S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/23/2018 - 22:35

గోరంట్ల, మార్చి 23 : స్థానిక రావికుంట చెరువు రహదారిలో గుర్తు తెలియని దొంగలు గురువారం రాత్రి ఎస్‌బీఐ ఎటీఎంలో చోరీకి విఫలయత్నం చేశారు. ఏటీఎంను గడ్డపారతో ధ్వంసం చేసినా ఫలితం లేకపోవడంతో వెళ్లిపోయారు. అంతేగాక పక్కనే ఉన్న కిరాణా కొట్టు షట్టర్ పెకిలించి నగదు పెట్టెలో ఉన్న రూ.14 వేలు ఎత్తుకెళ్ళారు.

03/24/2018 - 03:33

హైదరాబాద్, మార్చి 23: హైదరాబాద్ శ్రీరామరథ యా త్రకు అనుమతి ఇచ్చేందుకు సింగిల్ జడ్జి కోర్టు నిరాకరించగా, ఈ ఆదేశాలను సవాలు చేస్తూ వీహెచ్‌పీ శుక్రవారం హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను విహెచ్‌పి తెలంగాణ కార్యదర్శి ఎం గాల్ రెడ్డి దాఖలు చేశారు. అత్యవసర మోషన్ కింద ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ కె.

03/23/2018 - 04:07

బొంరాస్‌పేట, మార్చి 22: మండల పరిధిలోని తుంకిమెట్లలో పోలీసులు గురువారం రాత్రి విస్త్రుత తనిఖీలు చేపట్టారు. కార్డెన్ సెర్చ్‌లో భాగంగా గ్రామంలో తనిఖీ చేయగా 19 బైక్‌లు, నాలుగు ఆటోలతో పాటు 32 బెల్లం ముద్దలు, గుట్కా ప్యాకెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఆడిషనల్ ఎస్పి పరమాల నర్సింలు ఆధ్వర్యంలో జరిగిన తనిఖీలో పరిగి డివిజన్ పరిధిలోని ఇద్దరు సిఐలు, ఏడుగురు ఎస్‌ఐలు, 65 మంది సిబ్బంది తనిఖీల్లో పాల్గోన్నారు.

03/23/2018 - 03:52

ముకరంపుర కరీంనగర్, మార్చి 22: మద్యం సేవించి వాహనాలు నడిపిన కేసుల్లో 40 మంది మందు బాబులకు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ గురువారం జిల్లాలోని వివిధ న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు తీర్పునిచ్చారు. ఇందులో 14 మందికి జరిమానా, పది మందికి శ్రమదానం, మిగతా వారికి జైలుశిక్షలు విధించారు. 40 మంది మందుబాబులకు రూ.51,600 జరిమానా విధించారు.
డ్రోన్ కెమెరాకు చిక్కిన ముగ్గురు

03/23/2018 - 03:54

మచిలీపట్నం/గుడివాడ, మార్చి 22: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన గుడివాడ జంట హత్య కేసులో ఇద్దరిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో నిందితులను మీడియా ముందు హాజరుపర్చిన తర్వాత గుడివాడలోని అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి నిందితులకు ఏప్రిల్ 4 వరకు రిమాండ్ విధించారు.

03/23/2018 - 03:46

ఆదిలాబాద్,మార్చి 22: ఆదిలాబాద్ పట్టణంలో ఈనెల 1న ఇరువర్గాల మద్య జరిగిన ఘర్షణ కేసులో తప్పించుకు తిరుగుతున్న మావల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఉష్కం రఘుపతిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమేరకు గురువారం టూటౌన్ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆదిలాబాద్ డిఎస్పీ నర్సింహారెడ్డి వివరాలు వెల్లడించారు.

03/23/2018 - 04:05

హైదరాబాద్, మార్చి 22: నగరంలో కరడుగట్టిన ముగ్గురు దొంగలను రెండు వేర్వేరు కేసుల్లో నగర పోలీసులు అరెస్టు చేశారు. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ఇళ్లలో చొరబడి దొంగతనాలు చేస్తుంటారు. వీరిలో ఒకరు పట్టపగలే ఇళ్ల తాళాలు పగుల గొట్టి చోరీలు చేయడంలో దిట్ట. నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

03/23/2018 - 02:56

న్యూఢిల్లీ, మార్చి 22: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్ (ఆర్‌కామ్) ఆస్తులను అతని సోదరుడు ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియోకు విక్రయించడంపై యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది.

03/23/2018 - 01:46

హైదరాబాద్, మార్చి 22: ఈ నెల 12వ తేదీన అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా చో టుచేసుకున్న ఘటనలపై వీడియో ఫుటేజీ సమర్పించేందుకు ఈ నెల 27వ తేదీ వరకు గడువు ఇస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. ఈ ఫుటేజీని శాసనసభ న్యాయ, లెజిస్లేచర్ శాఖ సమర్పిస్తుం ది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి శివశంకరరావు ఆదేశాలు జారీ చేశారు.

03/23/2018 - 01:40

హైదరాబాద్, మార్చి 22: హైదరాబాద్‌లో బాసర నుంచి సికింద్రాబాద్ తాడ్‌బాన్ హనుమాన్ దేవాలయం వరకు శ్రీ రామ రథయాత్ర నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ విశ్వహిందూ పరిషత్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. వీహెచ్‌పీ కార్యదర్శి ఎం. గాల్‌రె డ్డి పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టి స్ ఎం. సీతారామమూర్తి విచారించారు.

Pages