S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

04/17/2018 - 03:20

వరంగల్, ఏప్రిల్ 16: వరంగల్ అర్బన్ జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఐదు సంవత్సరాల బాలికపై ఒకరు బిటెక్, మరొకరు పాలిటెక్నిక్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు లైంగిక దాడికి ఒడిగట్టారు. స్వయాన పెద్దనాన కూతురుపైనే ఇద్దరు సోదరులు ఐదుసంవత్సరాల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడటం కలకలం రేపింది.

04/17/2018 - 03:10

గురజాల, ఏప్రిల్ 16: పనె్నండేళ్ల బాలికను మాయమాటలతో నమ్మించి అత్యాచారానికి పాల్పడిన దారుణం గుంటూరు జిల్లాలో జరిగింది. గురజాల మండలం జెంగమహేశ్వరపురం గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు అందింది. గురజాల అర్బన్ సీఐ వై రామారావు కథనం ప్రకారం.. జెంగమహేశ్వరపురం గ్రామంలో యానాది కాలనీకి చెందిన 12 ఏళ్ల బాలిక ఆరవ తరగతి వరకు చదివి పాఠశాల మానేసి కూలి పనులు చేసుకుంటోంది.

04/17/2018 - 02:32

ధారూర్, ఏప్రిల్ 16: వికారాబాద్ జిల్లా మైలారం రైల్వేస్టేషన్‌లో యువతి అనుమానస్పదంగా మృతిచెందిన సంఘటన వికారాబాద్ రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యాలాల్ మండలం పగిడాయాల్ గ్రామానికి చెందిన జ్యోతి(21) హైదరాబాద్‌లోని లింగంపల్లిలోని బ్యూటీపార్లర్‌లో బ్యూటీషియన్‌గా పని చేస్తుంది. జ్యోతి తన తల్లిదండ్రులైన కాశమ్మ, మల్లికార్జున్‌తో కలిసి తాండూరులో ఉంటుంది.

04/17/2018 - 02:22

రాజేంద్రనగర్, ఏప్రిల్ 16: వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రాజేంద్రనగర్ ఏసీపీ, మైలార్‌దేవ్‌పల్లి ఇన్‌స్పెక్టర్ పీ.జగదీశ్వర్ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. పాతబస్తీ ఫలక్‌నుమా జంగమ్మెట్ ప్రాంతానికి చెందిన మహ్మద్ షబాజ్(25), అదే ప్రాంతానికి చెందిన మహ్మద్ రిజ్వాన్(22) స్నేహితులు. చోరీలకు పాల్పడుతున్నారు.

04/17/2018 - 02:10

పరకాల, ఏప్రిల్ 16: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పరకాల మండలం వరికోల్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై రవీందర్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పరకాల మండలం వరికోల్ గ్రామానికి చెందిన దొగ్గెల కుమారస్వామి (45) అనే రైతు తనకున్న రెండు ఎకరాల భూమిలో పంట వేయగా పంట దిగుబడి రాక తెచ్చిన అప్పులు ఏలా తీర్చాలనే మనోవేదనకు గురై ఆదివారం సాయంత్రం పరకాలకు వచ్చి పురుగుల మందు తాగినాడని చెప్పారు.

04/17/2018 - 02:08

స్టేషన్‌ఘన్‌పూర్, ఏప్రిల్ 16: కుటుంబ తగాదాలతో జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలంచాగల్ గ్రామ 8వ వార్డు సభ్యురాలు బాస్కుల కవిత(35) అనే వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం జరిగింది. ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. మృతురాలి భర్త యాదగిరి ఇజిఎస్‌లో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు.

04/17/2018 - 01:57

పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 16: మండలంలోని సబ్బితం గ్రామానికి చెందిన బోనగిరి నాగమణి (20) అనే యువతి ఆదివారం అర్థ రాత్రి ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. బోనగిరి నాగమణి గత కొంత కాలంగా హైదరాబాద్‌లో ఇంటి పని చేసుకొని జీవనం గడుపుతోంది. గత రెండు సంవత్సరాలుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతోంది.

04/17/2018 - 01:56

గోదావరిఖని, ఏప్రిల్ 16: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లెనిన్ నగర్‌లో సోమవారం సాయంత్రం ధనాల చంటి అలియాస్ దుర్గారావు (23) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్వయాన అనే్న తమ్మునిపై కత్తితో దాడి చేసి హతమార్చాడు. సోమవారం సాయంత్రం స్థానిక రెల్లి వాడలోని వారి ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గోదావరిఖని సీఐ వాసుదేవ రావు తెలిపిన వివరాల మేరకు ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ధనాల రామారావుకు ముగ్గురు కుమారులు.

04/17/2018 - 01:55

పెద్దపల్లి, ఏప్రిల్ 16: తన భూమిని రెవెన్యూ అధికారులు ఇతరుల పేరు రికార్డుల్లో మార్పిడి చేసి తనకు అన్యాయం చేశారని మనస్థాపం చెందిన మంథని మండలం సిరుపురం గ్రామానికి చెందిన సమ్మెట మల్లయ్య కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.

04/17/2018 - 01:40

పటన్‌చెరు, ఏప్రిల్ 16: ఎదురు ఎదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీ కొనగా ఒకరు మృతి చెందిన సంఘటన పటన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం జరిగింది. స్థానిక పోలీసులు అందించిన ప్రకారం వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. మండల పరిధిలోని చిట్కుల్ గ్రామ పంచాయతి పరిధిలోని వడ్డెర కాలనీకి చెందిన మారల పెద్ద మారయ్య(55) స్టోన్ కటర్‌గా పని చేస్తున్నాడు.

Pages