాగులో పడి విద్యార్థి షన్ముఖ దత్తారెడ్డి (17) మృతి చెందిన ఘటన మండల పరిదిలోని పొగురూరు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పొగురూరు గ్రామానికి చెందిన ప్రతాప్‌రెడ్డి, లింగేశ్వరి దంపతుల కుమారుడు షన్ముఖ దత్తారెడ్డి పామిడి విజ్ఞాన్ పాఠశాలలో పదో తరగతి చదువుకున్నాడు. ఈమధ్యకాలంలోనే పరీక్షలు పూర్తయ్యాయి.

04/17/2018 - 22:35

తనకల్లు, ఏప్రిల్ 17: మండల పరిధిలోని కోటూరులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుళ్లాయప్ప కుమారుడు శివకుమార్ (12) అనే విద్యార్థి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు తిరుపతి, హిందూపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తిరుపతి నుండి హిందూపురంకు వెళ్తుండగా సైకిల్‌లో వెళ్తున్న విద్యార్థి శివకుమార్‌ను వెనుక వైపు నుండి ఢీకొంది. ఈ ప్రమాదంలో శివకుమార్ తీవ్రంగా గాయపడ్డాడు.

04/17/2018 - 04:31

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లోని కథువా గ్యాంగ్‌రేప్ బాధితురాలి కుటుంబానికి భద్రత కల్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. కేసు విచారణను చండీగఢ్ కోర్టుకు బదిలీ చేయాలని బాధితురాలి తండ్రి చేసిన అభ్యర్థనపై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని సుప్రీం స్పష్టం చేసింది.

Pages